PM E-DRIVE: ఈవీ ఛార్జింగ్ స్టేషన్లకు బంపర్ సబ్సిడీ. లక్షల్లో లాభాలు!
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) వినియోగాన్ని పరుగులు పెట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన 'PM E-DRIVE' (PM Electric Drive Revolution in Innovative Vehicle Enhancement) పథకాన్ని అమల్లోకి తెచ్చింది. సుమారు రూ.10,900 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించిన ఈ పథకం ద్వారా అటు వాహనదారులకు, ఇటు ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసే వ్యాపారవేత్తలకు ప్రభుత్వం భారీ ఊరటనిస్తోంది. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇంధన పొదుపుపై పిలుపునిచ్చిన నేపథ్యంలో, ఈవీ మౌలిక సదుపాయాల కల్పన ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద బిజినెస్ ఆపర్చునిటీగా మారింది.
భారతదేశం 2030 నాటికి 30% వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం దేశవ్యాప్తంగా లక్షలాది ఛార్జింగ్ స్టేషన్ల అవసరం ఉంది. ప్రస్తుతం ఉన్న డిమాండ్‌కు, అందుబాటులో ఉన్న స్టేషన్లకు మధ్య భారీ వ్యత్యాసం ఉండటమే ఈ వ్యాపారంలో ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్.

భారత ప్రభుత్వ గణంకాల ప్రకారం, మార్చి 2026 నాటికి దేశంలో సుమారు 29,000 పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కానీ, 2030 నాటికి మన దేశానికి కనీసం 39 లక్షల ఛార్జింగ్ స్టేషన్లు అవసరమని అంచనా. అంటే రాబోయే నాలుగైదు ఏళ్లలో ఈ రంగంలో ఊహించని వృద్ధి ఉండబోతోంది.
పెట్టుబడి - ఆదాయం
చాలా మంది ఈ వ్యాపారం అంటే కోట్లతో కూడుకున్నది అనుకుంటారు. కానీ, ప్రాథమిక స్థాయి (Level 1 & 2 AC Charging) స్టేషన్‌ను కేవలం రూ. 1.5 లక్షల నుండి రూ. 2.5 లక్షల పెట్టుబడితో ప్రారంభించవచ్చు. ఒక మోస్తరు రద్దీ ఉన్న ప్రాంతంలో స్టేషన్ పెడితే, నెలకు సగటున రూ. 40,000 నుండి రూ. 70,000 వరకు ఆదాయం సంపాదించే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇతర వ్యాపారాలతో పోలిస్తే ఇందులో నిర్వహణ ఖర్చులు (Maintenance) చాలా తక్కువ.
PM E-DRIVE స్కీమ్ ద్వారా లభించే ప్రయోజనాలు:
ఈ పథకం కింద ప్రభుత్వం ఛార్జింగ్ మౌలిక సదుపాయాల కోసం దాదాపు రూ. 2,000 కోట్లను ప్రత్యేకంగా కేటాయించింది. దేశవ్యాప్తంగా 22,100 ఫాస్ట్ ఛార్జర్లు (ఫోర్ వీలర్స్), 1,800 బస్సు ఛార్జర్లు, 48,400 టూ-వీలర్/త్రీ-వీలర్ ఛార్జర్లను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం సబ్సిడీలను అందిస్తోంది.
పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ (PCS) ఏర్పాటు చేసే వారికి పరికరాల కొనుగోలుపై ప్రభుత్వం నిర్ణీత శాతం రాయితీని నేరుగా అందజేస్తుంది. దీనివల్ల సాధారణంగా అయ్యే ఖర్చు కంటే చాలా తక్కువ ధరకే స్టేషన్‌ను సిద్ధం చేయవచ్చు.
వ్యాపారం ప్రారంభించడం ఎలా? (స్టెప్-బై-స్టెప్):
- స్థలం ఎంపిక: కనీసం 100-200 చదరపు అడుగుల స్థలం ఉండాలి. సొంత స్థలం లేకపోయినా లీజుకు తీసుకోవచ్చు.
- విద్యుత్ కనెక్షన్: స్థానిక డిస్కమ్ (DISCOM) నుంచి ఈవీ ఛార్జింగ్ కోసం ప్రత్యేక లైన్ తీసుకోవాలి. చాలా రాష్ట్రాలు దీనికి తక్కువ టారిఫ్ (Commercial concessional rate) ఇస్తున్నాయి.
- PM E-DRIVE రిజిస్ట్రేషన్: కేంద్ర ప్రభుత్వ పోర్టల్ ద్వారా పథకానికి దరఖాస్తు చేసుకుని, సబ్సిడీని క్లెయిమ్ చేసుకోవచ్చు.
- నిర్వహణ: ఇది ఆటోమేటెడ్ బిజినెస్. కస్టమర్లే యాప్ ద్వారా ఛార్జ్ చేసుకుని డిజిటల్ పేమెంట్ చేస్తారు కాబట్టి సిబ్బంది అవసరం కూడా చాలా తక్కువ.
ప్రధాని మోడీ సూచించినట్లుగా "పర్యావరణ హిత ఇంధన వాడకం" భవిష్యత్తులో తప్పనిసరి కానుంది. కాబట్టి, ఇప్పుడే ఈ రంగంలో అడుగుపెట్టడం వల్ల పోటీ తక్కువగా ఉండి, లాభాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఇది కేవలం వ్యాపారం మాత్రమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడంలో ఒక భాగస్వామ్యం కూడా!














Click it and Unblock the Notifications