ఆల్ టైమ్ హై: జియో ఐపీఓ పూర్తి వివరాలు

దేశీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూ రాబోతోంది. దీనికి రిలయన్స్ ఇండస్ట్రీస్ సన్నాహాలు పూర్తి చేసింది. రిలయన్స్ డిజిటల్ వింగ్ జియో ప్లాట్‌ఫార్మ్స్ భారీ ఐపీఓకు సిద్ధమైంది. దీని విలువ 30,213 కోట్ల రూపాయలు. ఈ ఐపీఓ ఈ నెల 21న సబ్ స్క్రిప్షన్ కోసం ఓపెన్ కానుంది. 23 వరకు కొనసాగుతుంది. ఈ మూడు రోజుల్లో ఇన్వెస్టర్లు ఈ ఐపీఓకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2024లో వచ్చిన హ్యుందాయ్ మోటార్స్ రూ. 27,859 కోట్ల ఐపీఓ జియో దాటిపోనుంది.

అక్టోబర్ 28న స్టాక్ ఎక్స్ఛేంజీల్లో జియో షేర్లు లిస్టింగ్ అయ్యే అవకాశం ఉంది. దీనికంటే ముందు అంటే.. 19వ తేదీ నాడే యాంకర్ ఇన్వెస్టర్ల బిడ్డింగ్ జరగనుంది. సాధారణంగా మార్కెట్లోకి వచ్చే పెద్ద కంపెనీల ఐపీఓలలో ప్రమోటర్లు లేదా ప్రారంభ ఇన్వెస్టర్లు తమ వాటాలను ఆఫర్ ఫర్ సేల్ కింద విక్రయిస్తుంటారు. జియో ప్లాట్‌ఫార్మ్స్ ఐపీఓ దీనికి పూర్తి భిన్నం. ఫ్రెష్ ఇష్యూ రూపంలో రానుంది. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా సేకరించే నిధులలో ప్రతి రూపాయి కూడా పాత వాటాదారుల జేబుల్లోకి వెళ్లదు. ఐపీఓ ద్వారా వచ్చే మొత్తం సొమ్మంతా నేరుగా జియో సంస్థ ఖాతాలోనే చేరుతుంది.

India Biggest Fresh IPO Ever with Jio Launches Without Any OFS Pricing Band Set Open on October 21

జియో ప్లాట్‌ఫార్మ్స్ ఐపీఓ ఒక్కో షేర్ ప్రైస్ రూ. 1,065 నుంచి రూ. 1,119 గా నిర్ణయించారు. ఒక లాట్ లో 12 షేర్లు ఉంటాయి. ఒక లాట్ కొనడానికి రూ. 13,428 లను కేటాయించాల్సి ఉంటుంది. ఒక్కో రిటైలర్ గరిష్టంగా 12 బిడ్స్ దాఖలు చేయవచ్చు. గరిష్ఠ ధర ఆధారంగా కంపెనీ 27 కోట్ల ఫ్రెష్ షేర్లను జారీ చేయనుంది. ఈ ఐపీఓలో రిలయన్స్ ఇండస్ట్రీస్ వాటాదారుల కోసం రూ. 2,500 కోట్లు, అర్హులైన కంపెనీ ఉద్యోగుల కోసం రూ. 500 కోట్ల విలువైన షేర్లను ప్రత్యేకంగా కేటాయించారు. ఎంప్లాయిస్ కేటగిరీలో బిడ్ వేసేవారికి ప్రతి షేరుపై రూ. 54 తగ్గింపు లభిస్తుంది.

6జీ ప్రకటించిన జియో: కారు చౌకగా రూ. 4.9కు వన్ జీబీ డేటా: ఆకాష్ అంబానీ
6జీ ప్రకటించిన జియో: కారు చౌకగా రూ. 4.9కు వన్ జీబీ డేటా: ఆకాష్ అంబానీ

ఈ ఐపీఓ ద్వారా వచ్చే మొత్తంతో జియో ప్లాట్‌ఫార్మ్స్ మొత్తం మార్కెట్ క్యాప్ సుమారు రూ. 10.3 లక్షల కోట్లకు చేరుకుంటుంది. ఈ ఐపీఓ ద్వారా సేకరించిన నిధుల సేకరణతో జియో యాజమాన్యం తన మూలధన మొత్తాన్ని మరింత బలోపేతం చేసుకోనుంది. ఐపీఓ ద్వారా లభించే నిధులలో అధిక భాగాన్ని రుణాల చెల్లింపులకే ఉపయోగించనున్నారు. మొత్తం రూ. 30,213 కోట్లలో దాదాపు 91 శాతం అంటే రూ. 27,500 కోట్లను తన ప్రధాన అనుబంధ సంస్థ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ బకాయిల ప్రీపేమెంట్ లేదా రీపేమెంట్ కోసం కేటాయిస్తారు.

మిగిలిన మొత్తాన్ని ఇతర సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం వెచ్చిస్తారు. దీనివల్ల కంపెనీపై వడ్డీ భారం తగ్గి లాభాలు మరింత పెరిగే అవకాశం ఉంది. గతంలో భారత్ లో వచ్చిన దిగ్గజ ఐపీఓలతో పోలిస్తే జియో పూర్తిగా భిన్నమైనది. 2024లో వచ్చిన హ్యుందాయ్ మోటార్ ఇండియా రూ. 27,859 కోట్ల ఇష్యూ, 2022 నాటి ఎల్‌ఐసీ రూ. 20,557 కోట్ల ఆఫర్ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ పద్ధతిలోనే సాగాయి. అలాగే ఎన్‌ఎస్‌ఈ రూ. 22,562 కోట్ల ఐపీఓ కూడా ఓఎఫ్ఎస్ రూపంలోనే వచ్చింది. పేటీఎం, స్విగ్గీ, టాటా క్యాపిటల్ వంటి సంస్థలు ఫ్రెష్ షేర్లతో పాటు పాత వాటాల విక్రయాన్ని కలిపి ఐపీఓకు వచ్చాయి.

ప్రస్తుతం జియో ప్లాట్‌ఫార్మ్స్‌లో మెజారిటీ వాటా రిలయన్స్ ఇండస్ట్రీస్‌దే. దీని వాటా మొత్తం 66.43 శాతం. భాగస్వామ్య సంస్థలు మెటా- 9.98, గూగుల్‌- 7.73 శాతం వరకు వాటాలు ఉన్నాయి. ఈ ఇన్వెస్టర్లు ఎవరూ కూడా తమ వాటాలను విక్రయించట్లేదు.. అంటే జియో ఆఫర్ ఫర్ సేల్ కు వెళ్లట్లేదు. కంపెనీ డిజిటల్, టెలికాం వ్యాపారాల వాస్తవ విలువను మార్కెట్ లో ప్రతిబింబించడం, ప్రధాన కంపెనీ ఆర్థిక స్థితిని మెరుగుపరచడమే ఈ పబ్లిక్ ఇష్యూ ముఖ్య ఉద్దేశం.

జియో ఆర్థిక పురోగతి కూడా అత్యంత ఆశాజనకంగా ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నికర లాభం 15.1 శాతం పెరిగి రూ. 30,049 కోట్లకు చేరింది. కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం రూ. 1.47 లక్షల కోట్లుగా నమోదు కాగా, ఈబీఐడీటీఏ మార్జిన్ 51.9 శాతంగా రికార్డయింది. ప్రస్తుతం 53.3 కోట్ల కంటే ఎక్కువ మంది సబ్ స్క్రైబర్లతో దేశంలోనే అగ్రగామి టెలికాం సంస్థగా నిలిచింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+