Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

SBI రిపోర్ట్ షాక్: వెనెజువెలా చమురుతో భారత్‌కి భారీ లాభం

భారత్ తన ఇంధన దిగుమతుల భారాన్ని తగ్గించుకునేందుకు కొత్త దారులు వెతుకుతోంది. ఈ క్రమంలో... ఇప్పటివరకు పెద్దగా చర్చకు రాని ఒక ఎంపిక ఇప్పుడు ఆర్థిక వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్న ముడిచమురులో కొంత భాగాన్ని వెనిజులా హెవీ క్రూడ్‌తో భర్తీ చేస్తే భారత్ ఏటా బిలియన్ల డాలర్లు ఆదా చేయగలదన్న అంచనాలు వెలుగులోకి వచ్చాయి.

ఎస్‌బీఐ రీసెర్చ్ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం, భారత్ తన చమురు కొనుగోళ్లలో భాగంగా రష్యా స్థానంలో వెనిజులాను ఎంచుకుంటే, ఏటా సుమారు 3 బిలియన్ డాలర్ల వరకు దిగుమతి బిల్లు తగ్గే అవకాశం ఉంది. ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని, పూర్తిగా ధరలు-ఖర్చుల లెక్కల ఆధారంగానే ఈ వ్యూహం రూపొందిందని నివేదిక స్పష్టం చేసింది.

India May Cut Oil Import Bill by 3 Billion by Replacing Part of Russian Crude with Discounted Venezuelan Heavy Oil

వెనిజులా ఎందుకు?

ఎస్‌బీఐ నివేదికలో వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రస్తుతం వెనిజులా హెవీక్రూడ్ బ్యారెల్‌కు సుమారు 51 డాలర్లకు ట్రేడవుతోంది. ఈ ధరపై బ్యారెల్‌కు 10 నుంచి 12 డాలర్ల డిస్కౌంట్ లభిస్తే, ఎక్కువ దూరం నుంచి రవాణా చేయాల్సిన ఖర్చులు, బీమా, లాజిస్టిక్స్ వ్యయాలను కూడా సులభంగా భర్తీ చేయవచ్చని అంచనా. అప్పుడు భారత రిఫైనరీలకు ఇది ఆర్థికంగా లాభదాయకంగా మారుతుంది.

ఎస్‌బీఐ మాటల్లో చెప్పాలంటే, "ఆ డిస్కౌంట్ స్థాయిలో ఈ నిర్ణయం పూర్తిగా ఆర్థిక లాభంపైనే ఆధారపడి ఉంటుంది." అంటే... లాజిస్టిక్స్ పరంగా ప్రత్యేక లాభం లేకపోయినా, మొత్తం దిగుమతి బిల్లులో మాత్రం స్పష్టమైన పొదుపు సాధ్యమవుతుంది. ఈ కారణంగానే వెనిజులా ఎంపికను ఒక వ్యూహాత్మక ఆర్థిక అవకాశంగా నివేదిక అభివర్ణించింది.

దూరం...భారం..

వెనిజులా భారత్‌కు చాలా దూరంలో ఉంది. మధ్యప్రాచ్య దేశాలతో పోలిస్తే దాదాపు ఐదు రెట్లు, రష్యాతో పోలిస్తే రెట్టింపు దూరంలో ఉందని ఎస్‌బీఐ గుర్తు చేసింది. ఈ దూరం కారణంగా రవాణా సమయం, బీమా ఖర్చులు, షిప్పింగ్ వ్యయాలు పెరుగుతాయి. అందుకే, వెనిజులా చమురు నిజంగా లాభదాయకం కావాలంటే, ఆ ధర డిస్కౌంట్ ఈ అదనపు ఖర్చులను మించి ఉండాల్సిందే.

రిఫైనరీలు ప్రాసెస్ చేయగలవా?

సాంకేతికంగా అది సాధ్యమేనని ఎస్‌బీఐ చెబుతోంది. అయితే, వెనిజులా చమురు హెవీ గ్రేడ్ కావడంతో, ప్రాసెసింగ్ కాస్త క్లిష్టంగా ఉంటుంది. ఇతర గ్రేడ్‌లతో మిశ్రమం చేయాల్సి రావచ్చు. దీనివల్ల అదనపు ఆపరేషన్ ఖర్చులు ఉండే అవకాశం ఉంది. అయినప్పటికీ, భారత్‌కు ఉన్న ఆధునిక రిఫైనింగ్ సామర్థ్యం ఈ సవాళ్లను ఎదుర్కొనేంత బలంగా ఉందని నివేదిక అంచనా వేసింది.

ఎస్‌బీఐ రూపొందించిన 'బ్రూట్ ఫోర్స్ సినారియో' ప్రకారం, భారత్ తన ప్రస్తుత దిగుమతి విధానాన్ని కొనసాగిస్తూనే, రష్యా నుంచి వెనిజులా హెవీక్రూడ్‌కు గణనీయంగా మారితే, అనుకూలమైన ధరల పరిస్థితుల్లో ఏటా సుమారు 3 బిలియన్ డాలర్ల వరకు ఆదా సాధ్యమవుతుంది. ఈ అంచనాలు గత దిగుమతి ధోరణులను కూడా పరిగణనలోకి తీసుకున్నవే.

రాజకీయాలు తారుమారు..

అయితే ఈ లెక్కలను భౌగోళిక రాజకీయాలు తారుమారు చేయవచ్చని ఎస్‌బీఐ హెచ్చరిస్తోంది. ఉక్రెయిన్‌లో ఉద్రిక్తతలు తగ్గితే, ప్రస్తుతం రష్యా ముడిచమురుపై లభిస్తున్న భారీ డిస్కౌంట్లు తగ్గిపోయే అవకాశం ఉంది. అప్పుడు వెనిజులా ఆకర్షణ కొంత తగ్గవచ్చని నివేదిక పేర్కొంది. అయినా కూడా, బ్యారెల్‌కు 10-12 డాలర్ల డిస్కౌంట్ కొనసాగితే, వెనిజులా చమురు పోటీ స్థాయిలోనే ఉంటుందని స్పష్టం చేసింది.

మొత్తంగా చూస్తే... భారత్ ముడిచమురు వ్యూహం ఇప్పుడు పూర్తిగా ధరల ఆధారితంగా, సౌలభ్యంతో మారుతూ ఉండే విధంగా రూపాంతరం చెందుతోంది. ఒకే దేశంపై ఆధారపడకుండా, రష్యా, వెనిజులా, మధ్యప్రాచ్యం వంటి విభిన్న ప్రాంతాల నుంచి లభించే డిస్కౌంట్లు, రవాణా ఖర్చులు, రిఫైనరీ ఆర్థిక సమీకరణల ఆధారంగా చమురు మిశ్రమాన్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటుందని ఎస్‌బీఐ అంచనా వేస్తోంది. ఒకప్పుడు రాజకీయ కారణాలతో పక్కనపడిపోయిన వెనిజులా... ఇప్పుడు కేవలం ధరల లెక్కలతోనే మళ్లీ భారత్ చమురు మ్యాప్‌లోకి ప్రవేశిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+