Stock Market : నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. ఐటీ & ఆటోమొబైల్ రంగాల ఒత్తిడితో సూచీలు పతనం
దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) చివరి ట్రేడింగ్ రోజును నష్టాల్లో ముగిశాయి. ముఖ్యంగా ఐటీ, ఆటోమొబైల్ రంగాల్లో అమ్మకాల ఒత్తిడి సూచీలను ప్రభావితం చేసింది. సెన్సెక్స్ 191 పాయింట్లు కోల్పోయి 77,414.92 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 72.60 పాయింట్ల నష్టంతో 23,519.35 వద్ద ముగిసింది.
సెన్సెక్స్ ట్రేడింగ్ ప్రారంభంలో స్వల్ప లాభాలతో 77,690.69 వద్ద ప్రారంభమైంది. అయితే, ఇంట్రాడేలో 77,185.62-77,766.70 మధ్య హెచ్చుతగ్గులకు లోనైంది. చివరికి 191.51 పాయింట్ల నష్టంతో 77,414.92 వద్ద ముగిసింది. అటు నిప్టి సైతం 72.60 పాయింట్ల నష్టంతో 23,519.35 వద్ద స్థిరపడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త్వరలో సుంకాలపై ప్రకటన చేయనున్న నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో అమ్మకాల ఒత్తిడి పెరిగింది.

సెన్సెక్స్ 30 సూచీలో ఇండస్ ఇండ్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, మారుతీ సుజుకీ, ఇన్ఫోసిస్ షేర్లు ప్రధానంగా నష్టపోగా, కోటక్ మహీంద్రా బ్యాంక్, హిందుస్థాన్ యూనిలీవర్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా మోటార్స్, నెస్లే ఇండియా షేర్లు లాభపడ్డాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 85.48గా ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 74 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, బంగారం ఔన్సు 3077 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మార్కెట్‌లో నష్టాలు నమోదైనప్పటికీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండు ప్రధాన సూచీలు మదుపర్లకు 5 శాతం పైగా ప్రతిఫలం అందించాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ 7.48 శాతం, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 5.4 శాతం లాభాలు నమోదు చేశాయి. రంజాన్ సందర్భంగా సోమవారం (మార్చి 31) మార్కెట్‌కు సెలవు .












Click it and Unblock the Notifications