ఇన్ఫోసిస్ వివరణ: మా ఉద్యోగులు బోగస్ రీఫండ్ క్లెయిమ్ చేయలేదు

Posted By: Swetha
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: తమ ఉద్యోగులు ఆదాయం పన్ను (ఐటీ) రీఫండ్ మోసగించారని వచ్చిన ఆరోపణలు నిరాధారమని ఐటీ దిగ్గజం 'ఇన్ఫోసిస్' పేర్కొన్నది. తమ సిబ్బంది మోసగించినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఎటువంటి అభియోగాలు నమోదు చేయలేదని ఇన్ఫోసిస్ శుక్రవారం తెలిపింది. ఈ విషయమై సీబీఐ అధికారులు తమను సంప్రదించలేదని ఐటీ దిగ్గజం వివరించింది.
అయితే ఈ విషయమై తాము దర్యాప్తు అధికారులకు పూర్తిగా సహకరిస్తామని వివరణ ఇచ్చింది.'రివైజ్డ్ టాక్స్ రిటర్న్స్' పేరిట బోగస్ క్లెయిమ్స్ దాఖలు చేసిన కార్పొరేట్ సంస్థల ఉద్యోగులపై సీబీఐ కేసు నమోదు చేసిందని వార్తాకథనం ప్రచురిచితమైంది.

బోగస్ రీఫండ్ క్లెయిమ్స్‌తో రూ.1000 కోట్ల నష్టం
బోగస్ రీఫండ్ క్లెయిమ్స్ వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.1000 కోట్ల నష్టం వాటిల్లినట్లు ఆంగ్ల దినపత్రిక ప్రచురించిన వార్తాకథనం పేర్కొంది. ఇందులో పలువురు ఇన్ఫోసిస్ ఉద్యోగులు కూడా ఉన్నారని ఆ కథనం పేర్కొన్నది.

Infosys Says Not Named In FIR In Income Tax Fraud Case

చార్టర్ అక్కౌంటెంట్ (సీఏ)తో సంబంధం లేదన్న ఐసీఏఐ
ఇన్ఫోసిస్ సంస్థకు చెందిన కొందరు క్లెయిమ్స్ రీఫండ్ కోసం ఫైలింగ్ చేసిన చార్టర్డ్ అక్కౌంటెంట్ (సీఏ)తో తమకు సంబంధం లేదని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అక్కౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) ప్రకటించింది. వివిధ సంస్థలకు చెందిన 250 మంది పన్ను చెల్లింపు దారుల పేరిట నకిలీ పత్రాలతో 1010 రివైజ్డ్ టాక్స్ రిటర్న్స్ దాఖలు చేశారు. ఈ విషయమై వివరణ ఇవ్వాలని ఇన్ఫోసిస్‌ను బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ) ఆదేశించింది.

Infosys Says Not Named In FIR In Income Tax Fraud Case

సీబీఐ ఎఫ్ఐఆర్‌లో మా ఉద్యోగులు లేరని ఇన్ఫోసిస్
బీఎస్ఈకి ఇచ్చిన వివరణలో ఇన్ఫోసిస్ 'ఆదాయం పన్ను రీఫండ్ విషయమై బోగస్ క్లెయిమ్‌లు దాఖలు చేసినట్లు మీడియాలో వార్తలొచ్చాయి. సీబీఐ కేసు నమోదు చేసినట్లు పేర్కొంది.కానీ ఆ కేసులో ఇన్ఫోసిస్ పేరు గానీ, ఆ సంస్థలో పని చేసే ఉద్యోగుల పేర్లు గానీ లేవు' అని వివరణ ఇచ్చింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
IT major Infosys has clarified that the company has not been named as an accused party in First Information Report (FIR) filed by the Central Bureau of Investigation (CBI) in relation to an alleged income tax fraud. The IT major also said that the CBI has not contacted the company in connection with this matter.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి