ధన్‌తేరాస్ ధమాకా: రూ. వేల కోట్లు దాటిన పసిడి కొనుగోళ్లు: గిరాకీ వీటికే

ధన్‌తేరాస్ నాడు దేశవ్యాప్తంగా బంగారం, వెండి కొనుగోళ్లు భారీ ఎత్తున సాగాయి. పసిడి విక్రయాలు ఈసారి 60,000 కోట్ల రూపాయలను అధిగమించాయి. ధన త్రయోదశి నాడే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలో రూ. 2,500 లకు పైగా తగ్గడం మరింత కలిసొచ్చింది. కొనుగోళ్లకు ఊపుతెచ్చింది. దీపావళికి ముందు వచ్చే ఈ పవిత్రమైన రోజున పసిడి ఆభరణాలు, వెండి నాణేలు కొనుగోలు చేయడానికి షోరూమ్‌లకు వినియోగదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

గత ఏడాది ధన్‌తేరాస్‌తో పోలిస్తే ఈ సారి బంగారం ధరల రేట్లు ఎక్కువే. అప్పట్లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ. 1,29,584. ఇప్పుడిదే మొత్తం రూ. 1,43,460. అయినప్పటికీ కొనుగోలుదారులు వెనుకాడలేదు. ఢిల్లీ సహా దేశంలోని ప్రధాన నగరాల్లో బులియన్ మార్కెట్లు కొనుగోలుదారుల రాకతో సందడిగా మారాయి. ధన్ తెరాస్ తో పాటు ఈ పండగ సీజన్‌లో ఇప్పటివరకు నమోదైన మొత్తం విక్రయాలు రూ. 66,000 కోట్లు దాటినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.

Jewellers reported strong demand for gold and silver on Dhanteras with Gold sales by value 60000 cr

ఈసారి 18 క్యారెట్ల ఆభరణాలు, తేలికపాటి డిజైన్లు, చిన్న సైజు బంగారం, వెండి నాణేల కొనుగోలుకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు కొనుగోలుదారులు. దీనికితోడు పాత బంగారాన్ని ఇచ్చి కొత్త ఆభరణాలు తీసుకునే ఎక్స్ఛేంజ్ విధానం ఈ పండగ సీజన్‌లో బాగా పెరిగింది. ముఖ్యంగా చిన్న పట్టణాల్లో ఈ తరహా వ్యాపారం గణనీయంగా పుంజుకుందని ప్రముఖ జ్యువెలరీ సంస్థల ప్రతినిధులు పేర్కొన్నారు.

అర్ధాంతరంగా రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా స్టార్ బౌలర్- ఆ ఫార్మట్ కు గుడ్ బై
అర్ధాంతరంగా రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా స్టార్ బౌలర్- ఆ ఫార్మట్ కు గుడ్ బై

పసిడితో పాటు వెండి విక్రయాలు కూడా ఈ ధన్‌తేరాస్‌కు రికార్డు స్థాయిలో సాగాయి. వెండి అమ్మకాల విలువలో దాదాపు 30 శాతం పెరిగింది. గత ఏడాదితో పోల్చుకుంటే 10 శాతం వరకు వృద్ధి నమోదైంది. సంప్రదాయ ఆభరణాలతో పాటు నాణేలు, బిస్కట్లు, డిజిటల్ గోల్డ్, గోల్డ్ ఈటీఎఫ్‌ల వైపు కూడా అనేకమంది వినియోగదారులు మొగ్గు చూపారు. చిన్న మొత్తాల్లో పొదుపు చేసుకోవడానికి డిజిటల్ ప్లాట్ ఫామ్స్, నాణేలు ఉపయోగపడుతున్నాయని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడ్డాయి.

నేడు ధన్‌తేరస్- భారీగా తగ్గిన పసిడి రేట్లు: ఇంకెందుకు ఆలస్యం
నేడు ధన్‌తేరస్- భారీగా తగ్గిన పసిడి రేట్లు: ఇంకెందుకు ఆలస్యం

మెట్రోసిటీలతో పాటు టయర్-2, టయర్-3 పట్టణాల్లోనూ బంగారం, వెండి కొనుగోళ్ల జోరు స్పష్టంగా కనిపించింది. రాబోయే పెళ్లిళ్ల సీజన్ కూడా తోడు కావడంతో నగల కొనుగోలుదారులు ముందుగానే ఆర్డర్లు ఇచ్చి ధన్‌తేరాస్ రోజున వాటిని డెలివరీ తీసుకున్నారు. మార్కెట్ అంచనాల ప్రకారం ఈ పండగ సీజన్‌లో ప్రధాన జ్యువెలరీ బ్రాండ్లు 25 నుంచి 50 శాతం వరకు విక్రయాల వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉంది.

ప్రపంచంలోనే చైనా తర్వాత అత్యధికంగా బంగారాన్ని వినియోగించే దేశంగా భారత్ నిలుస్తోంది. ధరల్లో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ, ధన్‌తేరాస్ వంటి పండగ సమయాల్లో బంగారం కొనుగోలు చేయడం ఆనవాయితీ. ఈసారి ధరలు భారీగా తగ్గడం, పెళ్లిళ్ల సీజన్ కలిసిరావడంతో మార్కెట్ వర్గాల్లో ఆశాజనక వాతావరణం నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+