నేడు ధన్‌తేరస్- భారీగా తగ్గిన పసిడి రేట్లు: ఇంకెందుకు ఆలస్యం

నేడు.. ధన్‌తేరస్. ఈ శుభసందర్భాన బంగారం, వెండి కొనుగోలుదారులకు భారీ ఉపశమనం లభించింది. దీపావళి పండుగకు ముందు వచ్చే ఈ పవిత్ర దినాన పసిడి ఆభరణాలు, వెండి వస్తువులను కొనుగోలు చేయడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. ఈ పండుగ రోజున పసిడి, వెండి ధరలు చెప్పుకోదగ్గ స్థాయిలో దిగిరావడం కొనుగోలుదారుల్లో ఉత్సాహాన్ని నింపింది. బంగారం దుకాణాల్లో క్రమంగా పండగ సందడి నెలకొంటోంది.

సాధారణంగా పండుగ సీజన్లలో డిమాండ్ విపరీతంగా పెరగడం వల్ల బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని తాకుతుంటాయి. ఈ సారి ధన్‌తేరస్ వేళ మార్కెట్ స్థితిగతులు కొనుగోలుదారులకు అనుకూలంగా మారాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX) తో పాటు స్థానిక రిటైల్ బులియన్ మార్కెట్లలో కూడా పసిడి రేట్లు పడిపోవడంతో నగల దుకాణాలు కొనుగోలుదారులతో కళకళలాడుతున్నాయి. ఈ ధరల క్షీణత నగల ప్రియులకు ఓ మంచి అవకాశాన్ని ఇచ్చినట్టయింది.

Gold and silver prices down fall at MCX on Dhanteras after recent volatility in 24K 22K and 18K rates

అంతర్జాతీయ కామెక్స్ (Comex) మార్కెట్‌లో చోటుచేసుకున్న పరిణామాలు భారతీయ విపణిపై స్పష్టమైన ప్రభావాన్ని చూపాయి. గత సెషన్‌లో ధరలు స్వల్పంగా పుంజుకున్నప్పటికీ, ధన్‌తేరస్ సమయంలో గ్లోబల్ ట్రేడింగ్‌లో బంగారం 1.31 శాతం మేర పడిపోయి ఔన్స్ 4059.90 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. వెండి ధర కూడా 1.41 శాతం క్షీణించి ఔన్స్ 51.64 డాలర్లకు చేరుకుంది. దీని ప్రభావం దేశీయ మార్కెట్లపై పడింది. బంగారం, వెండి రేట్లు తగ్గుముఖం పట్టాయి.

బెంగళూరులో అత్త వారింట్లో ఏడుమందిని గ్రైండింగ్ స్టోన్ తో మట్టుబెట్టిన క్యాబ్ డ్రైవర్
బెంగళూరులో అత్త వారింట్లో ఏడుమందిని గ్రైండింగ్ స్టోన్ తో మట్టుబెట్టిన క్యాబ్ డ్రైవర్

డిసెంబర్ ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో పసిడి 10 గ్రాములకు రూ.1,900 వరకు పడిపోయి రూ.1,42,150 వద్ద నమోదైంది. వెండి కాంట్రాక్టులు ఏకంగా రూ. 2,900 మేర తగ్గి కిలో రూ.1,84,210 స్థాయికి చేరుకున్నాయి. హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,42,660 వద్ద స్థిరపడింది. 10 గ్రాముల 22 క్యారెట్లు రూ. 1,30,773గా కొనసాగుతోంది. ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 1,42,490 గా రికార్డు కాగా.. 22 క్యారెట్లు రూ. 1,30,616 వద్ద ట్రేడ్ అయింది.

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం: ఏపీలో నేడు ఈ జిల్లాల్లో వర్షాలు
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం: ఏపీలో నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

చెన్నైలో ఇవే రేట్లు వరుసగా రూ. 1,42,850, రూ. 1,30,946 వద్ద నిలిచాయి. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 1,42,610, 22 క్యారెట్లు రూ. 1,30,720 వద్ద కొనసాగుతున్నాయి. అటు వెండి రేట్లు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్డాయి. హైదరాబాద్ లో కిలో వెండి రూ. 1,84,740 వద్ద నిలిచింది. ముంబైలో రూ. 1,84,310, చెన్నైలో రూ. 1,30, 946, బెంగళూరులో రూ. 1,84,310 గా నమోదైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+