వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జైట్లీజీ! పసిడిపై దిగుమతి సుంకం తగ్గించండి: గతేడాది 67 శాతం పెరిగి స్వర్ణ దిగుమతి

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/ముంబై: భారతీయ వనితలకు ఆభరణాలంటే ఎంతో ప్రీతి. అవసరమైతే తమ ఇతర ఖర్చులు తగ్గించుకుని మరీ ఆభరణాల కొనుగోలుకు ప్రాధాన్యం ఇస్తారు. అంతే కాదు పెట్టుబడికి పసిడి ఒక మార్గం కూడా. పల్లెల్లో ప్రజలు పంటల సాగు చేసేందుకు అవసరమైన రుణాల కోసం బ్యాంకుల్లో బంగారం తాకట్టు పెట్టేందుకు వెనుకాడరు. ప్రస్తుతం ఆధునిక ప్రపంచంలో తల్లులు తమ పిల్లల ఉన్నత విద్యాభ్యాసం కోసం నగలు బ్యాంకుల్లో తాకట్టుబెట్టి రుణాలు తీసుకుంటున్నారు. స్టాక్ మార్కెట్లలోనూ పసిడిపై ఈటీఎఫ్ ట్రేడింగ్ జరుగుతున్నది. అంతే కాదు చైనా తర్వాత అత్యధికంగా పసిడి దిగుమతి చేసుకుంటున్న దేశం మనది. భారతీయుల దిగుమతుల్లో 80 శాతం పసిడిదే వాటా.

ఇప్పటికే ముడి చమురు దిగుమతితో కరంట్ ఖాతా లోటు 'క్యాడ్' పెరిగి దేశీయ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతున్నది. గతేడాది జూన్ నెలతో ముగిసిన త్రైమాసికానికి 'క్యాడ్' 12.96 బిలియన్ల డాలర్లకు చేరుకున్నది. దీన్ని అధిగమించేందుకూ, ఆదాయం సంపాదించుకునేందుకు పసిడిపై దిగుమతి సుంకంతోపాటు విక్రయాల తీరు తెన్నులపైనా ఆంక్షలు అమలులోకి తెచ్చింది. అయితే వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అమలులోకి రావడంతో తలెత్తిన సమస్యలను పరిష్కరించేందుకు పసిడి దిగుమతిపై సుంకం నాలుగు శాతానికి తగ్గించాలని జెమ్స్ అండ్ ఆభరణాల పరిశ్రమ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీని కోరుతోంది. ప్రస్తుతం పసిడి దిగుమతిపై పది శాతం సుంకం వసూలవుతోంది.

అండ్ జ్యువెల్లరీ ఫెడరేషన్

అండ్ జ్యువెల్లరీ ఫెడరేషన్

పసిడి కొనుగోళ్ల ఇన్ వాయిస్ విలువ పెంచాలన్న డిమాండ్
ప్రతియేటా ఉగాది పండుగ తర్వాత వివాహాలు జరుగుతాయి. ఈ క్రమంలో బిజినెస్ సెంటిమెంట్‌ను బలోపేతం చేసేందుకు దిగుమతి సుంకాన్ని నాలుగు శాతానికి తగ్గించాలని ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యువెల్లరీ ట్రేడ్ ఫెడరేషన్ (ఏఐజీజేఎఫ్) చైర్మన్ నితిన్ ఖండేల్వాల్ కోరారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక, వాణిజ్య శాఖ మంత్రులకు వినతి పత్రాలు సమర్పించారు. దిగుమతి సుంకం తగ్గించడం వల్ల నల్లధనంపై పోరాటానికి మార్గం సుగమం అవుతుందని తెలిపారు. జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత జాబ్ వర్కర్లకు ముడి సరుకును రాష్ట్రాల మధ్య రూ. 20 లక్షల విలువైన బంగారం సరఫరా చేసేందుకు అనుమతించాలని కోరుతున్నారు. ప్రస్తుతం ప్రజలు తమ బంగారం కొనుగోళ్లపై ఇంటి అడ్రస్సులు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. బంగారం కొనుగోళ్లు రూ. 10 వేల లోపే నగదుపై చేయాలని కేంద్రం నిబంధన పెట్టింది. దీన్ని రూ. లక్షకు పెంచాలని జ్యువెల్లరీ వ్యాపారులు కోరుతున్నారు. ప్రస్తుతం రూ.50 వేల లోపు అనుమతినిస్తున్న ‘ఇన్ వాయిస్' ను రూ.2 లక్షలకు పెంచాలని కోరుతున్నారు.

జెమ్స్ అండ్ జ్యువెల్లరీలో ఉపాధి అవకాశాలపైనే ఫోకస్

జెమ్స్ అండ్ జ్యువెల్లరీలో ఉపాధి అవకాశాలపైనే ఫోకస్

పసిడిపై దిగుమతి సుంకం తగ్గించాలని జ్యువెల్లరీ పరిశ్రమతోపాటు కేంద్ర ఆర్థికశాఖను వాణిజ్య వ్యవహారాలశాఖ కూడా కోరుతున్నది. జెమ్స్ అండ్ జ్యువెల్లరీ ఎగుమతులను ప్రోత్సహించేలా దిగుమతి సుంకం నిర్ణయించాలని జెమ్స్ అండ్ జ్యువెల్లరీ ఎక్స్ పోర్ట్స్ ప్రమోషన్ కౌన్సిల్ (జీజేఈపీసీ) డిమాండ్ చేసింది. దీనివల్ల దేశీయంగా పసిడి, ఆభరణాల ఎగుమతులు పెరుగుతాయని అంచనా వేస్తోంది. ఎగుమతుల పెంపునకు అనుసరించాల్సిన వ్యూహంలో భాగంగా ఆభరణాల ఎగుమతి ప్యాకేజీ అమలు చేసేందుకు జెమ్స్ అండ్ జ్యువెల్లరీ పరిశ్రమతో చర్చిస్తూ మార్గదర్శకాలు రూపొందిస్తున్నదని ఇటీవల కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి సురేశ్ ప్రభు చెప్పారు. దీనివల్ల ఎగుమతులకు ప్రోత్సాహంతోపాటు యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు.

 రీ స్టాకింగ్, రిటైల్ మార్కెటింగ్‌లో ఇలా డిమాండ్

రీ స్టాకింగ్, రిటైల్ మార్కెటింగ్‌లో ఇలా డిమాండ్

ఇదిలా ఉంటే 2016తో పోలిస్తే 2017లో పసిడి దిగుమతులు 67 శాతం పెరిగాయి. రీ స్టాకింగ్‌తోపాటు రిటైల్ మార్కెట్‌లో డిమాండ్ పెరిగిందని పసిడి వ్యాపారులు చెప్తున్నారు. 2017లో 855 టన్నుల బంగారం, పసిడి ఆభరణాలు దిగుమతి అయ్యాయి. గతేడాది స్పాట్ గోల్డ్ వాల్యూ కిందటేడాదితో పోలిస్తే 2017లో 13 శాతం పెరిగింది. 2010 తర్వాత స్పాట్ గోల్డ్ వాల్యూ పెరగడం ఇదే మొదటిసారి. 2016 చివరిలో రూ.1000, రూ.500 నోట్లు రద్దు చేస్తూ ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న నిర్ణయం ప్రతికూల ఫలితాలనిచ్చిందన్న అభిప్రాయం ఉంది. నగదు కొరత ఏర్పడి పసిడి కొనుగోళ్లు పడిపోయాయని, తిరిగి 2017లోనే పుంజుకున్నామని వ్యాపారులు చెప్తున్నారు. 2017లో వర్షాలు సరిగ్గా కురవడంతో సెంటిమెంట్ పండిందంటున్నారు.

 గత నెలలో 40 శాతం పెరిగిన పసిడి దిగుమతులు

గత నెలలో 40 శాతం పెరిగిన పసిడి దిగుమతులు

గతేడాది గ్రామీణ ప్రాంతాల్లోనూ ఈ దఫా డిమాండ్ ఎక్కువగా ఉన్నదని వ్యాపారులు అంటున్నారు. అయితే అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లు పెంచుతుందన్న అంచనాల మధ్య అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు ఐదు నెలల దిగువ స్థాయికి పడిపోయాయి. దీనివల్ల గతనెలలో వ్యాపారులు ధరల సర్ధుబాటుకు ప్రాధాన్యం ఇచ్చారని ముంబైలోని ఒక ప్రైవేట్ బ్యాంకులో ఖాతాదారు అయిన బులియన్ డీలర్ చెప్పాడు. 2016 డిసెంబర్ నెలతో పోలిస్తే 2017లో 40 శాతం (70 టన్నులు) పసిడి కొనుగోళ్లు పెరిగాయి.

English summary
Gems and jewellery industry body has urged the government to reduce the import duty on gold to 4 per cent and also address issues under the GST regime in the coming Budget. "Lowering the duty to 4 per cent from 10 per cent will not only boost customer demand and uplift business sentiment for the trade, but also help industry become more organised and compliant," All India Gems and Jewellery Trade Federation (GJF) chairman Nitin Khandelwal said in the representation to the government.The reduction in import duty will also help in the fight against black money, he added.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X