Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Adani Group ‘మిషన్ 2035’: ఇంధనం, లాజిస్టిక్స్ రంగాల్లో భారీ మార్పులు

భారత పారిశ్రామిక రంగ దిగ్గజం అదానీ గ్రూప్, తన తదుపరి దశాబ్ద కాలపు ప్రస్థానానికి ఒక స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేసుకుంది. కేవలం వ్యాపార విస్తరణే కాకుండా.. ఆధునిక సాంకేతికత, పటిష్ఠమైన పాలనా సంస్కరణలు, సుస్థిర అభివృద్ధిని మేళవిస్తూ ఒక సమగ్ర మార్పునకు శ్రీకారం చుడుతోంది. న్యూఢిల్లీలో జరిగిన అఖిల భారత మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (AIMA) ప్లాటినం జూబ్లీ ఉత్సవాల్లో అదానీ పోర్ట్స్ ఎండీ కరణ్ అదానీ ప్రసంగిస్తూ, సంస్థ రూపాంతీకరణను వివరించారు. 2035 నాటికి 100 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో భారత్‌ను గ్లోబల్ మౌలిక వసతుల కేంద్రంగా మార్చడమే తమ లక్ష్యమని ఆయన ప్రకటించారు.

అదానీ గ్రూప్ ప్రధానంగా మూడు అంశాలపై తన వ్యూహాత్మక దృష్టిని కేంద్రీకరిస్తోంది. అవే - ఇంధనం, లాజిస్టిక్స్, కీలక వస్తువులు. నగర గ్యాస్ పంపిణీ, విద్యుత్ ప్రసారం,, డేటా సెంటర్ల వంటి డిజిటల్ ఆస్తులతో కూడిన ఇంధన మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేయనున్నట్లు కరణ్ అదానీ వెల్లడించారు. అలాగే, రక్షణ రంగంలో స్వదేశీ తయారీని ప్రోత్సహించడం జాతీయ ప్రాధాన్యతగా భావిస్తున్నామని, బ్రెజిలియన్ సంస్థ ఎంబ్రాయర్‌తో భాగస్వామ్యం ద్వారా విమానయాన మరియు రక్షణ పర్యావరణ వ్యవస్థను నిర్మించడమే తమ ఉద్దేశ్యమని ఆయన స్పష్టం చేశారు.

Karan Adani Outlines Governance Defence and Growth Priorities at AIMA Platinum Jubilee Celebrations

అత్యంత పారదర్శకంగా..

సంస్థాగత మార్పుల విషయంలో కరణ్ అదానీ అత్యంత పారదర్శకంగా వ్యవహరించారు. వేగంగా విస్తరిస్తున్న క్రమంలో నిర్ణయాధికార ప్రక్రియ మందగించిందని అంగీకరించిన ఆయన, ఇప్పుడు సంస్థాగత నిర్మాణాలను సరళీకరించడం ద్వారా స్కేలబిలిటీని మెరుగుపరుస్తున్నట్లు తెలిపారు. కృత్రిమ మేధస్సు (AI), డిజిటల్ టెక్నాలజీలను అందిపుచ్చుకోవడానికి ఉద్యోగుల సగటు వయస్సును 38 ఏళ్లకు తగ్గించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. అలాగే సంస్థలో మహిళా భాగస్వామ్యాన్ని గతంలో ఉన్న 2 శాతం నుండి 15 శాతానికి పెంచడం ఒక గొప్ప విజయమని ఆయన పేర్కొన్నారు.

పెట్టుబడిదారుల విశ్వాసాన్ని..

పాలన, పారదర్శకతపై వస్తున్న ప్రశ్నలకు సమాధానమిస్తూ, పటిష్ఠమైన కార్యాచరణ సూత్రాలే తమ బలం అని ఆయన అభివర్ణించారు. ప్రపంచ మార్కెట్లలో తమ గ్రూప్ యొక్క కథనాన్ని (Narrative) మరింత మెరుగ్గా వివరించాల్సిన అవసరం ఉందని, పారదర్శకమైన కమ్యూనికేషన్ ద్వారా పెట్టుబడిదారుల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. సుమారు 80 శాతం నాయకత్వ స్థానాలను అంతర్గత ఉద్యోగులకే కేటాయించడం ద్వారా నాయకత్వ వృద్ధికి పెద్దపీట వేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

డీజిల్ వాహనాలను ఈవీలుగా..

సుస్థిరత, పర్యావరణ బాధ్యత విషయంలో అదానీ గ్రూప్ ముందడుగు వేస్తోంది. డీకార్బనైజేషన్ ప్రక్రియలో భాగంగా తమ పోర్ట్ కార్యకలాపాల్లో డీజిల్ వాహనాలను గ్రీన్ ఇంధన వాహనాలుగా మారుస్తున్నామని కరణ్ అదానీ తెలిపారు. చివరగా, ముంద్రా పోర్ట్‌లో సాధారణ ఉద్యోగిగా తన ప్రస్థానాన్ని గుర్తుచేసుకున్న ఆయన, ఆ అనుభవమే నేడు తన నాయకత్వ దృక్పథాన్ని తీర్చిదిద్దిందని భావోద్వేగంగా చెప్పారు. భారతదేశపు మౌలిక సదుపాయాల సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా బుద్ధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లో ఫార్ములా వన్ రేసింగ్‌ను పునరుద్ధరించడంపై తమ ఆసక్తిని ఆయన పునరుద్ఘాటించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+