PF: వచ్చే ఏడాది నుంచి ఏటీఎం ద్వారా పీఎఫ్ డబ్బు విత్ డ్రా చేసుకోవచ్చు..!
ఈపీఎఫ్ఓ సంస్థ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతోంది. తాజాగా చందాదారుల సౌకర్యార్థం మరో ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానుంది. ఏటీఎం నుంచి నేరుగా డబ్బులు విత్ డ్రా చేసుకునే అవకాశం కల్పించనుంది. వచ్చే ఏడాది నుంచి ఈపీఎఫ్‌వో చందాదారులు తమ ప్రావిడెంట్ ఫండ్‌లను నేరుగా ఏటీఎంల నుంచి విత్‌డ్రా చేసుకోవచ్చని లేబర్ సెక్రటరీ సుమితా దావ్రా తెలిపారు. క్లెయిమ్ లను త్వరగా సెటిల్ చేసేందుకు సులభతరమైన ప్రక్రియ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామన్నారు.
క్లెయిమ్ చేసిన లబ్ధిదారుడు ATMల ద్వారా సౌకర్యవంతంగా తమ డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చని లేబర్ సెక్రటరీ చెప్పారు. అన్ని వ్యవస్థలు అభివృద్ధి చెందుతున్నాయని.. పీఎఫ్ సంస్థ కూడా నూతన టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటుందని చెప్పారు. ఈ సంస్థ లో ప్రతి రెండు నుంచి మూడు నెలలకు, మీరు గణనీయమైన మార్పును గమనిస్తారని పేర్కొన్నారు. జనవరి 2025 నాటికి ఒక పెద్ద మార్పు ఉంటుందని తాను నమ్ముతున్నట్లుగా చెప్పారు.
ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ 70 మిలియన్లకు పైగా క్రియాశీల చందాదారులను కలిగి ఉందని సుమితా దావ్రా చెప్పారు.

ఈపీఎఫ్ఓ సేవలను మెరుగుపరచడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని కార్మిక కార్యదర్శి వివరించారు. కాగా ఉద్యోగం చేసే దాదాపు ప్రతి ఒక్కరికి పీఎఫ్ ఉంటుంది. వారు నెలనెలా కొంత డబ్బు చెల్లిస్తారు. అంతో మొత్తంలో యాజమాన్యం డబ్బు చెల్లిస్తోంది. చందాదారుడికి డబ్బు అత్యవసరం అయితే కొంత మొత్తాన్ని పీఎఫ్ నుంచి విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంది. దీని కోసం మనం ఈపీఎఫ్ఓ వెబ్ సైట్ వెళ్లాలి. యూఏఎన్ నంబర్ తో లాగిన్ అవ్వాలి. మన బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇవ్వాలి. బ్యాంక్ అకౌంట్ నంబర్ యాడ్ అయన తర్వాత కొంత మొత్తం క్లెయిమ్ చేసుకోవచ్చు.
క్లెయిమ్ చేసుకున్న వారం నుంచి రెండు వారాల్లో బ్యాంకులు డబ్బులు జమ అవుతాయి. అయితే వచ్చే ఏడాది నుంచి ఏటీఎం ద్వారానే పీఎఫ్ డబ్బు విత్ డ్రా చేసుకునే అవకాశం కల్పించనున్నారు. అయితే విత్ డ్రా కొన్ని పరిమితులు విధించనున్నారు.












Click it and Unblock the Notifications