Block Layoffs: లాభాల్లో ఉన్నా 4 వేల మందిని లేపేశారు, భారీగా పెరిగిన షేర్లు
జాక్ డోర్సే నేతృత్వంలోని 'బ్లాక్' (Block) కంపెనీ తీసుకున్న సంచలన నిర్ణయం ఇప్పుడు టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్ అయింది. సాధారణంగా కంపెనీలు కష్టాల్లో ఉన్నప్పుడు లేదా నష్టాలు వస్తున్నప్పుడు ఉద్యోగులను తొలగిస్తాయి. కానీ, లాభాల్లో ఉండి కూడా ఏకంగా 40 శాతం మందిని ఒక్కసారిగా ఇంటికి పంపడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ఈ భారీ మార్పు వెనుక ఉన్న అసలు కారణం, డోర్సే ఆలోచనా విధానం, ఆ సంస్థ భవిష్యత్తు ప్రణాళికలే అంటున్నారు నిపుణులు..
టెక్ రంగంలో ఇటీవల కాలంలో ఎన్నో లేఆఫ్స్ చూశాం, కానీ జాక్ డోర్సే తీసుకున్న ఈ నిర్ణయం వాటన్నింటికంటే భిన్నమైనది. తన కంపెనీలో పనిచేస్తున్న 10,000 మంది ఉద్యోగుల్లో దాదాపు 4,000 మందిని (40%) ఒకే దఫాలో తొలగిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అయితే, ఇది కంపెనీ బలహీనత వల్ల తీసుకున్న నిర్ణయం కాదని ఆయన స్పష్టం చేయడం గమనార్హం. పదేపదే కొద్దికొద్దిగా ఉద్యోగులను తీసివేస్తూ వారిలో భయాందోళనలు నింపడం కంటే, ఒకేసారి కఠినమైన చర్య తీసుకోవడం వల్ల మిగిలిన వారైనా ప్రశాంతంగా, స్పష్టమైన లక్ష్యంతో పనిచేస్తారని డోర్సే భావించారు. ఈ తెగింపుతో కంపెనీ పరిమాణం ఇప్పుడు 6,000 లోపునకు పడిపోయింది.

Block ఏఐ (AI) దిశగా అడుగులు..
ఈ భారీ తొలగింపుల వెనుక ప్రధాన సూత్రధారి 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' (AI). రాబోయే రోజుల్లో కంపెనీ కార్యకలాపాలన్నీ ఏఐ ఆధారితంగానే సాగాలని, దీనివల్ల చిన్న బృందాలతోనే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చని డోర్సే విశ్వసిస్తున్నారు. "మేము ఉపయోగిస్తున్న ఇంటెలిజెన్స్ టూల్స్, చిన్న మరియు సరళమైన బృందాలతో కలిసి పనిచేయడానికి ఒక సరికొత్త మార్గాన్ని అందిస్తున్నాయి" అని ఆయన వివరించారు. అంటే, భవిష్యత్తులో వేల సంఖ్యలో ఉద్యోగులు చేసే పనిని, ఏఐ సహకారంతో కొద్దిమంది నిపుణులు చేసేలా కంపెనీని పునర్నిర్మిస్తున్నారు. ఇతర కంపెనీలు కూడా త్వరలోనే ఇదే బాటలో నడుస్తాయని ఆయన జోస్యం చెప్పారు.
ఉదారమైన వీడ్కోలు..
ఉద్యోగం కోల్పోయిన వారి పట్ల డోర్సే మానవీయ కోణంలో స్పందించారు. నష్టాల్లో ఉన్నప్పుడు ఇచ్చే నామమాత్రపు సెటిల్మెంట్ కాకుండా, వెళ్తున్న ఉద్యోగులకు అత్యంత ఉదారమైన ప్యాకేజీని ప్రకటించారు. 20 వారాల జీతంతో పాటు, పనిచేసిన ప్రతి ఏటకి అదనంగా ఒక వారం జీతం, 6 నెలల ఆరోగ్య బీమా, మరియు తక్షణ అవసరాల కోసం సుమారు రూ. 4 లక్షల ($5,000) నగదు సహాయం అందించారు. అమెరికా వెలుపల ఉన్న వారికి కూడా స్థానిక నిబంధనల ప్రకారం ఇదే స్థాయి మద్దతు లభించనుంది. చివరిసారిగా వారితో మాట్లాడటానికి లైవ్ వీడియో సెషన్ నిర్వహించిన డోర్సే, "అసౌకర్యంగా ఉన్నా సరే, మానవీయంగా ఉండటమే నా లక్ష్యం" అంటూ తన నిజాయితీని చాటుకున్నారు.
భవిష్యత్తుపై ధీమా
చివరగా, ఈ మార్పు కంపెనీని మరింత బలోపేతం చేస్తుందని డోర్సే ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం బ్లాక్ కంపెనీ లాభాల్లోనే ఉందని, వినియోగదారుల సంఖ్య నిరంతరం పెరుగుతోందని ఆయన గుర్తు చేశారు. మార్కెట్ ఒత్తిళ్లకు తలొగ్గి అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా, తమ సొంత నిబంధనల ప్రకారం వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడానికే ఈ 'క్లీన్-అప్' ప్రక్రియ చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఏఐని అన్ని కార్యకలాపాలకు కేంద్రంగా ఉంచుతూ, మరింత వేగవంతమైన, నాణ్యమైన సేవలను కస్టమర్లకు అందించడమే లక్ష్యంగా బ్లాక్ తన ప్రయాణాన్ని కొనసాగించనుంది.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications