రూ.లక్ష కోట్ల పెట్టుబడితో ముఖేష్ అంబానీ మరో సంచలనం

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తన రెండో డిజిటల్ విప్లవానికి శ్రీకారం చుట్టారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో రూ. లక్ష కోట్ల భారీ పెట్టుబడితో ఆయన 'రిలయన్స్ ఇంటెలిజెన్స్' అనే కొత్త కంపెనీని ప్రారంభించారు. ఇది జియో తర్వాత అంబానీ తీసుకున్న అత్యంత కీలకమైన నిర్ణయంగా విశ్లేషకులు భావిస్తున్నారు. 2016లో జియో ద్వారా ప్రతి ఒక్కరికీ డేటాను అందుబాటులోకి తెచ్చిన అంబానీ.. ఇప్పుడు ఏఐని ప్రతి భారతీయ కుటుంబానికి అందుబాటులోకి తీసుకురావాలని కలలు కంటున్నారు. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. జెనరేటివ్ ఏఐ (GenAI) రంగంలో భారతదేశం తీసుకున్న అతిపెద్ద నిర్ణయం ఇదేనని బ్రోకరేజ్ సంస్థలు పేర్కొంటున్నాయి.

ఏజీఎంలో ఏఐపై విస్తృత చర్చ
రిలయన్స్ వార్షిక సాధారణ సమావేశం(ఏజీఎం)లో 'ఏఐ' అనే పదాన్ని 80 సార్లు ప్రస్తావించడం విశేషం. రిలయన్స్ ఇండస్ట్రీస్ ను కేవలం చమురు, రసాయన సంస్థ నుంచి ఒక భారీ టెక్నాలజీ కంపెనీగా మార్చాలనే తన ప్రణాళికను అంబానీ వివరించారు. ఇందులో భాగంగా 100 మిలియన్ డాలర్ల జాయింట్ వెంచర్లు, భారీ డేటా సెంటర్లు, సిలికాన్ వ్యాలీలోని ప్రముఖ కంపెనీలతో భాగస్వామ్యాలు ఉంటాయని ఆయన వెల్లడించారు.

Mukesh Ambani s New Move Rs 1 Lakh Crore Investment in Reliance Intelligence

నిపుణుల అభిప్రాయం
మోర్గాన్ స్టాన్లీ విశ్లేషకుడు మయంక్ మహేశ్వరి ప్రకారం.. "రిలయన్స్ ఏఐ పవర్‌హౌస్‌గా మారి సంస్థ నికర ఆస్తుల విలువ (NAV)ను పెంచగలదు. ఏఐ మౌలిక సదుపాయాలను కొత్త ఇంధన విభాగంతో అనుసంధానించడం ద్వారా ఏఐ శిక్షణ మరియు ఇతర అవసరాలకు విద్యుత్‌ను సమకూర్చుకోవచ్చు" అని ఆయన అన్నారు. అమెరికాలోని పెద్ద టెక్ కంపెనీల మాదిరిగానే రిలయన్స్ కూడా పవర్ జనరేషన్ సామర్థ్యాన్ని డేటా సెంటర్ల కోసం వినియోగిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

మెటాతో జాయింట్ వెంచర్
రిలయన్స్ వార్షిక సాధారణ సమావేశం(ఏజీఎం)లో ప్రకారం.. రిలయన్స్ ఇంటెలిజెన్స్ అనేది రిలయన్స్, మెటా మధ్య 70:30 నిష్పత్తిలో ఒక జాయింట్ వెంచర్. ఈ సంస్థ తదుపరి తరం ఏఐ మౌలిక సదుపాయాలను నిర్మిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా భాగస్వామ్యాలు చేసుకుని ఏఐ సేవలను అందిస్తుంది. అత్యుత్తమ ఏఐ నిపుణులను ఆకర్షిస్తుంది. ఈ ఒప్పందం డిసెంబర్ నాటికి పూర్తి కావచ్చని అంచనా. రిలయన్స్, మెటా కలిసి భారతీయ వ్యాపార కోసం
ఓపెన్-సోర్స్ ఏఐ మోడళ్లను కూడా అందిస్తాయి.

'ఏఐని ఇంటింటికీ చేరుస్తాం'
"ఒక దశాబ్దం క్రితం, డిజిటల్ సేవలు రిలయన్స్ కోసం ఒక కొత్త వృద్ధి ఇంజిన్‌గా మారాయి. ఇప్పుడు ఏఐతో మన ముందు ఉన్న అవకాశం అంతకంటే చాలా పెద్దది. జియో ప్రతి భారతీయుడికి డిజిటల్ సేవలు అందించాలని వాగ్దానం చేసి, దానిని నెరవేర్చింది. అదే విధంగా, రిలయన్స్ ఇంటెలిజెన్స్ ప్రతి భారతీయుడికి ఏఐని అందించాలని వాగ్దానం చేస్తుంది" అని ముఖేష్ అంబానీ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+