అమ్మో అక్టోబర్.. కొత్త రూల్స్ ఏంటో తెలుసా? సామాన్యుడి జేబుపై ఎఫెక్ట్!

ప్రతి నెలా మొదటి తేదీ నుంచి మన దైనందిన జీవితాన్ని, ఆర్థిక లావాదేవీలను ప్రత్యక్షంగా ప్రభావితం చేసే అనేక కొత్త నియమాలు అమల్లోకి వస్తుంటాయి. అక్టోబర్ నెల ప్రారంభం కాబోతున్న తరుణంలో బ్యాంకింగ్ సేవలు, పన్ను మినహాయింపులు, గ్యాస్ సిలిండర్లు, ఏటీఎం ఛార్జీలు వంటి అనేక అంశాల్లో కీలక మార్పులు రాబోతున్నాయి. సాధారణ మధ్యతరగతి ప్రజల నుంచి వ్యాపారవేత్తల వరకు అందరూ తప్పక తెలుసుకోవాల్సిన ముఖ్యమైన ఆర్థిక మార్పులు ఏమిటో ఇప్పుడు వివరంగా చూద్దాం.

ఎస్బీఐ ఏటీఎం ఉచిత లావాదేవీలలో కోత

దేశీయ దిగ్గజ బ్యాంకైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులకు షాకిచ్చింది. ప్రత్యేకించి శాలరీ అకౌంట్స్ కలిగిన కస్టమర్లు ఇతర బ్యాంకులకు చెందిన ఏటీఎంలు లేదా డిపాజిట్ మెషిన్లను ఉపయోగించుకునే ఉచిత లావాదేవీల పరిమితిని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్న ఈ కొత్త నిబంధన ప్రకారం.. ఇప్పటివరకు నెలకు ఉన్న 10 ఉచిత లావాదేవీల పరిమితిని 5 కు కుదించారు. ఇందులో ఆర్థిక, ఆర్థికేతర లావాదేవీలు అన్నీ కలిసే ఉంటాయి. ఇక బేసిక్ సేవింగ్స్ ఖాతాదారులకు మాత్రం నెలకు 4 ఉచిత నగదు విత్‌డ్రాలు యథావిధిగా కొనసాగుతాయి. ఆ తర్వాత జరిగే ప్రతి లావాదేవీకి రూ. 15 తో పాటు జీఎస్టీ అదనంగా పడుతుంది.

New Financial Rules Starting October 2026 RBI Review SBI ATM Charges and Aadhaar LPG Rules


ఈపీఎఫ్‌వో దెబ్బకి తగ్గిన జీతం

కేంద్ర సర్కారు ఈపీఎఫ్‌వో కనీస వేతన పరిమితిని రూ.15,000 నుంచి రూ.25,000కు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ కొత్త నిబంధన వల్ల అక్టోబర్ 1 నుంచి ఎంతోమంది ప్రైవేట్ ఉద్యోగులు పెన్షన్, ఈపీఎఫ్ ప్రయోజనాలను పొందే అవకాశం లభించినప్పటికీ.. ఉద్యోగుల చేతికి వచ్చే నెల జీతంలో మాత్రం తేడాలు వచ్చేశాయి.

బ్రేకింగ్ న్యూస్.. సెప్టెంబర్ నెల జీతంలో కోత.. ఎందుకంటే?
బ్రేకింగ్ న్యూస్.. సెప్టెంబర్ నెల జీతంలో కోత.. ఎందుకంటే?

ఎల్పీజీ సిలిండర్ సబ్సిడీకి బయోమెట్రిక్ తప్పనిసరి

వంట గ్యాస్ సిలిండర్లను వినియోగించే కస్టమర్లకు ప్రభుత్వం మరో నిబంధనను తీసుకువచ్చింది. అక్టోబర్ 1 నుంచి దేశంలోని గృహ వినియోగదారులు రాయితీ ధరకే గ్యాస్ సిలిండర్ పొందాలంటే బయోమెట్రిక్ ఆధారిత ధృవీకరణను పూర్తి చేయడం తప్పనిసరి. అయితే ఒకవేళ ఈ ప్రక్రియ పూర్తి చేయని వారు గ్యాస్ పొందలేరని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బయోమెట్రిక్ చేయించుకోని వారు కూడా సిలిండర్ పొందవచ్చు కానీ, వారికి ఎలాంటి సబ్సిడీ వర్తించదు. మార్కెట్ ధరను పూర్తిగా చెల్లించి మాత్రమే సిలిండర్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

ఆర్‌బీఐ ద్రవ్య పరపతి సమీక్ష.. రెపో రేట్లపై ఉత్కంఠ

దేశ ఆర్థిక వ్యవస్థను నడిపించడంలో కీలకమైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మానిటరీ పాలసీ కమిటీ (MPC) సమావేశం అక్టోబర్ 5 నుంచి 7 వరకు జరగనుంది. ఈ సమావేశం ముగింపులో సెంట్రల్ బ్యాంకు రెపో రేట్లలో మార్పులు చేస్తుందా లేదా ప్రస్తుతమున్న 5.25 శాతం శాతాన్నే కొనసాగిస్తుందా అనేదానిపై స్పష్టత రానుంది. రెపో రేట్లలో ఏవైనా మార్పులు వస్తే అది నేరుగా గృహ, వాహన రుణాల ఈఎంఐలపై ప్రభావం చూపుతుంది.

 ఇక వారికి సబ్సిడీ గ్యాస్ కట్, డెడ్ లైన్ - కమర్షియల్‌ రేటు వసూలు..!!
ఇక వారికి సబ్సిడీ గ్యాస్ కట్, డెడ్ లైన్ - కమర్షియల్‌ రేటు వసూలు..!!

ఆదాయపు పన్ను ఆడిట్ రిటర్న్ గడువు పొడిగింపు

పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఊరటనిచ్చింది. అసెస్‌మెంట్ ఇయర్ 2026-27కి సంబంధించి ఆడిట్ నిబంధనల పరిధిలోకి వచ్చే పన్ను చెల్లింపుదారుల కోసం గడువును పొడిగించారు. పన్ను ఆడిట్ నివేదికను సమర్పించడానికి చివరి తేదీని సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 21, 2026 వరకు పొడిగించారు. అలాగే ఆడిట్ పరిధిలోని ట్యాక్స్ పేయర్లు ఐటీఆర్ దాఖలు చేయడానికి చివరి తేదీని అక్టోబర్ 31 నుంచి నవంబర్ 21, 2026 వరకు పొడిగించడం వల్ల ప్యాక్ ప్రొఫెషనల్స్‌కు ఊరట దక్కింది.

సులభతర టీడీఎస్

అక్టోబర్ 1 నుంచి నివాసితులు లేదా హిందూ అవిభక్త కుటుంబాలు (HUFs) విదేశాల్లో నివసించే ఎన్ఆర్ఐల నుంచి స్థిరాస్తులను కొనుగోలు చేసేటప్పుడు టీడీఎస్ (TDS) చెల్లింపు ప్రక్రియ మరింత సరళతరం కానుంది. ఇకపై వేర్వేరుగా ట్యాన్ (TAN) నంబర్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా కేవలం పాన్ (PAN) నంబర్ ద్వారానే టీడీఎస్ ప్రక్రియను పూర్తి చేసేలా వెసులుబాటు కల్పించారు. అయితే పన్ను మినహాయింపు నిబంధనలు మాత్రం యథావిధిగా వర్తిస్తాయి.

UPI MDR: తేల్చేసిన నిర్మలమ్మ! పన్ను కాదు, సెస్ అసలే కాదు.. పూర్తిగా ఫ్రీ
UPI MDR: తేల్చేసిన నిర్మలమ్మ! పన్ను కాదు, సెస్ అసలే కాదు.. పూర్తిగా ఫ్రీ

యూపీఐ చెల్లింపులు, ఎన్‌పీఎస్ ఛార్జీల్లో మార్పులు

అక్టోబర్ నుంచి కొన్ని నిర్దిష్టమైన రూ. 2,000 కంటే ఎక్కువ విలువైన మర్చెంట్ లావాదేవీల కోసం కొత్త యూపీఐ మర్చెంట్ డిస్కౌంట్ రేట్ (MDR) ఫ్రేమ్‌వర్క్ అమల్లోకి రానుంది. అయితే ఈ ఛార్జీలను సాధారణ కస్టమర్లు ఎవరూ చెల్లించాల్సిన అవసరం లేదు, ఇది పూర్తిగా వ్యాపార సంస్థలు, చెల్లింపుల వ్యవస్థ పరిధిలోనిది. వ్యక్తిగత యూపీఐ లావాదేవీలు ఎప్పుడూ ఉచితంగానే ఉంటాయని స్పష్టం చేశారు. అలాగే పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ (PFRDA) నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) కింద కొత్త ఆన్‌బోర్డింగ్ ఛార్జీలను సవరించింది. పీఆర్ఏఎన్ (PRAN) రిజిస్ట్రేషన్ సమయంలో వన్-టైమ్ ప్రాతిపదికన రూ. 200 ఛార్జీ వర్తిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+