అంటుకున్న పెట్రో మంట
అంతర్జాతీయ చమురు మార్కెట్లలో తీవ్ర అస్థిరత నెలకొంది. ఇస్లామాబాద్ లో సాగిన చర్చలు విఫలం కావడంతో ముడిచమురు ధర మళ్లీ మొదటికొచ్చింది. మధ్యప్రాచ్యంలోని భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు రెట్టింపు అవుతున్నాయి. హార్ముజ్ జలసంధిపై ఆధిపత్య పోరు, ఇరాన్ పోర్టులను అమెరికా దిగ్బంధించాలని నిర్ణయించడం వంటి పరిణామాలు సంభవిస్తోన్నాయి. వీటి ప్రభావం ముడిచమురుపై పడుతోంది. క్రూడాయిల్ రేట్లు పెరుగుతున్నాయి.
సోమవారం వీటి ధర ఎనిమిది శాతానికి పైగా ఎగబాకింది. బ్యారెల్‌కు 100 డాలర్లను దాటింది. ఇరు దేశాల మధ్య యుద్ధం తీవ్రమైతే ధరలు మరింత పెరిగి, ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణానికి దారి తీయవచ్చు. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 104.24 డాలర్లకు చేరింది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఏడు శాతానికి పైగా పెరిగి 102.29 డాలర్లకు చేరింది. గ్యాస్ ధర కూడా రెండు శాతం పెరిగి 2.684 డాలర్లుగా నమోదైంది.

ఇరాన్ యుద్ధం సమయంలో హోర్ముజ్ జలసంధి మూసివేయబడటం వల్ల బ్రెంట్ క్రూడ్ ధరలలో తీవ్ర హెచ్చుతగ్గులు కనిపించాయి. యుద్ధానికి ముందే ఫిబ్రవరి చివరలో బ్యారెల్‌కు దాదాపు 70 డాలర్ల వద్ద ట్రేడ్ అయిన ధర, యుద్ధం ప్రారంభమైన తర్వాత 119 డాలర్లకు పెరిగింది. ఈ పరిస్థితుల్లోనూ దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
నేడు వివిధ నగరాల్లో పెట్రోల్ రేట్ల వివరాలిలా ఉన్నాయి.
హైదరాబాద్ లో పెట్రోల్ ధర: లీటరుకు రూ. 107.46
ఢిల్లీలో పెట్రోల్ ధర: లీటరుకు రూ. 94.77
కోల్‌కతాలో పెట్రోల్ ధర: లీటరుకు రూ. 105.41
ముంబైలో పెట్రోల్ ధర: లీటరుకు రూ. 103.54
చెన్నైలో పెట్రోల్ ధర: లీటరుకు రూ.101.06
భువనేశ్వర్‌లో పెట్రోల్ ధర: లీటరుకు రూ.100.94
డీజిల్ ధరలు ఇవీ..
హైదరాబాద్ లో డీజిల్ ధర: లీటరుకు రూ. 95.70,
ఢిల్లీలో డీజిల్ ధర: లీటరుకు రూ. 87.67
కోల్‌కతాలో డీజిల్ ధర: లీటరుకు రూ. 92.02
ముంబైలో డీజిల్ ధర: లీటరుకు రూ. 90.03
చెన్నైలో డీజిల్ ధర: లీటరుకు రూ. 92.61
భువనేశ్వర్‌లో డీజిల్ ధర: లీటరుకు రూ. 92.52












Click it and Unblock the Notifications