గౌహతి ఎయిర్ పోర్టులో కొత్త టెర్మినల్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ..
అసోం రాజధాని గౌహతిలోని లోక్ ప్రియా గోపీనాథ్ బర్దొలాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం (LGBIA)లో 'ది బాంబూ ఆర్కిడ్స్' టెర్మినల్ ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. కాన్సెప్ట్ నుంచి ఏడాదిలోపే ఈ ప్రాజెక్ట్ పూర్తికావడం దేశ మౌలిక సదుపాయల అభివృద్ధి వేగానికి నిదర్శనం అని అన్నారు. ఇక ఆదానీ ఎయిర్‌పోర్ట్ హోల్డింగ్స్ లిమిటెడ్ (AAHL) దీనిని నిర్మించింది.
ఈ నూతన సదుపాయం డిజియాత్ర ప్రాసెసింగ్ ను, వెదురుతో ప్రేరణ పొందిన ప్రత్యేక డిజైన్‌ను కలిగి ఉంది. 2032 నాటికి ఏటా 13.1 మిలియన్ల ప్రయాణికులను నిర్వహించాలని లక్ష్యం. ఇది ఈశాన్య ప్రాంత విమానయాన అనుసంధానాన్ని మరింత పటిష్టం చేస్తుంది.
కఠినమైన ఆపరేషనల్ రెడీనెస్ అండ్ ఎయిర్‌పోర్ట్ ట్రాన్స్‌ఫర్ (ORAT) కార్యక్రమాన్ని అమలు చేశారు. జర్మనీలోని మునిచ్ నిపుణుల బృందం సహకారంతో, మొదటి రోజు నుంచే సురక్షితమైన, సజావుగా కార్యకలాపాలు జరిగేలా నిర్ధారించారు. టెర్మినల్ డిజైన్ ను ప్రధాని ఫిబ్రవరిలో 'అడ్వాంటేజ్ అస్సాం 2.0'లో ఆవిష్కరించారు.
ప్రాంతీయతను ప్రతిబింబించే 'ది బాంబూ ఆర్కిడ్స్' టెర్మినల్, అస్సాం 'కోపూ ఫూల్' (నక్క తోక ఆర్కిడ్), 'భోలుకా' వెదురు, అరుణాచల్ ప్రదేశ్ 'అపతాని' వెదురు రకాల స్ఫూర్తితో నిర్మితమైంది. సహజ పదార్థాలు, పగటి వెలుగు, ఆధునిక డిజైన్ ఈశాన్య పర్యావరణ, సాంస్కృతిక వైవిధ్యాన్ని చూపుతుంది.
దీని నిర్మాణంలో సుమారు 140 మెట్రిక్ టన్నుల స్థానిక వెదురును వినియోగించారు. ఆధునిక ఇంజనీరింగ్ ద్వారా సంప్రదాయ హస్తకళను పునర్నిర్మించడం, ప్రకృతి-ఆధారిత విమానాశ్రయ నిర్మాణంలో ఇది భారతదేశంలోనే ప్రముఖ ఉదాహరణ.
ఈ ప్రాజెక్ట్‌ను గౌహతి అంతర్జాతీయ విమానాశ్రయం లిమిటెడ్ అభివృద్ధి చేయగా, AAHL కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఇది డిజైన్, ఇంజనీరింగ్, ORAT సంసిద్ధత, నిర్ణీత సమయపాలనతో కూడిన అదానీ గ్రూప్ సమగ్ర మౌలిక సదుపాయాల విధానానికి నిదర్శనం.
ప్రధాని మోదీ ఈ ప్రారంభోత్సవాన్ని 'వికాస్ కా ఉత్సవ్' లో భాగంగా అభివర్ణించారు. 'యాక్ట్ ఈస్ట్ పాలసీ' కింద అసోం.. భారత్ తూర్పు ద్వారంగా ఉద్భవిస్తోందని పేర్కొన్నారు. వెదురు టెర్మినల్ బలం, స్థిరత్వం, 'విక్షిత్ భారత్' సాధనలో రాష్ట్ర పాత్రకు ప్రతీక అన్నారు.
అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ మాట్లాడుతూ.. "గౌహతి టెర్మినల్ ప్రపంచ స్థాయి ఎయిర్‌పోర్ట్ మౌలిక సదుపాయాలను స్థానికతను నిలుపుకుంటూనే వేగంగా అందించగలదని రుజువు చేస్తుంది. ఇది ఈశాన్య ప్రాంత అనుసంధానం, ఆర్థిక వృద్ధికి తోడ్పడి ప్రయాణీకులకు ఆధునిక ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది" అని అన్నారు.
డిజియాత్ర ప్రాసెసింగ్, స్మార్ట్ చెక్- ఇన్ వ్యవస్థలతో ఈ టెర్మినల్ నిర్మించబడింది. FY 2024-25లో గౌహతి విమానాశ్రయం 6.50 మిలియన్ల మంది ప్రయాణీకులను నిర్వహించింది. ప్రస్తుతం, గౌహతి భారత్ లో 10వ అత్యంత రద్దీ విమానాశ్రయంగా, ఈశాన్య రాష్ట్రాలకు కీలక కేంద్రంగా ఉంది.
ఈ విమానాశ్రయ అభివృద్ధికి రూ. 5,000 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఇందులో MRO (మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్‌హాల్) సౌకర్యాల కోసం రూ. 1,000 కోట్లు కేటాయించారు. కార్గో మౌలిక సదుపాయాలు వాణిజ్యం, లాజిస్టిక్స్, ఉపాధిని బలోపేతం చేస్తాయి. AAHL నేతృత్వంలో జాతీయ విమానయాన విస్తరణలో గౌహతి మైలురాయి.

డిసెంబర్ 25న ప్రారంభించనున్న నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం (NMIA) దేశంలో అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టులలో ఒకటి. ఈ పరిణామాలు భారతదేశ మౌలిక సదుపాయాల వేగం, స్థాయి, కార్యాచరణ సంసిద్ధత, డిజైన్ శ్రేష్ఠత ఏకమై భవిష్యత్తు వృద్ధి ద్వారాలను సృష్టించడాన్ని ప్రతిబింబిస్తాయి.
-
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
మార్కాపురం బస్సు ప్రమాద బాధితుల కోసం ప్రధాని కీలక ప్రకటన..!! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..!












Click it and Unblock the Notifications