Post office saving Schemes: చివరి త్రైమాసికానికి వడ్డీ రేట్లు ఇవే..!!

2025 జనవరి నుంచి మార్చి నెల వరకు చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీల్లో ఎలాంటి మార్పులు ఉండవని తెలుస్తోంది. అంటే చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో చివరి త్రైమాసికంలో కూడా అవే వడ్డీ రేట్లు కొనసాగుతాయి. చిన్న మొత్తం పొదుపు పథకాలు లేదా పోస్టాఫీస్ పథకాలైన పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీమ్, సుకన్య సమృద్ధి యోజన(SSY), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC),పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్లు, మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్, ఎంఐఎస్‌లాంటి పథకాలకు ప్రస్తుత వడ్డీ రేట్లే కొనసాగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.

ఇక పోస్టాఫీసు సేవింగ్స్ స్కీమ్‌లపై వచ్చే వడ్డీ రేట్లలో మార్పు లేనందున వివిధ స్కీముల్లో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్లకు వచ్చే వడ్డీ ఇలా ఉంది. ఇవి 2025 జనవరి నుంచి మార్చి వరకు కొనసాగుతాయి.

Post Office Scheme Rates Revised for Jan-Mar 2025 Here s What s New

సేవింగ్స్ డిపాజిట్ పై 4శాతం,ఏడాది కాలపరిమితి డిపాజిట్లపై 6.9శాతం, రెండేళ్ల కాలపరిమితి డిపాజిట్లపై 7శాతం,మూడేళ్ల కాలపరిమితి డిపాజిట్లపై 7.1శాతం,ఐదేళ్ల కాలపరిమితి డిపాజిట్లపై 7.5శాతం, ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్ల పై 6.7శాతం,సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీమ్ పై 8.2శాతం,ఎంఐఎస్ పై 7.4శాతం, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ పై 7.7శాతం,పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ పై 7.1శాతం, కిసాన్ వికాస్ పత్ర పై 7.5శాతం,సుకన్య సమృద్ధి యోజన పై 8.2శాతం వడ్డీలు కొనసాగుతున్నాయి.

పోస్టాఫీస్ స్కీములు కేంద్ర ప్రభుత్వం అధీనంలో పనిచేస్తాయి.ఈ స్కీములకు కేంద్ర ప్రభుత్వమే గ్యారెంటీగా నిలుస్తుంది. ప్రతి త్రైమాసికానికోసారి కేంద్ర ప్రభుత్వం వడ్డీ రేట్లను రివ్యూ చేస్తుంది. శ్యామలా గోపీనాథ్ కమిటీ సూచించిన పద్ధతి ద్వారా వడ్డీ రేట్లను కేంద్రం నిర్ణయిస్తుంది. ఈ కమిటీ ప్రకారం అన్ని చిన్న మొత్తాల పొదుపు పథకాలకు వడ్డీ రేట్లను 25 నుంచి 100 బేసిస్ పాయింట్ల మధ్యలో ఉండేలా లెక్కిస్తారు. 100 బేసిస్ పాయింట్లు అంటే 1శాతం. ఇన్వెస్టర్లను ఆకట్టుకునేలా వారు సంతృప్తి చెందేలా చూసుకోవడంతో పాటు ఈ చిన్న మొత్తాల పొదుపులో పోటీతత్వం కూడా ఉంటుందనే భావనతో ఇలా రూపొందించడం జరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+