Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

RBI గుడ్ న్యూస్: పొరపాటున డబ్బు పోయినా రూ. 25 వేలు వాపస్!

రెక్కాడితే గానీ డొక్కాడని సామాన్యుడు.. తన పిల్లల చదువుల కోసమో, అత్యవసరాల కోసమో దాచుకున్న రూపాయిని సైబర్ కేటుగాళ్లు ఒక్క క్లిక్కుతో దోచేస్తుంటే, ఆవేదనతో దిక్కుతోచని స్థితిలో ఉండేవారు. "తెలియక ఓటీపీ (OTP) చెప్పాను.. నా తప్పు వల్లే డబ్బు పోయింది.. ఇక రాదు" అని కన్నీరు పెట్టుకునే బాధితులకు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఒక అభయహస్తం ఇచ్చారు. మీ పొరపాటు ఉన్నా సరే, మీ కష్టార్జితానికి రక్షణ కల్పించేలా విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి.

ప్రస్తుతం జరుగుతున్న సైబర్ మోసాలలో దాదాపు 65 శాతం చిన్న చిన్న మొత్తాలే ఉంటున్నాయని గుర్తించిన రిజర్వ్ బ్యాంక్, పోగొట్టుకున్న సొమ్ములో 85 శాతం లేదా గరిష్ఠంగా 25,000 రూపాయలను ఎలాంటి ప్రశ్నలు వేయకుండానే వెనక్కి ఇచ్చే విప్లవాత్మక విధానాన్ని ప్రకటించింది. దీని కోసం ఆర్‌బీఐ తన వద్ద నిరుపయోగంగా ఉన్న దాదాపు 85 వేల కోట్ల రూపాయల 'డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్' (DEAF) మొత్తాన్ని వినియోగించాలని నిర్ణయించడం విశేషం.

RBI Big Move Get Up to Rs 25 000 Refund for Cyber Fraud Even If It s Your Fault New Rules from July 1

బాధితుడికి RBI అండగా..

ఈ సరికొత్త విధానం వెనుక ఉన్న మానవీయ కోణం ఏమిటంటే, ఒక వ్యక్తి మోసగాళ్ల మాయమాటలు నమ్మి పొరపాటున తన రహస్య వివరాలను వెల్లడించినా సరే, ప్రభుత్వం ఆ బాధితుడికి అండగా నిలుస్తుంది. ఉదాహరణకు మీరు ఒక మోసపూరిత లింక్ ద్వారా 50 వేల రూపాయలు నష్టపోతే, అందులో 85 శాతం అంటే 42,500 రూపాయలు అవుతుంది. కానీ గరిష్ఠ పరిమితి పాతిక వేలు కాబట్టి, మీకు ఆ 25 వేల రూపాయలను వెనక్కి ఇస్తారు. అదే మీరు 20 వేలు పోగొట్టుకుంటే, అందులో 85 శాతం లెక్కన 17 వేల రూపాయలు ఎటువంటి పేచీ లేకుండా మీ ఖాతాలోకి వస్తాయి. ఈ మొత్తం ప్రక్రియలో నష్టపోయిన సొమ్ములో కేవలం 15 శాతం మాత్రమే బాధితుడు, బ్యాంకు భరిస్తారు. మిగిలిన సింహభాగాన్ని ఆర్‌బీఐ తన నిధి నుంచి సమకూరుస్తుంది.

అవకాశం ఒక్కసారే.. నిబంధనలు ఇవే!

అయితే, ఈ వెసులుబాటును ఒక కస్టమర్ తన జీవితకాలంలో కేవలం ఒక్కసారి మాత్రమే ఉపయోగించుకోగలరు. మోసం జరిగిన వెంటనే అప్రమత్తమై, 5 రోజుల్లోపు బ్యాంకుకు లేదా సైబర్ క్రైమ్ పోర్టల్‌కు ఫిర్యాదు చేయాలి. ఈ ఐదు రోజుల నిబంధనే బాధితుడి పాలిట ప్రాణవాయువు లాంటిది. తప్పు జరిగినా సరిదిద్దుకునే అవకాశం ఇవ్వడమే ఈ పథకం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం.

జులై 1 నుంచి కొత్త రూల్స్!

ప్రస్తుతం ఈ చారిత్రాత్మక ప్రతిపాదన చర్చల దశలో ఉంది. ఏప్రిల్ 6 వరకు బ్యాంకులు తమ అభిప్రాయాలను తెలపాల్సి ఉంటుంది. అన్నీ సవ్యంగా సాగితే, జులై 1, 2026 నుంచి డిజిటల్ లావాదేవీల రంగంలో సరికొత్త శకం మొదలవుతుంది. ఇకపై "క్లిక్" చేయడానికి భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వెనుక ఆర్‌బీఐ రక్షణ కవచం ఉంది.

రికవరీ ఏజెంట్లుపై కొరడా..

కేవలం సైబర్ భద్రతకే పరిమితం కాకుండా, సామాన్యులను వేధిస్తున్న మరిన్ని సమస్యలపై కూడా ఆర్‌బీఐ కొరడా ఝుళిపించింది. ముఖ్యంగా అప్పులు వసూలు చేసే రికవరీ ఏజెంట్లు ప్రస్తుతం అనుసరిస్తున్న అరాచక పద్ధతులకు చెక్ పెట్టేలా నిబంధనలను సమీక్షిస్తోంది. బలవంతపు వసూళ్లకు పాల్పడితే బ్యాంకులు మరియు ఏజెంట్లు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

లోన్స్ లిమిట్ పెంపు..

అదే సమయంలో, చిన్న తరహా పరిశ్రమల (MSME) కోసం పూచీకత్తు లేని రుణాల పరిమితిని 10 లక్షల నుండి ఏకంగా 20 లక్షలకు పెంచడం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన పారిశ్రామికవేత్తలకు గొప్ప ప్రోత్సాహాన్ని అందించింది. అటు బ్యాంకులు కూడా తమ లాభాల కోసం కస్టమర్ల నెత్తిన అవసరం లేని ఇన్సూరెన్స్‌లు, ఇతర ప్రోడక్టులను అంటగట్టే 'మిస్ సెల్లింగ్' వ్యవహారాలను అరికట్టేందుకు కూడా కఠినమైన గైడ్‌లైన్స్‌ను సిద్ధం చేసింది. వెరసి, రాబోయే రోజుల్లో బ్యాంకింగ్ రంగం కస్టమర్లకు మరింత పారదర్శకంగా, సురక్షితంగా మారబోతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+