Gold: అక్షయ తృతీయ షాక్. తులం ఎంతంటే!

అక్షయ తృతీయ సమీపిస్తున్న వేళ పసిడి ధరలు మార్కెట్ విశ్లేషకులను సైతం విస్మయానికి గురిచేస్తున్నాయి. గతేడాది ఏప్రిల్ 15న 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.95,500 ఉండగా, సరిగ్గా ఏడాది తిరిగేసరికి అంటే ఈరోజు (ఏప్రిల్ 15, 2026) 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,570కి చేరుకుంది. ఇది అక్షరాలా 63 శాతం పెరుగుదల! అయినప్పటికీ, భారతీయ వినియోగదారుడు మాత్రం తన ఆస్తి రక్షణ కోసం పసిడిని వీడటం లేదు. అయితే, ఈసారి భౌతిక ఆభరణాల కంటే 'డిజిటల్ బంగారం' వైపే పెట్టుబడిదారులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.

ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు, ముఖ్యంగా ఇరాన్ యుద్ధంపై నెలకొన్న అనిశ్చితి బంగారం ధరలకు రెక్కలు తొడిగింది. ప్రపంచవ్యాప్తంగా డాలర్, క్రూడ్ ఆయిల్ ధరలు ఊగిసలాడుతున్న తరుణంలో, ఇన్వెస్టర్లు సురక్షిత ఆస్తిగా భావించే బంగారం వైపు పరుగులు తీస్తున్నారు. గత వారం రోజుల్లోనే వెండి ధరలు 4 శాతం, బంగారం ధరలు 2 శాతం మేర పెరగడం గమనార్హం. కేంద్ర బ్యాంకుల భారీ కొనుగోళ్లు కూడా ఈ పెరుగుదలకు ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి.

Record Gold Price Hike of 63 Percent in India as Akshaya Tritiya Demand Shifts from Jewelry to Digital Gold ETFs

డిజిటల్ Gold వైపు అడుగులు..

సాధారణంగా అక్షయ తృతీయ నాడు భారీ ఆభరణాలు కొనుగోలు చేయడం ఒక ఆనవాయితీ. కానీ, ప్రస్తుతం పెరిగిన ధరల వల్ల మధ్యతరగతి ప్రజలు తమ వ్యూహాన్ని మార్చుకుంటున్నారు. అధిక తరుగు (Wastage), నిల్వ ఉంచడంలో భద్రతా సమస్యల దృష్ట్యా భౌతిక బంగారం కంటే గోల్డ్ ఈటీఎఫ్‌లు (ETFs), డిజిటల్ గోల్డ్ వైపు మొగ్గు చూపుతున్నారు. MMTC-PAMP ఎండీ సమిత్ గుహా అభిప్రాయం ప్రకారం.. "భారతీయులు బంగారాన్ని కేవలం వేడుకల కోసమే కాకుండా, దీర్ఘకాలిక సంపదగా చూస్తారు. అందుకే ధర పెరిగినా 24 క్యారెట్ల నాణేలు, బిస్కెట్ల రూపంలో కొనుగోలు కొనసాగిస్తున్నారు."

Gold: బంగారం ఈ టాప్ ప్లేసెస్ లో కొంటేనే మీకు లాభం!
Gold: బంగారం ఈ టాప్ ప్లేసెస్ లో కొంటేనే మీకు లాభం!

ఈటీఎఫ్ ప్రవాహం: భారత్ వర్సెస్ ప్రపంచం!

గ్లోబల్ మార్కెట్‌లో గోల్డ్ ఈటీఎఫ్‌ల నుండి నిధుల ఉపసంహరణ జరుగుతున్నా, భారత్ లో మాత్రం చిత్రం మరోలా ఉంది. ఆగ్‌మోంట్ నివేదిక ప్రకారం, 2026 మార్చిలో ప్రపంచవ్యాప్తంగా $12 బిలియన్ల ఉపసంహరణ జరిగితే, భారత్ లో మాత్రం ఈటీఎఫ్ నిధుల ప్రవాహం రూ.24,040 కోట్లకు పెరిగి, 106 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఆసియా పెట్టుబడిదారులు ప్రాంతీయ అస్థిరతకు వ్యతిరేకంగా బంగారాన్ని ఒక రక్షణ కవచంలా భావిస్తుండటమే దీనికి కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

అక్షయ తృతీయ ఏ రోజు? ఈ 92 నిమిషాల్లో బంగారం కొంటే ఐశ్వర్యమే..
అక్షయ తృతీయ ఏ రోజు? ఈ 92 నిమిషాల్లో బంగారం కొంటే ఐశ్వర్యమే..

వచ్చే ఏడాదికి రూ.2 లక్షలు?

బంగారం భవిష్యత్తుపై అంచనాలు సామాన్యుడిని మరింత భయపెడుతున్నాయి. ఎస్ఎంసీ గ్లోబల్ సెక్యూరిటీస్ కమోడిటీ రీసెర్చ్ హెడ్ వందనా భారతి అంచనా ప్రకారం.. ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ పరిస్థితులు కొనసాగితే వచ్చే అక్షయ తృతీయ నాటికి బంగారం ధర రూ.2 లక్షలకు చేరుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. సాంస్కృతిక ప్రాధాన్యత కలిగిన అక్షయ తృతీయ వంటి పవిత్ర సందర్భాలు ధరల కరెక్షన్ (తగ్గుదల) కోసం వేచి చూడవని, ప్రజలు తమ శక్తి కొద్దీ కొనుగోలు చేస్తూనే ఉంటారని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

మొత్తానికి, పసిడి ధరలు సామాన్యుడికి గుండెపోటు తెప్పిస్తున్నా.. అక్షయ తృతీయ నాడు కనీసం 'టోకెన్' కొనుగోళ్లు అయినా సరే చేసి, పసిడి సెంటిమెంట్‌ను గౌరవించాలని వినియోగదారులు భావిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+