ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలకు షాక్‌.. రూ. 55 వేల కోట్ల పన్ను చెల్లించాల్సిందే..!

కొత్త‌గా తెచ్చిన జిఎస్‌టి నిబంధనల ప్రకారం ఆన్‌లైన్‌లో ఆడే ప్ర‌తి గేమ్‌కు అంటే ర‌మ్మీ స‌ర్కిల్‌, డ్రీమ్ వంటి ఆన్‌లైన్ గేమ్స్ పై పందెం వేసినా ప్ర‌తి పైసా పైనా కూడా ప‌న్ను చెల్లించాల్సి ఉంటుందంట‌. తాజాగా, జిఎస్‌టి నిబంధనల ప్రకారం జారీ చేసిన ప్రీ షోకాజ్ నోటీసు ఇప్ప‌డు అమలులోకి వస్తున్నాయి. వీటికి సంబంధించిన మ‌రికొన్ని నోటీసులు త్వ‌ర‌లో ముందుకు రానున్నాయి. అవి మొత్తం ఒక ల‌క్ష కోట్లు దాటుతుంద‌ని అధికారులు అంచ‌నా వేస్తున్నారు.

ఒక కంపెనీకి ఇచ్చిన గ‌రిష్ట ప‌న్ను నోటీసు ఇదే..

ప్ర‌స్తుతం ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీల‌పై ఆదాయ‌పు ప‌న్ను శాఖ‌ల క‌న్ను ప‌డింది. అందుకే, నోటీసుల వేట మొద‌లుపెట్టింది. తాజాగా, డ్రీమ్ 11కి 25 వేల కోట్లు చెల్లించాలంటూ నోటీసులు అందాయి. కొత్త నిబంధ‌నాల ప్ర‌కార‌మే ఈ నోటీసులు అందాయి. వెయ్యి కోట్ల ట‌ర్నోవ‌ర్ ఉన్నాఆన్‌లైన్ గేమింగ్ కంపెనీల‌పై ఆదాయ‌పు ప‌న్నుశాఖ దాడులు నిర్వ‌హిస్తుంది. ఇప్ప‌టివ‌ర‌కూ చేసినా దాడుల్లో సుమారు రూ.55,000 కోట్లను ఆదాయ‌శాఖ వ‌సూలు చేసింది. ప‌న్నులు చెల్లించని కంపెనీల‌కు ముందస్తుగా నోటీసులు జారీ చేసింది. అయినా పట్టించుకోని వారిపై ఆదాయ‌పు ప‌న్నుశాఖ దాడులు నిర్వ‌హించింది. ఇందులో భాగంగానే భార‌త క్రికెట్ జ‌ట్టు అడ్వ‌ర్టైజింగ్ పార్ట‌న‌ర్ డ్రీమ్ 11'కి రూ. 25,000 కోట్లు చెల్లించాలంటూ నోటీసులు అందాయి. దేశ చ‌రిత్ర‌లో ఒక కంపెనీకి ఇచ్చిన అత్యంత గ‌రిష్ట ప‌న్ను నోటీసు ఇదేన‌ని విశ్లేష‌కులు అంటున్నారు.

online gaming

గేమింగ్ కంపెనీకి నోటీసు..

ఏఏ కంపెనీల‌కు ఎంత ప‌న్ను నోటీసులు అనే విష‌యాన్ని ఓసారి ప‌రిశీలిస్తే.. ఇందులో భాగంగానే కొన్ని కంపెనీలకు ప‌దివేల‌ కోట్ల చొప్పున జీఎస్టీ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ ముంబై కార్యాలయం గత శుక్రవారం ఈ మొత్తానికి నోటీసు జారీ చేసింది. వీటి విలువ దాదాపు 55000 కోట్లు కావడం విశేషం. ఇంకా ఇందులో మిగిలిన కంపెనీల గురించి చూస్తే 'డ్రీమ్ 11'కి రూ.25000 కోట్లు, 'రమ్మీ సర్కిల్', 'మై 11 సర్కిల్' తదితర సంస్థలకు చెందిన 'ప్లే గేమ్స్ 24*7'కి రూ.20000 కోట్లు. మరికొద్ది రోజుల్లో బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్ కార్యాలయాల నుంచి కూడా నోటీసులు జారీ అయ్యే అవ‌కాశం ఉంద‌ని అధికారులు తెలిపారు. ఆ తర్వాత జారీ చేసిన పన్ను నోటీసుల మొత్తం రూ. 1 లక్ష కోట్లు దాటవచ్చని అంచనా వేస్తున్నారు.

ముందస్తు నోటీసు గురించి తెలుసా..

పన్ను విషయంలో తుది నోటీసుకు ముందు పన్ను శాఖ ముందస్తు నోటీసు జారీ చేస్తుంది. ఇందుకు సంబంధించి ఆయా సంస్థల నుంచి సమాచారం సేకరించి వారితో చర్చలు నిర్వ‌హిస్తారు. వారి నుంచి సరైన సమాధానం రాకపోతే తుది నోటీసు జారీ చేస్తారు. అనవసరంగా కోర్టుకు హాజరుకాకుండా ఉండేందుకు ఈ ముందస్తు నోటీసు ఇస్తారు. మరోవైపు కంపెనీ నోటీసును సవాలు చేస్తూ డ్రీమ్ 11 బాంబే హైకోర్టును ఆశ్రయించింది.

పందెం మొత్తంపై ప‌న్ను..

జిఎస్‌టి ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ బోర్డ్ ఇటీవలి తీసుకున్న నిర్ణయం ప్రకారం, ఆన్‌లైన్ గేమ్‌లో గెలిచిన మొత్తంపై మాత్రమే కాకుండా పందెం మొత్తంపై కూడా 28 శాతం జిఎస్‌టి విధించనున్నారు. ఈ నిర్ణయానికి అనుగుణంగా ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలకు ఇప్పటివరకు జరిగిన బెట్టింగ్‌ల ఆధారంగా ప్రీ-షోకాజ్ నోటీసు జారీ చేయబడింది. కంపెనీలు స్పందించేందుకు ఆయా కంపెనీలకు వారం రోజుల గడువును కూడా ఇచ్చాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+