కొండెక్కిన వెండి: బాబోయ్ అన్ని లక్షలే
వెండి ధరలు నానాటికీ పెరుగుతున్నాయి. బంగారంతో పోటీ పడుతున్నాయి. ఏ ఒక్క రోజు కూడా అవి తగ్గే సూచనలు కనిపించట్లేదు. వెండిదీ ఇదే పరిస్థితి. పసిడి- వెండి రేట్లు పైపైకి దూసుకెళ్తున్నాయి. ఈ దూకుడు నేడు కూడా కొనసాగింది. అంతర్జాతీయ మార్కెట్ లో ఒక ఔన్స్ బంగారం ధర 5,000 డాలర్లను దాటిపోయింది. దీని ప్రభావం దేశీయ బంగారం అమ్మకాలపై పడింది. పెరుగుతున్న భౌగోళిక-రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో బంగారం ధర రికార్డు స్థాయికి చేరింది.
వెండి ధరలు దేశవ్యాప్తంగా చారిత్రాత్మక గరిష్ట స్థాయికి చేరాయి. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రికార్డు స్థాయిలో 4,00,000 రూపాయలుగా నమోదైంది. గత 28 రోజుల్లో వెండి ధర ఏకంగా 1,44,000 రూపాయల మేర పెరిగింది. ఇప్పుడు తొలిసారి కిలో వెండి ధర నాలుగు లక్షల రూపాయల మార్క్ ను అధిగమించింది. ఇది- వెండి చరిత్రలోనే ఎప్పుడూ లేదు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, డిమాండ్-సరఫరా అంతరం, ఆర్థిక అస్థిరత ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలు.

సోలార్, ఎలక్ట్రిక్ వాహనాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్/డేటా సెంటర్లు, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాల నుండి పెరుగుతున్న డిమాండ్ వెండి ధరలను ప్రభావితం చేస్తోంది. దీని ర్యాలీని అధికం చేస్తోంది. ఆయా రంగాల నుండి వెండికి డిమాండ్ అత్యంత బలంగా ఉందని ఎన్రిచ్ మనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పొన్ముడి అన్నారు వెండిపై సురక్షితమైన పెట్టుబడిగా, ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా హెడ్జ్‌గా కూడా పని చేస్తోందని వ్యాఖ్యానించారు.
అంతర్జాతీయ మార్కెట్ లో వెండి ధర ఔన్స్ కు 118.50 నుండి 120 డాలర్ల జోన్‌ను దాటితే, రాబోయే దశలో ధరలు మరింత పెరుగుతాయని అంచనా వేశారు. ఒక ఔన్స్ వెండి ధర 125 నుండి 145 డాలర్లను అలవోకగా అందుకుంటుందని, రికార్డుస్థాయిలో శరవేగంగా దూసుకెళ్లే అవకాశం ఉందని పేర్కొన్నారు. కామెక్స్ లో వెండి ధరలు 115.42కు చేరాయి. సగటు ట్రేడింగ్ 106- 113 డాలర్ల మధ్య స్థిరంగా కొనసాగుతోంది. దేశీయ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో వెండి ఫ్యూచర్స్ ప్రారంభ ట్రేడింగ్ ధర కిలో 5.62 శాతం పెరిగి రూ. 3,79,300కి చేరుకుంది.












Click it and Unblock the Notifications