రికార్డ్ హై: సరికొత్త రికార్డులు నమోదు చేసిన స్టాక్ మార్కెట్లు
ముంబై: స్టాక్ మార్కెట్లు మరోసారి రికార్డుస్థాయిలో లాభాలు నమోదు చేశాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నప్పటికీ.. బ్యాంక్ షేర్లు లాభ పడటంతో దేశీయ మార్కెట్లకు కలిసొచ్చినట్లయింది. దీంతో సూచీలు కూడా మళ్లీ జీవనకాల గరిష్టాలకు చేరాయి.
బాంబే స్టాక్ ఎక్ఛేంజీ(బీఎస్ఈ) సెన్సెక్స్ 200 పాయింట్లకుపైగా లాభపడగా, నిఫ్టీ తొలిసారిగా 11,450 మార్క్‌ను తాకింది. నిఫ్టీ బ్యాంక్ కూడా మార్కెట్ చరిత్రలో తొలిసారి 28వేల మార్క్‌ను దాటింది.

అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో బుధవారం ఉదయం సూచీలు ఫ్లాట్ ప్రారంభమయ్యాయి. మదుపర్లు అప్రమత్తత పాటించడంతో తొలి గంటల్లో ఒడుదుడుకులను ఎదుర్కొన్నాయి. అయితే, బ్యాంకింగ్ రంగ షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో ఒత్తిడిని అధిగమించిన సూచీలు రికార్డుల వైపు పరుగులు తీశాయి.
ముఖ్యంగా చివరి గంటల్లో కొనుగోళ్లు మార్కెట్‌కు బాగా కలిసొచ్చాయి. దీంతో బుదవారం నాటి ట్రేడింగ్‌ను సరికొత్త రికార్డులతో ముగించాయి. సెన్సెక్స్ 222 పాయింట్లు లాభపడి 37,887 వద్ద సరికొత్త జీవనకాల గరిష్టాయిలో స్థిరపడింది. నిఫ్టీ కూడా 60పాయింట్ల లాభంతో 11,450 వద్ద ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ 186 పాయింట్లు ఎగబాకి 28,062 వద్ద స్థిరపడింది. కాగా, డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 68,66గా కొనసాగుతోంది.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications