Stock Market : మార్కెట్లకు కొత్త ఊపిరి.. మదుపర్లకు లాభాల వర్షం

ట్రంప్ టారిఫ్ దెబ్బతో సోమవారం ( నిన్న ) కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు మంగళవారం ఒక్కసారిగా కళకళలాడాయి. సుంకాల విషయంలో ప్రపంచ దేశాలతో చర్చలకు అమెరికా సిద్ధమంటూ సంకేతాలివ్వడంతో మదుపర్ల గుండెల్లో ధైర్యం చిగురించింది. దీంతో ఆసియా మార్కెట్లతో పాటు మన స్టాక్ మార్కెట్లు కూడా దుమ్మురేపాయి. దీనికి తోడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నుంచి మరో పావు శాతం వడ్డీ రేట్ల కోత ఉంటుందన్న అంచనాలు కూడా మార్కెట్‌కు మరింత ఊపునిచ్చాయి. కొనుగోళ్లు పెరిగాయి.

ఈ ఉత్సాహంతో సెన్సెక్స్ ఒక్కసారిగా దూసుకుపోయింది. ఒక దశలో ఏకంగా 1600 పాయింట్లకు పైగా లాభపడి మదుపర్లను ఆశ్చర్యానికి గురిచేసింది. నిఫ్టీ కూడా 22,600 పాయింట్ల మైలురాయిని దాటేసింది. అయితే, మార్కెట్ ముగిసే సమయానికి అమ్మకాల ఒత్తిడి పెరగడంతో లాభాలు కొద్దిగా తగ్గాయి, కానీ మార్కెట్ జోరు మాత్రం తగ్గలేదు.

stock-markets-soar-on-hopes-of-rbi-rate-cut-and-global-trade-talks

ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే సెన్సెక్స్ లాభాలతో మొదలైంది. 74,013.73 పాయింట్ల వద్ద ప్రారంభమైంది (నిన్నటి ముగింపు 73,137.90). రోజంతా లాభాల బాటలోనే పయనించింది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో 74,859.39 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకింది. చివరకు 1089.18 పాయింట్ల లాభంతో 74,227.08 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ విషయానికొస్తే, 374.25 పాయింట్ల లాభంతో 22,535.85 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.86.27గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో పవర్ గ్రిడ్ మినహా మిగిలిన అన్ని కంపెనీల షేర్లు లాభాల్లో ముగియడం విశేషం. ముఖ్యంగా టైటాన్, బజాజ్ ఫైనాన్స్, ఎల్‌అండ్‌టీ, ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్ షేర్లు మదుపర్లకు కాసుల వర్షం కురిపించాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ 100, బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ 100 సూచీలు కూడా ఏకంగా 2 శాతం మేర లాభాల్లో ముగిశాయి. చిన్న, మధ్య తరహా కంపెనీలు కూడా ఈ దూకుడులో భాగమయ్యాయి.

ఇక, ప్రపంచ మార్కెట్ల విషయానికొస్తే, ఆసియా-పసిఫిక్ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడయ్యాయి. జపాన్ నిక్కీ ఏకంగా 5.68 శాతానికి పైగా లాభపడి సంచలనం సృష్టించింది. హాంగ్‌కాంగ్, షాంఘై మార్కెట్లు కూడా ఒకటిన్నర శాతం లాభపడ్డాయి. కానీ సింగపూర్, తైవాన్, జకార్తా మార్కెట్లు మాత్రం నష్టాల్లో ముగిశాయి. యూరోపియన్ మార్కెట్లు మాత్రం లాభాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా మార్కెట్ల భవిష్యత్తును సూచించే డోజోన్స్ ఫ్యూచర్స్ కూడా 2 శాతం మేర లాభాల్లో ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 64 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, బంగారం ఔన్సు ధర 3020 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

మార్కెట్ ఈ స్థాయిలో పుంజుకోవడానికి కారణాలు ఏమిటి?
కొన్ని దేశాలతో సుంకాలను చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని ట్రంప్ చేసిన ప్రకటన మార్కెట్లలోకి కొత్త ఉత్సాహాన్ని నింపింది. ట్రంప్ కాస్త వెనక్కి తగ్గుతారని మదుపర్లు భావిస్తున్నారు. దీనివల్ల వాణిజ్య యుద్ధం వస్తుందనే భయం తొలగిపోయింది. ఇది సూచీల సెంటిమెంట్‌ను బాగా బలపరిచింది. అటు చైనా, వియత్నాం వంటి దేశాలతో పోలిస్తే ట్రంప్ సుంకాల వల్ల మన దేశానికి పెద్దగా నష్టం ఉండకపోవచ్చునని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇది మదుపర్ల ఆందోళనలను తగ్గించింది.

మరోవైపు ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడం కూడా మార్కెట్లకు కలిసొచ్చింది. చమురు ధరలు తగ్గితే కంపెనీల ఖర్చులు తగ్గుతాయి, తద్వారా లాభాలు పెరుగుతాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. బుధవారం (ఏప్రిల్ 9న) ఆర్‌బీఐ తన నిర్ణయాలను వెల్లడించనుంది. ఆర్‌బీఐ మరో 25 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లను తగ్గిస్తుందని మదుపర్లు భావిస్తున్నారు. వడ్డీ రేట్లు తగ్గితే రుణాలు చౌకగా లభిస్తాయి, తద్వారా వ్యాపారాలు, పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి. ఇది దేశ ఆర్థిక వృద్ధికి ఊతమిస్తుంది.

అమెరికాలో 10 ఏళ్ల బాండ్ల రాబడులు కూడా ఫిబ్రవరిలో 4.5 శాతం ఉండగా, ఇప్పుడు 4.14 శాతానికి తగ్గాయి. అలాగే 2 ఏళ్ల బాండ్ల రాబడులు కూడా 3.715 శాతానికి పడిపోయాయి. అమెరికా డాలర్ ఇండెక్స్ కూడా 102.92కి తగ్గింది. ఇవన్నీ భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లకు సానుకూల సంకేతాలు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+