Multibagger Stock: లక్ష పెట్టుబడి పెడితే.. రూ. 2.81 కోట్లు ఇచ్చిన స్టాక్.. అదృష్టం అంటే ఇదే కదా..!
స్టాక్ మార్కెట్... ఇది మాయాప్రపంచం! ఇక్కడ అదృష్టం కలిసొస్తే పేదవాడు సైతం కోటీశ్వరుడు కావచ్చు. కానీ, ఈ మార్కెట్ అంత తేలికైనది కాదు. దీనిలో లోతైన అధ్యయనం, నిరంతర పరిశోధన, కొండంత సహనం ఉంటేనే ఇక్కడ విజయం సాధించగలం. చాలామంది ఇన్వెస్టర్లు మల్టీబ్యాగర్ స్టాక్స్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తుంటారు. ఎందుకంటే, ఈ మల్టీబ్యాగర్ స్టాక్స్ ఒక్కసారి క్లిక్ అయితే చాలు, మీ జీవితాన్నే మార్చేస్తాయి. అలాంటి ఒక అద్భుతమైన, మాయాజాలం చేసిన స్టాక్ గురించే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అదే భారత్ రసాయన్!
ఏకంగా 28,014 శాతం పెరిగిన స్టాక్.
ఒకప్పుడు కేవలం రూ. 39.40... నమ్మశక్యంగా లేదు కదూ? కానీ ఇది నిజం! 2009లో భారత్ రసాయన్ షేర్ ధర అక్షరాలా ముప్పై తొమ్మిది రూపాయల నలభై పైసలు మాత్రమే. ఇప్పుడు అది మీరు నమ్మలేనంతగా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)లో ఈ షేరు ధర అమాంతం దూసుకుపోయి రూ. 11,210 కి చేరుకుంది. చివరకు 5.01 శాతం లాభంతో రూ.11,125 వద్ద ఈ స్టాక్ ముగిసింది. అటు గత 16 సంవత్సరాలలో ఈ స్టాక్ ఏకంగా 28,014 శాతం పెరిగింది! ఇది నమ్మశక్యం కాని వృద్ధి నమోదు చేసింది. ఇది కూడా కేవలం 16 ఏళ్లలోనే..

లక్ష పెట్టుబడికి రూ.2.83 కోట్లు
ఇంకాస్త వివరంగా చెప్పాలంటే, ఒకవేళ మీరు 16 సంవత్సరాల క్రితం, 2009లో ఈ షేరు మీద రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే... మీ పెట్టుబడి ఇప్పుడు ఎంతకు పెరిగి ఉంటుందో తెలుసా? అక్షరాలా రూ. 2.81 కోట్లు! మీరు పెట్టిన లక్ష కాస్తా దాదాపు 28,014 రెట్లు పెరిగేది! ఇది కదా నిజమైన మల్టీబ్యాగర్ పవర్! లక్షను కోటి చేసే మ్యాజిక్!
ఈ రోజు (మార్చి 25, మంగళవారం) NSEలో భారత్ రసాయన్ షేరు ధర దాదాపు 5 శాతం పైగా పెరిగింది. గత ఐదేళ్లలో ఈ షేరు 108.74 శాతం లాభాలను కురిపించింది. అంటే, ఐదు సంవత్సరాల క్రితం మీరు రూ. 1 లక్ష పెట్టుబడి పెడితే, ఇప్పుడు అది రూ. 2.09 లక్షలు అయి ఉండేది. రెట్టింపు లాభాన్ని ఇచ్చింది. ఈ స్టాక్ దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు నిజంగా ఒక వరంలాంటిది.
ఒడిదుడుకుల్లోనూ ముందుకు..
అయితే, స్వల్పకాలికంగా ఈ స్టాక్ కాస్త ఒడిదుడుకులకు గురైంది. గత ఏడాదిలో భారత్ రసాయన్ షేర్లు 29.83 శాతం పెరిగినా, గత ఆరు నెలల్లో మాత్రం 1.63 శాతం స్వల్పంగా పడిపోయాయి. కానీ, ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. మార్కెట్ సెంటిమెంట్ అంతంతమాత్రంగా ఉన్నా, ఈ షేరు మాత్రం ఒక్క నెలలోనే దాదాపు 8.72 శాతం పెరిగింది. సంవత్సరం మొదలైనప్పటి నుండి చూస్తే (YTD), ఈ స్టాక్ 9.92 శాతం లాభపడింది. అంటే, రూ. 10,130.45 నుండి ప్రస్తుత మార్కెట్ ధరకు దూసుకుపోయింది. నిలకడగా పెరుగుతూనే ఉంది!
ఇక ఈ కంపెనీ ఆర్థిక ఫలితాలను చూస్తే.. డిసెంబర్ 2024తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నికర లాభం ఏకంగా 164.73 శాతం పెరిగి రూ. 40.53 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే సమయంలో ఇది కేవలం రూ. 15.31 కోట్లు మాత్రమే. లాభాల్లో కూడా భారీ జంప్ ను నమోదు చేసుకుంది.
ఊహించని విధంగా కంపెనీ ఆదాయం.
EBITDA కూడా 55.64 శాతం పెరిగి డిసెంబర్ 2024లో రూ. 48.95 కోట్లకు చేరుకుంది. గత ఏడాది డిసెంబర్ 2023లో ఇది రూ. 31.45 కోట్లుగా ఉంది. అమ్మకాలు కూడా దూసుకుపోయాయి. నికర అమ్మకాలు 10.07 శాతం పెరిగి డిసెంబర్ 2024లో రూ. 256.40 కోట్లకు చేరుకున్నాయి. గత ఏడాది డిసెంబర్ 2023లో ఇది రూ. 232.94 కోట్లుగా నమోదయ్యాయి.
కంపెనీ EPS (షేరుకు ఆదాయం) కూడా ఊహించని విధంగా పెరిగింది. డిసెంబర్ 2023లో రూ. 36.85గా ఉన్న EPS, డిసెంబర్ 2024లో ఏకంగా రూ. 97.54కు పెరిగింది. అంటే కంపెనీ పనితీరు అద్భుతంగా ఉందని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి.
భారత్ రసాయన్ షేరు ప్రయాణం నిజంగా దీర్ఘకాలిక పెట్టుబడికి ఒక గొప్ప ఉదాహరణ నిలుస్తుంది. సహనం, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే స్టాక్ మార్కెట్ ద్వారా ఎంతటి సంపద సృష్టించవచ్చో ఈ స్టాక్ నిరూపిస్తోంది. అయితే, ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం. కాబట్టి, తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా, పెట్టుబడి పెట్టే ముందు ఆర్థిక నిపుణులను తప్పకుండా సంప్రదించండి. అలాగే, మీ స్వంతంగా కూడా కంపెనీ గురించి పూర్తిగా తెలుసుకోవడం చాలా ముఖ్యం.
గమనిక : ఈ కథనం కేవలం సమాచారం కోసం మాత్రమే. ఇది ఎలాంటి పెట్టుబడి సలహా కాదు. మీ పెట్టుబడులకు మీరే బాధ్యులు. పెట్టుబడి పెట్టే ముందు ఆర్థిక నిపుణులను తప్పకుండా సంప్రదించండి












Click it and Unblock the Notifications