Union Budget 2026: హల్వా వేడుక పూర్తి, లాక్ ఇన్ లోకి అందరూ
ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న కేంద్ర సాధారణ బడ్జెట్(Budget 2026)కు సంబంధించిన ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. ఈ కీలక దశను సూచించే సంప్రదాయ కార్యక్రమం అయిన హల్వా వేడుకను మంగళవారం సాయంత్రం ఢిల్లీలోని నార్త్ బ్లాక్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు సహాయ ఆర్థిక మంత్రి పంకజ్ చౌధరీ పాల్గొన్నారు. బడ్జెట్ రూపకల్పనలో భాగమైన , కు చెందిన వివిధ విభాగాల కార్యదర్శులు, ఉన్నతాధికారులు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు.
హల్వా వేడుక అనంతరం నిర్మలా సీతారామన్ బడ్జెట్ ముద్రణ జరుగుతున్న ప్రెస్‌ను సందర్శించారు. బడ్జెట్ పత్రాల ప్రింటింగ్ ప్రక్రియ, భద్రతా ఏర్పాట్లను ఆమె స్వయంగా పర్యవేక్షించారు. ఈ ఏడాది బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం నిర్మలా సీతారామన్‌కు వరుసగా తొమ్మిదోసారి కావడం విశేషం. అంతర్జాతీయంగా కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, దేశీయంగా 7.4 శాతం ఆర్థిక వృద్ధి అంచనాల మధ్య ఈ బడ్జెట్ ప్రాధాన్యం మరింత పెరిగింది.

హల్వా వేడుకతో పాటు బడ్జెట్ లాక్-ఇన్ పీరియడ్ కూడా అధికారికంగా ప్రారంభమైంది. అంటే బడ్జెట్ తయారీలో నేరుగా పాల్గొన్న అధికారులు, సిబ్బంది బడ్జెట్ ప్రసంగం పూర్తయ్యే వరకు నార్త్ బ్లాక్ పరిధిలోనే ఉండాల్సి ఉంటుంది. ఈ కాలంలో వారికి బయట ప్రపంచంతో ఎలాంటి సంప్రదింపులు ఉండవు. ఫోన్ కాల్స్, బయటికెళ్లే అవకాశం కూడా ఉండదు. సీసీటీవీ నిఘా, కట్టుదిట్టమైన భద్రత మధ్య వీరు పూర్తిగా గోప్యతతో పని చేస్తారు. ఆర్థిక మంత్రి పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రసంగాన్ని పూర్తి చేసిన తర్వాతే ఈ లాక్-ఇన్ ముగుస్తుంది. సాధారణంగా ఈ ప్రక్రియ ఐదు రోజులపాటు కొనసాగుతుంది.
1950లో బడ్జెట్ ముద్రణ సమయంలో సమాచారం లీక్ అయిన నేపథ్యంలో, గోప్యతను కాపాడేందుకు అప్పటినుంచి లాక్-ఇన్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆర్థిక శాఖ కొత్త కార్యాలయం అయిన కర్తవ్య భవన్-1లో బడ్జెట్ ప్రింటింగ్ సదుపాయం లేకపోవడంతో, సంప్రదాయంగా నార్త్ బ్లాక్‌లోనే బడ్జెట్ పత్రాల ముద్రణ కొనసాగుతోంది. అందుకే ఈ ఏడాది కూడా రైసినా హిల్‌లోని నార్త్ బ్లాక్‌లో హల్వా వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా బడ్జెట్ తయారీలో కీలక పాత్ర పోషించిన అధికారులకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్వయంగా హల్వా పంచి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకతో దేశ ఆర్థిక దిశను నిర్దేశించే బడ్జెట్‌కు చివరి మెట్టు చేరుకున్నట్టైంది.
లాక్-ఇన్ పీరియడ్‌లోకి వెళ్లే వారు ఎవరు?
మొదటగా, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ముఖ్య అధికారులు లాక్-ఇన్‌లోకి వెళ్తారు. రెవెన్యూ విభాగం, వ్యయ విభాగం, ఆర్థిక వ్యవహారాల విభాగం, బడ్జెట్ డివిజన్‌లలో బడ్జెట్ రూపకల్పనలో ప్రత్యక్షంగా పాల్గొన్న సీనియర్ అధికారులు ఈ జాబితాలో ఉంటారు. వీరే పన్నులు, ఖర్చులు, ఆదాయ అంచనాలకు తుది రూపం ఇస్తారు. అలాగే ఆర్థిక శాఖ కార్యదర్శులు కూడా ఈ లాక్-ఇన్ ప్రక్రియలో భాగమవుతారు. ఫైనాన్స్ సెక్రటరీతో పాటు రెవెన్యూ, ఎక్స్‌పెండిచర్, ఎకనామిక్ అఫైర్స్ విభాగాలకు చెందిన కార్యదర్శులు బడ్జెట్ డాక్యుమెంట్స్‌ను సమీక్షించే కీలక బాధ్యతలో ఉండటంతో వారిని కూడా బయటి ప్రపంచం నుంచి పూర్తిగా వేరుచేస్తారు.
బడ్జెట్ పత్రాల భద్రతలో అత్యంత కీలకమైన పాత్ర పోషించేది ప్రింటింగ్ ప్రెస్ సిబ్బంది. నార్త్ బ్లాక్‌లోని ప్రభుత్వ ముద్రణాలయంలో పనిచేసే టైప్సెట్టింగ్, కంపోజింగ్, పేజీ డిజైన్, ప్రింటింగ్, బైండింగ్ సిబ్బంది మొత్తం లాక్-ఇన్‌లో ఉంటారు. బడ్జెట్ పత్రాలు పూర్తిగా ముద్రించబడే వరకు వీరికి బయటకు వెళ్లే అవకాశం ఉండదు.
-
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన











Click it and Unblock the Notifications