వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పీఎన్బీ మోసం తక్కువే: మొత్తం వాటా రూ.61,200 కోట్లు.. ఇదీ ఆర్బీఐ లెక్క

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

ముంబై: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్ ‌(పీఎన్బీ)లో బయటపడిన మోసంతో దొరికిన వాడే దొంగ అన్నట్లు ఉంది. ఇంకా బహిర్గతం కాని కేసులు ఇతర బ్యాంకుల్లోనూ ఉన్నాయి. అందుకు అతిపెద్ద బ్యాంక్ ఎస్బీఐ నుంచి బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా మినహాయింపు కాదని 'రాయిటర్స్' బయటపెట్టింది. కనుక అందరూ ఆశ్చర్య చకితులైనా బ్యాంకుల్లో మోసాల సమస్య తీవ్రత ఇంకా ఎక్కువగా ఉన్నదని ఆర్బీఐ గణాంకాలు చెబుతున్నాయి. గత ఐదేళ్లల్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మొత్తం 8,670 మోసం కేసులు నమోదయ్యాయని తెలుస్తోంది. అంతర్జాతీయ వార్తాసంస్థ 'రాయిటర్స్' ఆర్టీఐ ద్వారా సేకరించిన వివరాల ప్రకారం మొత్తం బ్యాంకుల్లో మోసాల విలువ అక్షరాల రూ.61,200 కోట్లు(9.58 బిలియన్‌ డాలర్లు) కావడం గమనార్హం. ఇప్పటికే భారత బ్యాంకింగ్‌ వ్యవస్థను మొండి బకాయిల సమస్య వేధిస్తున్నది.
తాజాగా ఈ మోసాల వల్ల కలిగే నష్టం అంతకుమించిన ఇబ్బందులను తెచ్చిపెడుతోంది. పై గణాంకాలను చూస్తుంటే సమస్య తీవ్రత ఎంతుందో అర్థమవుతుంది. బ్యాంకుల్లో నమోదైన ఈ రుణం మోసం కేసులు స్థిరంగా పెరుగుతుండడం కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.17,634 కోట్ల మేర మోసాలు జరిగాయి. 2012-13లో ఇవి రూ.6,357 కోట్లు. పీఎన్బీ శాఖ నీరవ్‌ మోదీకి చెందిన కంపెనీలకు 1.77 బిలియన్‌ డాలర్ల రుణాలను అక్రమంగా ఇవ్వడం చూస్తే.. ఈ మోసాలు ఇంకా ఇతర బ్యాంకుల్లో కూడా జరిగాయా అన్న ప్రశ్న తలెత్తుతుంది.

రుణ పాలనాంశాల్లో లోపాలు సవరించాలి

రుణ పాలనాంశాల్లో లోపాలు సవరించాలి

బ్యాంకుల్లో జరుగుతున్న మోసాలు ఆర్థిక రంగానికి కలిగించే ఇబ్బందుల్లో ఒకటని ఆర్బీఐ ఇటీవలి ఆర్థిక స్థిరత్వ నివేదికలో పేర్కొంది. ‘చాలా వరకు పెద్ద స్థాయి మోసాలు రుణ ప్రమాణాల్లో ఉన్న లొసుగులను చూపుతున్నాయి' అని పేర్కొంది. నిధులు ఎక్కడి నుంచి ఎక్కడకు వెళుతున్నాయన్న దానిపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి. సాధారణ రుణ పాలనా అంశాల్లోని లోపాలను సవరించాల్సిన అవసరం ఉన్నదని వ్యాఖ్యానించింది. ఇటీవల మొండి బకాయిలను దాచిపెట్టుకోవద్దని.. వాటి రికవరీకి కఠిన నిబంధనలను తీసుకొచ్చిన సమయంలో ఈ మోసం బయటపడడం గమనార్హం. మరో పక్క, ఆర్బీఐ సైతం రుణ ఎగవేతదార్లను బయటకు ప్రకటించకుండా ఉందని కొంత మంది విమర్శకులు అంటున్నారు. అలా ప్రకటించడం వల్ల న్యాయబద్ధ సమస్యలకు తోడు.. ఆ రుణాల వసూలు మరింత సంక్లిష్టమవుతుందని ఆర్బీఐ అభిప్రాయ పడుతున్నది.

ఎస్బీఐలో అత్యధికంగా 1069 రుణ మోసాలు

ఎస్బీఐలో అత్యధికంగా 1069 రుణ మోసాలు

దేశవ్యాప్తంగా బ్యాంకు రుణాల మోసాల పరిమాణం మరింత ఎక్కువగా ఉండొచ్చని ఆర్బీఐ అంటోంది. ఆర్బీఐకి వచ్చే గణాంకాలు కేవలం రూ. లక్ష ఆ పైన కేసులు మాత్రమే. ఈ కేసుల విషయంలోనూ పీఎన్బీ అగ్రస్థానంలో ఉండడం గమనార్హం. మొత్తం రూ.6562 కోట్ల విలువైన 389 కేసులు నమోదయ్యాయని ఆర్బీఐ గణాంకాలు చెబుతున్నాయి. ఇక పీఎన్బీ తర్వాతి స్థానాల్లో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో నమోదైన 389 కేసుల్లో 4473 కోట్లు, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో రికార్డైన 231 కేసుల్లో రూ.4050 కోట్లు ఉన్నాయి. అతిపెద్ద బ్యాంకైన ఎస్బీఐలో 1069 రుణ మోసం కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. కాగా మొండి రుణాల సమస్యను పరిష్కరిస్తేనే సరిపోదని.. పెద్ద ఎత్తున రుణ జారీ విధానాల్లో సంస్కరణలను తేవాలని ఆర్థికవేత్తలు చెబుతున్నారు.

స్విఫ్ట్ లావాదేవీలకు అనుమతులు.. చెల్లింపుల తీరుతో సందేహస్పదం సైబర్ భద్రత

స్విఫ్ట్ లావాదేవీలకు అనుమతులు.. చెల్లింపుల తీరుతో సందేహస్పదం సైబర్ భద్రత

ముంబైలోని ఒక శాఖలో 1.77 బిలియన్‌ డాలర్ల మేర మోసపూరిత లావాదేవీలు జరిగాయని పీఎన్బీ ఎక్స్చేంజీలకు బుధవారం తెలిపిన ప్రకటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. కార్పొరేట్‌ పాలన సరిగ్గా లేకే ఇలా జరిగిందన్నది వాస్తవమేనని యాడ్రాయిట్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్‌ సేవల అధిపతి అమిత్‌ కుమార్‌ అన్నారు. ‘ఒక శాఖలోని కేవలం ఒకరిద్దరు జూనియర్‌ అధికార్లకు మాత్రమే ఈ మోసం గురించి తెలుసంటున్నారు. మిగతా పై అధికారులకెవ్వరికీ తెలియకుండా ఇది జరగడం అసాధ్యం' అని ఆయన అన్నారు. ఏడేళ్లుగా ఆ ఒక్కడే ఈ కుంభకోణాన్ని ఎవరికీ తెలియకుండా ఎలా చేశాడని విశ్లేషకులు సైతం ప్రశ్నిస్తున్నారు. బ్యాంకు పుస్తకాల్లో సైతం స్విఫ్ట్‌ లావాదేవీలకు అనుమతుల విషయం కానీ.. చెల్లింపుల విషయం కానీ ప్రస్తావనకు రాలేదంటే.. బ్యాంకు సైబర్‌ భద్రతపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

English summary
NEW DELHI: Investors may have been shocked when one of India’s biggest banks disclosed a $1.77 billion fraud by a billionaire jeweller, but the central bank has recorded data that shows the problem runs far deeper and wider. Reserve Bank of India (RBI) data, which a Reuters reporter obtained through a right-to-information request, shows state-run banks have reported 8,670 “loan fraud” cases totalling 612.6 billion rupees ($9.58 billion) over the last five financial years up to March 31, 2017.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X