Verse Innovation:లాభాల బాటలో వెర్స్ ఇన్నోవేషన్ - త్వరలో IPO..!!
- వ్యయాలను నియంత్రించి, క్రమశిక్షణతో కూడిన వృద్ధితో బ్రేక్-ఈవెన్ సాధించిన సంస్థ
- ఏఐ కంటెంట్, యాడ్-టెక్, విస్తరణకు కేంద్రబిందువు
- సుస్థిర లాభాలు, పనితీరుతో ఐపీఓ దిశగా ప్రయాణం
స్టాక్ మార్కెట్ లో వెర్స్ ఇన్నోవేషన్ సంచలనాలకు శ్రీకారం చుట్టింది. డైలీహంట్, జోష్, మాగ్‌జటర్, నెక్స్‌వెర్స్ ఏఐ వంటి ప్రముఖ ప్లాట్‌ఫామ్‌లకు మాతృసంస్థ అయిన వెర్స్ ఇన్నోవేషన్స్.. డెవలప్మెంట్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కొత్త దశలోకి ప్రవేశిస్తోంది. త్వరలోనే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ను జారీ చేయబోతోంది. డాక్టర్ అనురాగ్ బాత్రా నిర్వహించిన ఇంటర్వ్యూలో వెర్స్ ఇన్నోవేషన్ సహవ్యవస్థాపకులు ఉమంగ్ బేడి దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
నెలకు 300 మిలియన్లకుపైగా వినియోగదారులను ఆకర్షిస్తోంది వెర్స్ ఇన్నోవేషన్స్ లోని ప్లాట్‌ఫామ్స్. గత ఏడాది నగదు వ్యయాన్ని గణనీయంగా తగ్గించింది.బ్రేక ఈవెన్‌కు చేరువ అవుతోంది.ఈ క్రమంలో కొత్త రంగాలకు తన పెట్టుబడులను విస్తరిస్తోంది. దేశీయ స్టార్టప్ రంగంలో ఇటువంటి సుస్థిరభివృద్ధి సాధించిన టాప్ సంస్థల్లో ఒకటిగా నిలిచింది.

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు వెర్స్ బిజినెస్ స్ట్రాటజీలో కీలక పాత్ర పోషిస్తోంది. కంపెనీ తన కంటెంట్, అడ్వర్టైజింగ్, ఆపరేషనల్ స్టాక్ అంతటా ఏఐని విస్తృతంగా వినియోగిస్తోంది. కంటెంట్ జనరేషన్, మోడరేషన్, పర్సనలైజేషన్ వంటి ప్రక్రియలను ఆటోమేట్ చేస్తోంది. ఈ ఏఐ వల్ల ఆయా ప్లాట్‌ఫామ్ సామర్థ్యం గణనీయంగా మెరుగుపడుతుందని వెర్స్ ఇన్నోవేషన్స్ యాజమాన్యం బలంగా విశ్వసిస్తోంది.
వెర్స్ కొత్త ఏఐ- ఆధారిత టూల్స్ ను కూడా నిర్మిస్తోంది. ఇందులో అడ్వర్టయిజర్ల రాబడిని మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన యాడ్-టెక్ ప్లాట్‌ఫామ్, జనరేటివ్ ఏఐ-ఆధారిత కంటెంట్ సొల్యూషన్స్ వంటివి ఉన్నాయి. ఇవి- పెట్టుబడులు సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా కొత్త ఆదాయ మార్గాలను సృష్టిస్తాయి. సంస్థను మరిన్ని లాభాలు సాధించేలా, వృద్ధి దశకు బాటలు వేస్తాయి.
భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన నిర్మాణాత్మక వాస్తవాలను ఈ సందర్భంగా ఉమంగ్ బేడి ప్రస్తావించారు. దేశంలో భారీ సంఖ్యలో వినియోగదారులు ఉన్నప్పటికీ, మోనటైజేషన్ తక్కువ సంఖ్యలో వినియోగదారులకే పరిమితమైందని అన్నారు. డిజిటల్ అడ్వర్టైజింగ్ ఆదాయంలో ఎక్కువ భాగం ప్రపంచ టెక్ ప్లాట్‌ఫామ్‌లకే దక్కుతోందని, దేశీయ సంస్థలకు అవకాశాలు పరిమితంగానే ఉంటోన్నాయని తెలిపారు.
ఈ సవాళ్లను ధీటుగా ఎదుర్కొనేలా వెర్స్ ప్రీమియం ప్రేక్షకులు, సబ్‌స్క్రిప్షన్ ఆధారిత ఆఫర్లు, వర్క్-ఆధారిత అడ్వర్టైజింగ్ సొల్యూషన్స్‌ను లక్ష్యంగా చేసుకుంటోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఉత్పత్తుల ద్వారా ప్రపంచవ్యాప్త అవకాశాలను కూడా అన్వేషిస్తోంది. ఈ వ్యూహాలు కంపెనీ ఆర్థిక స్థిరత్వాన్ని మరింత బలోపేతం చేస్తాయని అంచనా.
భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికల గురించి ఉమంగ్ బేడి వెల్లడించారు. వెర్స్ ఇన్నోవేషన్ లాభదాయకత, స్థిరమైన పనితీరు ఆధారంగా తన తదుపరి దశకు సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పబ్లిక్ లిస్టింగ్ అయిన ఈ సంస్థ ఐపీఓను జారీ చేయనుంది. డిజిటల్ ఎకోసిస్టమ్ వికసిస్తున్న కొద్దీ.. వెర్స్ ఇన్నోవేషన్ కంటెంట్, టెక్నాలజీ, అడ్వర్టైజింగ్ జంక్షన్ లో తనను తాను ధీటుగా నిలబెట్టుకుంటోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్.. దాని భవిష్యత్తు గమనాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తోంది.
టెక్నాలజీ.. డిజిటల్ అంతరాన్ని తగ్గించగలదనే ఆలోచన ఉంది వెర్స్ ఇన్నోవేషన్. ప్రారంభం నుండి సాంకేతికతను ఉపయోగించుకుని లక్షల మంది వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా కంటెంట్ ను అందిస్తోంది. ఎప్పటికప్పుడు తనను తాను తీర్చిదిద్దుకుంటోంది. దీని ప్రత్యేకమైన ఏఐ, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్.. వంటి టెక్నాలజీని వినియోగదారుల ప్రాధాన్యతలను బట్టి వారికి అనుకూలించే కంటెంట్‌ను అందిస్తోన్నాయి.
వెర్స్ సొంత సాంకేతిక ప్లాట్‌ఫామ్.. దేశంలోని వందలాది మిలియన్ల మంది వినియోగదారులకు వారి స్థానిక భాషల్లో డైలీహంట్‌పై కంటెంట్‌ను అందిస్తోంది. దేశంలో నంబర్ వన్, అత్యంత ఆకర్షణీయమైన క్రియేటర్స్ యాప్ 'జోష్'కు కూడా ఎప్పటికప్పుడు సరికొత్తగా మెరుగులు దిద్దుతోంది. నెక్స్‌వెర్స్.ఏఐ, డైలీహంట్ ప్రీమియం, జోష్ ఆడియో కాలింగ్ అండ్ ఆడియో స్టోరీస్, వెర్స్ కొలాబ్ వంటి ఏఐ-ఫస్ట్ ఉత్పత్తులతో వెర్స్ దేశీయ డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో వినియోగదారులు, కంటెంట్, బ్రాండ్‌ల మధ్య సంబంధాలను పునర్నిర్మిస్తోంది. సరికొత్త నిర్వచనం ఇస్తోంది.
భారత్‌పై దృష్టి సారించిన యాప్‌ల కుటుంబంతో వెర్స్ ఇన్నోవేషన్, స్థానిక భాషల సాంకేతికతలో మొదటి యూనికార్న్‌గా నిలిచింది. దీని ప్రస్తుత పెట్టుబడిదారులలో సీపీపీ ఇన్వెస్ట్‌మెంట్స్, ఒంటారియో టీచర్స్ పెన్షన్ ప్లాన్ (OTPP), ఖతర్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ (QIA), సిగ్యులర్ గఫ్, కార్లైల్ గ్రూప్, బెయిలీ గిఫోర్డ్, గోల్డ్‌మన్ సాచ్స్, గూగుల్, మైక్రోసాఫ్ట్, సీక్వోయా క్యాపిటల్ ఇండియా, మ్యాట్రిక్స్ పార్ట్‌నర్స్ ఇండియా తదితరులు ఉన్నారు. ఈ ప్రముఖ సంస్థలు వెర్స్ వృద్ధికి తోడ్పడుతున్నాయి.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్‌ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications