Wings India 2026: విమాన రంగంలో పెట్టుబడులకు ప్రధాని పిలుపు
ఒకప్పుడు ఆకాశంలో ఎగిరే విమానాన్ని చూసి మురిసిపోయిన సామాన్య భారతీయుడు, నేడు అదే విమానంలో ధీమాగా ప్రయాణిస్తున్నాడు. గత దశాబ్ద కాలంలో భారత విమానయాన రంగం కేవలం అభివృద్ధి చెందడమే కాదు, ప్రపంచ దేశాలు విస్తుపోయేలా మూడవ అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్‌గా అవతరించింది. ఈ అద్భుత ప్రగతిని ప్రతిబింబిస్తూ, హైదరాబాద్‌లోని బేగంపేట్ విమానాశ్రయంలో ప్రారంభమైన ఆసియాలోనే అతిపెద్ద పౌర విమానయాన ప్రదర్శన 'వింగ్స్ ఇండియా 2026' (Wings India 2026) సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) భారత్ సాధించిన విజయాలను ప్రపంచానికి చాటిచెప్పారు.
ప్రధాని మోదీ తన వీడియో సందేశంలో ముఖ్యంగా 'ఉడాన్' పథకం ప్రభావాన్ని నొక్కి చెప్పారు. "హవాయి చప్పల్ వేసుకునే వాడు కూడా హవాయి జహాజ్ (విమానం) ఎక్కాలి" అన్న తన నినాదం నేడు నిజమైందని ఆయన పేర్కొన్నారు. దశాబ్దం క్రితం విమాన ప్రయాణం కలగా మిగిలిన చిన్న నగరాల్లో నేడు విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయని, ఇప్పటివరకు సుమారు 1.5 కోట్ల మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందారని ఆయన గుర్తుచేశారు. 2014లో దేశంలో కేవలం 70 విమానాశ్రయాలు మాత్రమే ఉండగా, నేడు ఆ సంఖ్య 160 దాటడం భారత మౌలిక సదుపాయాల వేగానికి నిదర్శనమని ప్రశంసించారు.

పెట్టుబడిదారులకు పిలుపు
'కో-పైలట్లుగా రండి' భారత్ కేవలం విమానాలను నడిపే దేశంగానే కాకుండా, వాటిని తయారు చేసే శక్తిగా ఎదుగుతోందని ప్రధాని స్పష్టం చేశారు. ఎయిర్‌క్రాఫ్ట్ డిజైనింగ్, తయారీ, పైలట్ శిక్షణ మరియు నిర్వహణ (MRO) రంగాల్లో భారత్ అపారమైన అవకాశాలకు నిలయంగా మారిందని వివరిస్తూ.. అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఈ వృద్ధిలో 'కో-పైలట్లు'గా భాగస్వాములు కావాలని ఆయన ఆహ్వానించారు. భారత విమానయాన సంస్థలు ఇప్పటికే 1,500 కంటే ఎక్కువ కొత్త విమానాల కోసం ఆర్డర్లు ఇవ్వడం ద్వారా దేశీయ మార్కెట్ సత్తాను ప్రపంచానికి చాటాయని పేర్కొన్నారు.
భవిష్యత్తు దిశగా అడుగులు
2047 నాటికి దేశంలో 400 విమానాశ్రయాలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమని ప్రధాని వెల్లడించారు. భవిష్యత్తు సాంకేతికతలైన e-VTOL (ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్) విమానాలు, సీప్లేన్ కార్యకలాపాలు, సుస్థిర విమానయాన ఇంధనం (SAF) వంటి వినూత్న రంగాల్లో భారత్ గ్లోబల్ హబ్‌గా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి కె. రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ 'వింగ్స్ ఇండియా 2026' సదస్సు, భారత విమానయాన భవిష్యత్తును అగ్రపథంలో నిలబెట్టే కీలక వేదికగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
-
రేవంత్ కు కేంద్రం బంపర్ బొనాంజా , 2028 తర్వాతా - మారుతున్న లెక్కలు..!! -
PM Modi: సీఎంలకు మోడీ సందేశం ఇదే..! మళ్లీ ఆ కోవిడ్ మోడల్..! -
సంక్షోభం వస్తే మీ సన్నద్ధత ఎంత ? సీఎంల భేటీలో ప్రధాని మోడీ..! -
మోదీ-ట్రంప్ వార్ ఫోన్ కాల్ మధ్యలో మస్క్- షాకింగ్ ట్విస్ట్ -
మార్కాపురం బస్సు ప్రమాద బాధితుల కోసం ప్రధాని కీలక ప్రకటన..!! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!!












Click it and Unblock the Notifications