షాకింగ్: కరోనాతో మరో సింహం మృతి -చెన్నైలోని వడలూర్ జూ పార్క్‌లో హైటెన్షన్ -రంగంలోకి సీఎం స్టాలిన్

దేశంలో కరోనా వైరస్ విలయ ప్రభావం ఇంకా కొనసాగుతున్నది. అత్యంత ప్రమాదకరంగా కొనసాగుతోన్న సెకండ్ వేవ్.. మనుషులతోపాటు మూగజీవాలనూ బలితీసుకుంటున్నది. కొవిడ్ వ్యాధితో మరో సింహం చనిపోయింది. తమిళనాడు రాజధాని చెన్నై శివారు వండలూరులో గల అరిగ్నర్ అన్నా జూ పార్క్ లోనే మరో జీవి ప్రాణాలు కోల్పోవడం ప్రమాదఘటికలు మోగిస్తున్నది.

వండలూరు అన్నా జూ పార్క్ అధికారుల అధికార ప్రకటన ప్రకారం.. మొత్తం 9 సింహాలకు కరోనా పాజిటివ్ అని జూన్ 9న నిర్ధారణ అయింది. వాటిని ప్రత్యేకంగా ఐసోలేషన్ లో ఉంచుతూ వెటర్నరీ డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స కొనసాగించారు. కానీ గతవారం 9 ఏళ్ల వయసున్న ఓ ఆడ సింహం మృతిచెందింది. ఆ విషాదం నుంచి తేరుకునేలోపే బుధవారం ఉదయం మరో సింహం కన్నుమూసింది.

chennai: Another Asiatic lion dies of Covid-19 at Vandalur Arignar Anna Zoological Park

చనిపోయిన రెండు సింహాలు ఆసియా జాతికి చెందినవేనని అధికారులు తెలిపారు. భోపాల్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ (ఎన్ఐహెచ్ఎస్ఎడి) నివేదిక ప్రకారంమే వండలూరు జూ పార్క్ లోని సింహాలకు కరోనా సోకినట్లు నిర్ధారించామని అధికారులు తెలిపారు. రోజుల వ్యవధిలోనే రెండు సింహాలు మరణించడంతో అధికారులు, ప్రభుత్వం అప్రమత్తమైంది.

తమిళనాడు జూ అథారిటీ చైర్మన్ కూడా అయిన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆదివారం నాడు వండలూరు జూపార్క్ ను సందర్శించారు. కరోనాతో బాధపడుతోన్న సింహాలకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. కాగా, సింహాలకు సోకిన కరోనా రకం.. జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే తరహా కాదని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్‌, లక్నోలోని జూ పార్కుల్లోనూ సింహాలకు కరోనా నిర్ధారణ కావడం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+