Tamil Nadu: లాక్‌డౌన్ పొడగింపు -ఈనెల 12 వరకు ఆంక్షలు -భారీగా సడలింపులు -పూర్తి వివరాలివి
కరోనా మమమ్మారి రెండో దశ విలయ ప్రభావం ఇంకా తగ్గని కారణంగా తమిళనాడులో లాక్‌డౌన్ ను పొడగించారు. కరోనాకు తీవ్రంగా ప్రభావితమైన టాప్-5 రాష్ట్రాల్లో ఒకటైన తమిళనాడులో ఇప్పటికే కొత్త కేసులు, మరణాలు భారీగానే నమోదవుతున్నాయి. పరిస్థితి తీవ్రత దృష్ట్యా భారీగా సడలింపులు కల్పిస్తూనే కొవిడ్ లాక్ డౌన్ ఆంక్షలను కొనసాగించారు..
సెకండ్ వేవ్ తీవ్రత ఇలా తగ్గగానే చాలా రాష్ట్రాలు అలా లాక్ డౌన్లు ఎత్తేశాయి. అయితే, కొవిడ్ విలయాన్ని సీరియస్ గా తీసుకున్న ఆంధ్రప్రదేశ్, తమిళనాడు లాంటి రాష్ట్రాలు మాత్రం ఇప్పటికీ ఆంక్షలు కొనసాగిస్తున్నాయి. తమిళనాడులో కొనసాగుతోన్న కరోనా లాక్ డౌన్ ను ఈనెల 12 వరకు పొడగిస్తూ స్టాలిన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

మరో 10 రోజులపాటు (ఈనెల 12 వరకు) లాక్ డౌన్ ను పొడిగించిన తమిళనాడు ప్రభుత్వం.. స్పోర్ట్స్ యాక్టివిటీలకు అనుమతినిచ్చింది. రెస్టారెంట్, హోటళ్లలో 50% ఆక్యుపెన్సీతో అక్కడే భోజనం చేయొచ్చని, 50% ఆక్యుపెన్సీతో జిమ్ లు తెరవొచ్చని పేర్కొంది. రాత్రి 8 గంటల వరకు మాల్స్, ఫుడ్ కోర్ట్స్ ఓపెన్ చేసుకోవచ్చుని చెప్పింది. అయితే..
అంతా ఊహించినట్లు సినిమా రంగానికి మాత్రం ఎలాంటి ఊరట లభించలేదు. రాష్ట్రంలోని థియేటర్లు, బార్లు మాత్రం ఇప్పట్లో తెరవడానికి వీల్లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఐటీ ఆఫీసులు 50 శాతం ఆక్యుపెన్సీతో తెరుచుకోవచ్చని, స్కూళ్లు, కాలేజీలు మూతబడి ఉంటాయని పేర్కొంది. తమిళనాడులో మొత్తం 24.84లక్షల కొవిడ్ కేసులు, 32,721 మరణాలు నమోదయ్యాయి.












Click it and Unblock the Notifications