Hero: టాప్ హీరో తీరుతో ఫ్యాన్స్ షాక్, సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 1 లక్ష ఇవ్వకుండా మళ్లీ హైకోర్టు, కారుతో !

చెన్నై: విదేశాల నుంచి లగ్జరీ కారు దిగుమతి చేసుకుని ఆ కారులో హ్యాపీగా షికార్లు చేస్తూ ప్రభుత్వానికి పన్ను చెల్లించుకుండా కాలం గడిపేసిన స్టార్ హీరో ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించాడు. దిగువ కోర్టు తనకు విదించిన అపరాద రుసుం రద్దు చెయ్యాలని, తన పిటిషన్ విచారణకు స్వీకరించాలని టాప్ హీరో హైకోర్టును ఆశ్రయించారు. కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో ఇప్పటికే అనేక కేసులు పెండింగ్ లో ఉన్న సమయంలో లగ్జరీ కారు విషయంలో హీరో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీఎం కరోనా రిలీఫ్ ఫండ్ కు అపరాద రుసుం చెల్లించాలని కోర్టు సూచిస్తే ఆ హీరో ఇప్పుడు మళ్లీ హైకోర్టును ఆశ్రయించడంతో విమర్శలు మొదలైనాయి. ఒక్కసినిమాలో నటిస్తే కోట్ల రూపాయలు పారితోషకం తీసుకుంటున్న ఈ హీరో సీఎం కరోనా రిలీఫ్ ఫండ్ కు లక్ష చెల్లించుకుండా హైకోర్టును ఆశ్రయించడంతో ఆయన అభిమానులు షాక్ అయ్యారు.

యూకే నుంచి లగ్జరీ కారు తెచ్చుకున్న టాప్ హీరో

యూకే నుంచి లగ్జరీ కారు తెచ్చుకున్న టాప్ హీరో

తమిళ సినీరంగంలోని టాప్ హీరోల మొదటి జాబితాలో ఉన్న విజయ్ అలియాస్ దళపతి విజయ్ 2012లో యూకే నుంచి రోల్స్ రాయిస్ కోస్ట్ లగ్జరీ కారును దిగుమతి చేసుకున్నాడు. కోట్ల రూపాయలు కుమ్మరించి లగ్జరీ కారు తెప్పించుకున్న హీరో విజయ్ ఆ కారులో హ్యాపీగా ఇంతకాలం షికార్లు చేస్తున్నారు.

ఆయన డబ్బు..... ఆయన ఇష్టం..... కాని ?

ఆయన డబ్బు..... ఆయన ఇష్టం..... కాని ?

హీరో విజయ్ ఆయన డబ్బుతో ఎంత ఖరీదైన కారు అయినా తెచ్చుకుని తిరగడం ఆయన ఇష్టం. అయితే హీరోగారు ఇక్కడ ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించుకుండా ఆ కారును ఉపయోగించడంతో అసలు కథ మొదలైయ్యింది. రోల్స్ రాయిస్ కోస్ట్ లగ్జరీ కారు తెచ్చుకున్న హీరో విజయ్ ప్రభుత్వాన్ని ట్యాక్స్ కట్టలేదని రవాణా శాఖ అధికారులు కోర్టును ఆశ్రయించారు.

హీరోలు ఫ్యాన్స్ కు ఆదర్శంగా నిలవాలి

హీరోలు ఫ్యాన్స్ కు ఆదర్శంగా నిలవాలి


తాను దిగుమతి చేసుకున్న కారును ట్యాక్స్ రద్దు చెయ్యాలని హీరో విజయ్ కోర్టును ఆశ్రయించారు. కేసు వివరాలు తెలుసుకున్న మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి ఎస్ఎమ్. సుబ్రమణ్యం ఇటీవల హీరో విజయ్ కి హితభోద చేశారు. హీరోలు వారి అభిమానులకు ఆదర్శంగా నిలవాలని, సమాజసేవ చెయ్యడానికి ప్రయత్నించాలని, అలాంటిది విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న కారుకు ప్రభుత్వానికి పన్ను చెల్లించకుండా మోసం చెయ్యకూడదని, ఇది ప్రజల్లో తప్పుడు సంకేతం ఇచ్చినట్లు అవుతందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

సీఎం కరోనా రిలీఫ్ ఫండ్ కు రూ. లక్ష ఇవ్వండి

సీఎం కరోనా రిలీఫ్ ఫండ్ కు రూ. లక్ష ఇవ్వండి

లగ్జరీ కారు తెప్పించుకుని ప్రభుత్వానికి పన్ను చెల్లించుకుండా కాలం గడిపిన హీరో విజయ్ కి లక్ష రూపాయలు జరిమానా విధించారు. రెండు వారాల్లో తమిళనాడు సీఎం కరోనా రిలీఫ్ ఫండ్ కు లక్ష రూపాయల అపరాద రుసుం చెల్లించాలని న్యాయమూర్తి ఎస్ఎం. సుబ్రమణ్యం ఆదేశాలు జారీ చేశారు.

హీరోకు ఒక్కరోజు ఖర్చు....... అంతే కదా ?

హీరోకు ఒక్కరోజు ఖర్చు....... అంతే కదా ?

హీరో విజయ్ ఒక్కరోజు స్టార్ హోటల్ కు వెళ్లలేదు అనుకుంటే లక్ష రూపాయలు సీఎం కరోనా రిలీఫ్ ఫండ్ కు ఇచ్చేయచ్చు. అయితే ఈ స్టార్ హీరో విజయ్ ఇప్పుడు మళ్లీ మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. తనకు విధించిన లక్ష రూపాయల అపరాద రుసుం రద్దు చెయ్యాలని, తనకు వ్యతిరేకంగా న్యాయమూర్తి ఇచ్చిన తీర్పును నిలిపివేయాలని మనవి చేస్తూ ఇప్పుడు మద్రాసు హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించారు.

కరోనా టైమ్ లో అవసరమా ?

కరోనా టైమ్ లో అవసరమా ?

న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు లిఖితపూర్వక కాఫీ రాకముందే ఆ తీర్పు కాఫీని ఆన్ లైన్ లో తీసుకుని తన పిటిషన్ విచారణకు స్వీకరించాలని హీరో విజయ్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో ఇప్పటికే అనేక కేసులు పెండింగ్ లో ఉన్న సమయంలో లగ్జరీ కారు విషయంలో హీరో విజయ్ సీఎం కరోనా రిలీఫ్ ఫండ్ కు అపరాద రుసుం చెల్లించాలని కోర్టు సూచిస్తే ఆ హీరో ఇప్పుడు మళ్లీ హైకోర్టును ఆశ్రయించడంతో విమర్శలు మొదలైనాయి.

ఓకే విచారణ చేస్తాం

ఓకే విచారణ చేస్తాం

హీరో విజయ్ పిటిషన్ పరిశీలించిన మద్రాసు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ దురైస్వామి, జస్టిస్ హేమలతా నేతృత్వంలోని డివిజన్ బెంచ్ పిటిషన్ ను విచారణ చెయ్యడానికి అంగీకరించింది. హీరో విజయ్ పిటిషన్ కు ఇటీవల న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు కాఫీ జతచెయ్యాలని హైకోర్టు రిజిస్టార్ ను న్యాయమూర్తులు ఆదేశించారు. హీరో విజయ్ పిటిషన్ ఒకటి రెండు రోజుల్లో విచారణకు వచ్చే అవకాశం ఉందని న్యాయనిపుణులు అంటున్నారు. మొత్తం మీద సీఎం కరోనా రిలీఫ్ ఫండ్ కు రూ. లక్ష ఇవ్వకుండా హీరో విజయ్ మళ్లీ కోర్టును ఆశ్రయించడంతో ఆయన అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+