ఫ్రెండ్ భార్యతో అక్రమ సంబంధం 50%,ఇసుక మాఫియా 50%: ఫ్యాక్షన్ సినిమా స్కెచ్, వెంటాడి, వేటాడి లేపేశారు!
చెన్నై/ తంజావూరు/ తిరువళ్లూరు: స్నేహితుడితో కలిసి బైక్ లో వెలుతున్న సమయంలో దారుణ హత్యకు గురైన యువకుడి హత్య కేసు అనేక మలుపులు తిరిగింది. అక్రమ సంబంధం కారణంతో హత్యకు గురైనాడని మొదట బావించిన పోలీసులు షాక్ కు గురైనారు. అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ భర్తను సీన్ లోకి రప్పించి ఇసుక మాఫియా ముఠా ఆ యువకుడిని అరడజను మంది ఫ్యాక్షన్ సినిమాలో లాగా వెంటాడి వేటాడి హత్య చేశారని వెలుగు చూడటంతో యువకుడి స్నేహితులు హడలిపోయారు. ఇసుక మాఫియా, అక్రమ సంబంధం కారణంగానే యువకుడు హత్యకు గురైనాడని, అతని స్నేహితుడు మృత్యువుతో పోరాడుతున్నాడని పోలీసులు తెలిపారు.
Horror murder: బెడ్ రూమ్ లో సెక్స్ పాఠాలు చెప్పాలని భర్త టార్చర్, మర్మాంగం కొరికేసిన భార్య!

చిన్న వయసులో రాజా వ్యాపారం
తమిళనాడులోని తంజావూరు జిల్లా అమ్మపేట్టై సమీపంలోని చెర్మనల్లూరులోని నేతాజీ కాలనీలో రాజా అలియాస్ షణ్మగరాజా (28) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. రాజా చాలా కాలం నుంచి ఇసుక వ్యాపారం చేస్తున్నాడు. తమిళనాడులో ముఖ్యంగా తంజావూరులో ఇసుకకు డిమాండ్ ఎక్కువగా ఉంది. రాజా చాల చిన్న వయసు నుంచి ఇసుక వ్యాపారం చేస్తూనే ఉన్నాడు.

ఫ్యాక్షన్ సినిమా స్కెచ్
గురువారం సాయంత్రం రాజా, అతని స్నేహితుడు సతీష్ బైక్ లో పని ముగించుకుని ఇంటికి బయలుదేరారు. ఆ సమమంలో చిత్తమల్లి ప్రాంతాంలో నాలుగు బైక్ ల్లో వెంబడించిన 8 మంది రాజా వెలుతున్న బైక్ ను ఢీకొన్నారు. ఆ సందర్బంలో రాజా, సతీష్ ఇద్దరూ బైక్ లో నుంచి కిందకుపడిపోయారు. తరువాత ప్రత్యర్థుల చేతుల్లో వేటకొడవళ్లు, కత్తులు ఉన్న విషయం గుర్తించిన సతీష్, రాజా అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించారు.

వెంటాడి వేటాడి నరికి చంపేశారు
ఆ సమయంలో ఆరు మంది రాజాను వెంబడించి హైవే రహదారి పక్కన ఉన్న పొంటపోలాల్లో అతన్ని వెంబడించి ఫ్యాక్షన్ సినిమాలో లాగా వెంటాడి వేటాడి అతి దారుణంగా వేటకొడవళ్లతో నరికి అక్కడిక్కడే చంపేశారు. కొడవళ్లతో నరకడంతో సతీష్ కు తీవ్రగాయాలైనాయి. సతీష్ ను ఆసుపత్రికి తరలించారు. సినిమా స్టైల్లో రాజాను ఎవరు వెంటాడి చంపేశారు అంటూ నీదమంగళం పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేశారు.

ప్రియురాలు కోసం వెళ్లేవాడు
వ్యాపారం చేస్తూ డబ్బులు బాగా సంపాదిస్తున్న రాజా పదకాచెరి ప్రాంతంలోని సమంతాంగుడిలోని సురక్కుడి వీధిలో నివాసం ఉంటున్న ప్రకాష్ అలియాస్ అరుణ్ పాండియన్ (30)తో ఎక్కువ స్నేహంగా ఉండేవాడని పోలీసులు గుర్తించారు. గత రెండేళ్ల నుంచి రాజా తన స్నేహితుడు ప్రకాష్ అలియాస్ అరుణ్ పాండియన్ భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ప్రకాష్ కుటుంబానికి అవసరానికి డబ్బులు ఇస్తున్న రాజా స్నేహితుడి భార్యతో ఇంతకాలం ఎంజాయ్ చేస్తున్నాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

ఇసుక మాఫియా ఎంట్రీతో ట్విస్ట్
రాజాతో పాటు మరి కొంత మంది రెండు గ్యాంగులుగా విడిపోయి ఇసుక అక్రమంగా రావాణా చేస్తూ ఎవరికి వాళ్లు అధికారులకు తెలీకుండా డబ్బులు సంపాధించుకుంటున్నారు. రాజా అక్రమంగా ఇసుక రవాణా చేసి డబ్బులు బాగా సంపాధిస్తున్నాడని మరో గ్యాంగ్ పగ పెంచుకుంది. ఇదే విషయంలో ఇరు వర్గాలు చాలాసార్లు గొడవలు పడ్డారు. ఇసుక మాఫియా విషయంలో ప్రత్యర్థి వర్గంపై ఓ సారి రాజా వర్గీయలు దాడులు చెయ్యడంతో రాజా మీద ఇప్పటికే కేసులు నమోదు అయ్యాయి. రాజా మీద నమోదైన కేసులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయని పోలీసులు అంటున్నారు.

50% అక్రమ సంబంధం, 50% ఇసుకమాఫియా = ఫినిష్
రాజాను హత్య చెయ్యడానికి అతను అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ భర్తను ఇసుక మాఫఇయాలోని మరో వర్గం ముందుపెట్టారు. తరువాత ఇసుక మాఫియా విషయంలో పదేపదే అడ్డుపడుతున్న రాజాను హత్య చెయ్యడానికి మరో స్కెచ్ వేశారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. రాజా హత్యకు ఈ రెండు కారణాలు ప్రధాన కారణం అయ్యాయని పోలీసులు అన్నారు. రాజా హత్య కేసులో ఆరు మందిని ఇప్పటికే అరెస్టు చేసిన పోలీసులు వారిని విచారణ చేస్తున్నారు.