Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Illegal affair: యోగా టీచర్, లాయర్ సీక్రెట్ లవ్ స్టోరి, చంపేసి బాత్ రూమ్ లో పూడ్చేశాడు!

చెన్నై/ మదురై: భార్యను వదిలేసిన క్రిమినల్ లాయర్ కుమార్తెతో కలిసి వేరుగా ఉంటున్నాడు. భర్తను వదిలేసిన యోగా టీచర్ ఒంటరిగా ఉంటోంది. కుమార్తెను యోగా క్లాస్ లో చేర్పించిన లాయర్ ఆమెను వదిలి పెట్టడానికి, తరువాత పిలుచుకుని రావడానికి యోగా టీచర్ దగ్గరకు వెళ్లి వస్తున్నాడు. ఇదే సందర్బంలో ఓ వర్షం కురిసిన రాత్రి యోగా, టీచర్, లాయర్ అక్రమ సంబంధం పెట్టుకున్నారు. చాలా కాలం పాటు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వచ్చారు. యోగా టీచర్ విషయంలో క్రిమినల్ లాయర్ కు అనుమానం పెరిగిపోయింది.

అంతే ఇంటికి పిలిపించి యోగా టీచర్ తో రెండు రోజుల పాటు ఎంజాయ్ చేసిన లాయర్ ఆమెను చంపేసి అతని ఇంట్లోని బాత్ రూమ్ లో పూడ్చేశాడు. యోగా టీచర్ మిస్సింగ్ కేసు విచారణ జరుగుతున్న సమయంలో నెల రోజుల తరువాత క్రిమినల్ లాయర్ జరిగిన స్టోరీ మొత్తం 10 పేజీల డెత్ నోట్ రాసిపెట్టి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

జెండా ఎత్తేసిన క్రిమినల్ లాయర్ భార్య

జెండా ఎత్తేసిన క్రిమినల్ లాయర్ భార్య

తమిళనాడులోని మదురై జిల్లా తిరుమంగళంలోని కార్పాగనగర్ సమీపంలోని అర్ముగం కాలనీలో హరిక్రిష్ణన్ (45) విజయ అలియాస్ విజి (35) దంపతులు నివాసం ఉంటున్నారు. హరిక్రిష్ణన్, విజి దంపతులకు 10 ఏళ్ల కుమార్తె ఉంది. కుటుంబ సమస్యల కారణంగా క్రిమినల్ లాయర్ భర్త హరిక్రిష్ణన్ తో విసిగిపోయిన అతని భార్య విజయ జెండా ఎత్తేసి పుట్టింటికి వెళ్లిపోయింది.

యోగా టీచర్ చిత్ర స్టోరి

యోగా టీచర్ చిత్ర స్టోరి

పసుంపనన్ వీధిలో చిత్రాదేవి (32), జనకరాజ్ (41) దంపతలు నివాసం ఉంటున్నారు. యోగా టీచర్ చిత్రాదేవి ప్రవర్తనతో విసిగిపోయిన జనకరాజ్ భార్యకు విడాకులు ఇచ్చేసి వేరుగా నివాసం ఉంటున్నాడు. యోగా టీచర్ చిత్రాదేవి ఆమె తండ్రి కన్నయ్య ఇంటికి వెళ్లిపోయి అక్కడే నివాసం ఉంటూ యోగా క్లాసులు చెబుతూ జీవనం సాగిస్తోంది.

కూతురి కోసం యోగా క్లాస్ లు

కూతురి కోసం యోగా క్లాస్ లు

భార్య విజయాతో విడిపోయిన తరువాత క్రిమినల్ లాయర్ గా కేసులు వాధిస్తున్న హరిక్రిష్ణన్ కుమార్తెతో కలిసి వేరుగా ఉంటున్నాడు. భార్య విజయను వదిలేసిన తరువాత హరిక్రిష్ణన్ రెండో పెళ్లి చేసుకోలేదు. లాయర్ హరిక్రిఫ్ణన్ అతని కుమార్తెను చిత్రాదేవి దగ్గరకు యోగా క్లాసులకు పంపిస్తున్నాడు.

ఓ వర్షం కురిసిన రాత్రి?

ఓ వర్షం కురిసిన రాత్రి?

కుమార్తెను యోగా క్లాస్ దగ్గర వదిలిపెట్టడానికి, క్లాస్ పూర్తి అయిన తరువాత ఆమెను ఇంటికి పిలుచుకుని వెళ్లడానికి హరిక్రిష్ణన్ చిత్రాదేవి నిర్వహిస్తున్న యోగా శిక్షణా కేంద్రం దగ్గరకు వెళ్లి వస్తున్నాడు. యోగా టీచర్ చిత్రాదేవితో పరిచయం పెంచుకున్న క్రిమినల్ లాయర్ హరిక్రిష్ణన్ చిన్నగా ఆమె స్టోరీ మొత్తం తెలుసుకున్నాడు. ఓ వర్షం కురిసిన రాత్రి యోగా టీచర్ చిత్రాదేవి, క్రిమినల్ లాయర్ హరిక్రిష్ణన్ మస్త్ మజా చేశారు.

అక్రమ సంబంధం..... అంతే అనుమానం

అక్రమ సంబంధం..... అంతే అనుమానం

యోగా టీచర్ చిత్రాదేవితో అక్రమ సంబంధం పెట్టుకున్న హరిక్రిష్ణన్ ఆమెను ఇంటికి పిలిపించుకుని ఆమెతో విచ్చలవిడిగా ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టాడు. భర్త లేకపోవడంతో చిత్రాదేవిని సైతం అడిగే దిక్కులేకపోవడంతో క్రిమినల్ లాయర్ హరిక్రిష్ణన్ కు మరి మంచిది అయ్యింది. అయితే రానురాను యోగా టీచర్ చిత్రాదేవి ప్రవర్తన మీద క్రిమినల్ లాయర్ హరిక్రిష్ణన్ కు అనుమానం పెరిగిపోయిందని తెలిసింది.

స్కూటర్ లో వెళ్లి మాయం అయిన చిత్రా

స్కూటర్ లో వెళ్లి మాయం అయిన చిత్రా

గత ఏప్రిల్ నెల 2వ తేదీన తాను యోగా క్లాస్ లు చెప్పడానికి వెలుతున్నానని తండ్రి కన్నయ్య కు చెప్పిన చిత్రాదేవి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఆ రోజు, మరుసటి రోజు చిత్రాదేవి ఇంటికి రాకపోవడంతో ఆమె తండ్రి కన్నయ్య ఏప్రిల్ 5వ తేదీన తిరుమంగళం పోలీసులకు ఫిర్యాదు చేశారు. యోగా టీచర్ మిస్సింగ్ కేసు నమోదు చెయ్యడంలో పోలీసులు నిర్లక్షం చేశారని ఆరోపణలు ఉన్నాయి. చివరి సారి యోగా టీచర్ చిత్రాదేవి లాయర్ హరిక్రిష్ణన్, ఆమె కుమార్తెతో ఫోన్ లో మాట్లాడిందని కన్నయ్య న్యాయవాది తిరుమంగళం పోలీసులకు చెప్పాడు.

సీఎం వరకు వెళ్లింది

సీఎం వరకు వెళ్లింది

తిరుమంగళం పోలీసులు తన కూతురు చిత్రాదేవి మిస్సింగ్ కేసును నిర్లక్షం చేస్తున్నారని, ఆమెను లాయర్ హరిక్రిష్ణన్ చంపేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తూ ఆమె తండ్రి కన్నయ్య తమిళనాడు అప్పటి ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, తిరుమంగళం డిప్యూటీ పోలీసు కమీషనర్ వినోధిని, పలువురు పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు. కథ పెద్దపెద్ద వాళ్ల దగ్గరకు వెళ్లడంతో తిరుమంగళం పోలీసులు రంగంలోకి దిగారు. క్రిమినల్ లాయర్ హరిక్రిష్ణన్ ను విచారణ చెయ్యడానికి పోలీసులు సిద్దం అయ్యారు.

ఉరి వేసుకున్న లాయర్

ఉరి వేసుకున్న లాయర్

యోగా టీచర్ చిత్రాదేవి కేసు విచారణ ముమ్మరం అయిన సందర్బంలో క్రిమినల్ లాయర్ హరిక్రిష్ణన్ హడలిపోయాడు. మంగళవారం లాయర్ హరిక్రిష్ణన్ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. హరిక్రిష్ణన్ ఆత్మహత్య చేసుకున్న విషయం గుర్తించిన అతని కుమార్తె పక్కింటి వాళ్లకు చెప్పడం, వాళ్లు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగు చూసింది.

Recommended Video

    #HBDSouthQueenTRISHA : Trisha Krishnan Interesting Facts | Trisha Biography || Oneindia Telugu
    శవం బాత్ రూమ్ లో ఉంది. తవ్వి తీసుకోండి

    శవం బాత్ రూమ్ లో ఉంది. తవ్వి తీసుకోండి

    పోలీసులు లాయర్ హరిక్రిష్ణన్ ఇంటిలో పరిశీలించగా అతను స్వయంగా అతని చేతితో రాసిన 10 పేజీల డెత్ నోట్ చిక్కింది. తనకు, చిత్రాదేవికి అక్రమ సంబంధం ఉందని, గొడవలు జరిగిన సమయంలో ఆమెను చంపేసి తన బాత్ రూమ్ లో పూడ్చిపెట్టేశానని, ఆ శవాన్ని మీరు బయటకు తీసుకోవచ్చని, తన ఆత్మహత్యకు ఎవ్వరూ కారణం కాదని డెత్ నోట్ లో ఉందని పోలీసులు అన్నారు.

    చిత్రాదేవిని హత్య చేసిన ఆమె ప్రియుడు హరిక్రిష్ణన్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. పోలీసులు సరైన సమయంలో హరిక్రిష్ణన్ ను అదుపులోకి తీసుకుని ఉంటే తన కుమార్తె చిత్రాదేవి ప్రాణాలు పోయేవి కాదని ఆరోపిస్తూ ఆమె తండ్రి కన్నయ్య ఆరోపిస్తున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+