Ladys: పెళ్లి చెయ్యలేదని కోపం, వీధిలో ఆడది కనపడితే చాలు మనోడికి పండగే, ఉదయం చూస్తే?!
చెన్నై/ కడలూరు: ఇంట్లో పెళ్లి చెయ్యలేదని, తనకు వయసు అయిపోతా ఉందని కోపంతో కొడుకు రోజూ గొడవపడేవాడు. ఎంత మొత్తుకున్నా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడటం లేదని, తన పెళ్లి జరగదని కొడుకు ఆవేశంతో ఊగిపోయాడు. అంతే ఇంటి ముందు నిలబడుతున్న కేటుగాడు వీధిలో ఆడది కనపడితే చాలు రయ్ అని వెళ్లిపోయి వాళ్లను పట్టుకుని ఎక్కడంటే అక్కడ చేతులు వేసి చిత్రహింసలకు గురి చేస్తూ పండగ చేసుకున్నాడు.
మనోడు ఉంటున్న ఇంటి వైపు వెళ్లాలంటే స్థానికంగా నివాసం ఉంటున్న మహిళలు, అమ్మాయిలు హడలిపోతున్నారంటే వాడి దెబ్బ ఎలాగుందో అర్థం చేసుకోవచ్చు. కొడుకు చేష్టలతో విసిగిపోయిన తల్లి అతన్ని ఇంట్లోకి లాక్కెళ్లింది. ఉదయం స్థానికులు చూస్తే అతని శవం బయటకు వచ్చింది. అసలు ఏం జరిగింది ? అని స్థానికులు ఆరా తీస్తే స్టోరీ మొత్తం బయటకు వచ్చింది.

ఇద్దరు కొడుకులు
తమిళనాడులోని కడలూరు జిల్లా శ్రీముష్నం వనకర వీధిలో కుప్పైయమ్మ (65) అనే మహిళ నివాసం ఉంటున్నారు. కుప్పైయమ్మకు భాస్కరన్ (36), ప్రభాకరన్ (33) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. భాస్కరన్ కు ఇంకా వివాహం కాలేదు. అన్న భాస్కరన్ కు పెళ్లి కాకపోయినా తమ్ముడు ప్రభాకరన్ మాత్రం పెళ్లి చేసుకుని భార్యతో కాపురం చేస్తున్నాడు.

నాకేందుకు పెళ్లి చెయ్యలేదు?
తనకు 36 ఏళ్ల వయసు వచ్చింది. ఇప్పటికే పెళ్లి వయసు దాటిపోయింది, నాకు ఇంకా ఎందుకు పెళ్లి చెయ్యలేదని భాస్కరన్ నిత్యం అతని తల్లితో గొడవపడేవాడు. నువ్వు పనిపాటా లేకుండా తిరుగుతున్నావు, నీకు ఎవరు అమ్మాయిని ఇచ్చి పెళ్లి చెయ్యడానికి ముందుకురావడం లేదని తల్లి భాస్కరన్ కు చెబుతూ వస్తోంది.

ఇక లాభం లేదని ఏం చేశాడంటే
పెళ్లి విషయంలో నిత్యం తల్లితో పాటు సోదరుడు ప్రభాకరన్ తో భాస్కరన్ గొడవపడేవాడు. రోజు సాయంత్రం, రాత్రిపూట ఇంట్లో ఇదే పంచాయితీ జరిగేది. ఇక మాటలతో చెబితో తన తల్లి మాట వినదని, ఇలాగే కుర్చుంటే నాకు పెళ్లి కాదని భాస్కరన్ డిసైడ్ అయ్యాడు. అంతే రోజు పీకలదాక మద్యం సేవించి ఇంటి ముందు ఓ కుర్చీ వేసుకుని కుర్చుంటున్నాడు.

ఆడది కనపడితే చాలు పిసికేస్తాడు
ఇంటి ముందు కుర్చీ వేసుకుని కుర్చుకుంటున్న భాస్కరన్ అటు వైపు ఎవరైనా ఆడవాళ్లు, చీరకట్టుకున్న వివాహిత మహిళలు వెలితే చాలు కుర్చీలోని రయ్ అంటూ పైకి లేస్తున్న భాస్కరన్ నేరుగా వారి దగ్గరకు వెళ్లి వాళ్లను పట్టుకుని ఎక్కడపడితే అక్కడ చేతులు వేసి నలిపేస్తూ వాళ్లను కొరికేయడం మొదలుపెట్టాడు.

హడలిపోయిన మహిళలు
రోజురోజుకు భాస్కరన్ లైంగిక వేధింపులు ఎక్కువ కావడంతో ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న మహిళలు, అమ్మాయిలు వాళ్ల ఇంటి వైపు వెళ్లాలంటే హడలిపోయారు. కొడుకు భాస్కరన్ చేష్టలతో విసిగిపోయిన తల్లి అతనికి రోజూ చివాట్లు పెడుతూ వచ్చింది. తల్లితో పాటు స్థానికంగా నివాసం ఉంటున్న మహిళల భర్తలు, వారి కుటుంబ సభ్యులు భాస్కరన్ కు శాపనార్తాలు పెట్టినా అతను ఏమాత్రం పట్టించుకోకుండా ఆడది కనపడితే చాలు వాళ్లను పట్టుకుని ఎక్కడంటే అక్కడ ముద్దలు పెడుతూ వాళ్లను నలిపేస్తూ రచ్చరచ్చ చేశాడు.

సింపుల్ గా ఫినిష్
రాత్రి భాస్కరన్ అటు వైపు నైటీ వేసుకుని వెలుతున్న మహిళను పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించి ఆమె నైటీని లాగేయడానికి ప్రయత్నించాడు. మనోడి చేష్టలు మొత్తం వీధిలో వేరే ఇంటికి ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఆ సందర్బంలో గొడవ పెద్దది కావడంతో తల్లి, సోదరుడు ప్రభాకరన్ వీధిలోకి వచ్చి భాస్కరన్ కు దేహశుద్ది చేసి ఇంట్లోకి లాక్కెళ్లి లోపల తాళం వేశారు. ఉదయం స్థానికులు నిద్రలేచి చూస్తే భాస్కరన్ శవం ఇంటి నుంచి బయటకు వచ్చింది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేశారు.

ఇంట్లో ఏం జరిగిందంటే?
భాస్కరన్ తల మీద బలమైన కర్రతో దాడి చెయ్యడం వలనే అతని ప్రాణాలు పోయాయని పోస్టుమార్టుం నివేదికలో వెలుగు చూసింది. భాస్కరన్ ఎలా చనిపోయాడు అనే విషయంలో అతని తల్లి, సోదరుడు పొంతనలేని వివరాలు చెప్పడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. పోలీసులు ప్రభాకరన్, అతని తల్లిని అదుపులోకి తీసుకుని విచారణ చెయ్యగా భాస్కరన్ చేష్టలతో మా పరుపుపోతోందని, అందుకే ఇంట్లో అతన్ని తామే హత్య చేశామని తల్లి, కొడుకు ప్రభాకరన్ అంగీకరించారని పోలీసులు తెలిపారు.
-
గరుడ పురాణం ప్రకారం "భార్య" ఎన్ని రకాలు ఉంటారో తెలుసా..? -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!!












Click it and Unblock the Notifications