చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Lady leader: లేడీ లీడర్ దర్బార్, గాజుల షాపును గుజరీ షాపు చేసింది, ప్రతిపక్షంలో రూ. 50 వేలు డిమాండ్!

|
Google Oneindia TeluguNews

చెన్నై/కాంచీపురం: గతంలో అధికారంలో ఉన్న సొంత పార్టీ నాయకుల అండతో ఓ లేడీలీడర్ రెచ్చిపోయింది. ఆమెకు మద్దతుగా ఉన్న వారికి వేలంపాటలో ప్రభుత్వ షాపులు తీసివ్వడం, వ్యతిరేకంగా ఉన్న వారి వ్యాపారాలు దెబ్బ తియ్యడం చేసిందని ఆరోపణలు ఉన్నాయి. తన మద్దతుదారులకు ప్రభుత్వ కాంట్రాక్టులు ఇప్పించింది. మద్దతుదారుల విషయంలో ముందు నిలబడి సొంత పార్టీ నాయకులకు నచ్చచెప్పి ఆమె మద్దతు దారులకు అన్ని పనులు చేసిపెట్టిందని సమాచారం.

అధికారం దూరం అయ్యి గతంలో ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఇప్పుడు అధికారంలో ఉన్నా ఆ లేడీ లీడర్ దర్బారుకు ఏమాత్రం కొదవలేదని మరోసారి రుజువు అయ్యింది. గుడికి చెందిన షాపు రూమ్ ల్లో బ్యాంగిల్స్ వ్యాపారం చేస్తున్న మహిళను తనకు నెలకు ఇంత, సంవత్సరానికి రూ. 50,000 వేలు డబ్బులు ఇవ్వాలని ఆ లేడీ లీడర్ డిమాండ్ చేసిందని తెలిసింది. నేను నెలనెల మామూళ్లు ఇవ్వనని షాపు యజమాని ఎదురుతిరగడంతో లేడీ లీడర్ కు మండిపోయింది. షాపు యజమాని కూడా మహిళ కావడంతో ఆమె మీద లేడీ లీడర్ ప్రతాపం చూపింది.

లేడీ లీడర్ దాడి చెయ్యడంతో షాపు యజమానురాలు కుయ్యోమర్రో అంటూ ఆమె కాళ్లు పట్టుకుంది. అయినా శాంతించని లేడీ లీడర్ నీ అంతు చూస్తా అంటూ షాపులో నానా హంగామా చేసి గాజుల షాపును గుజరి షాపులా తాయారు చేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. లేడీ లీడర్ హంగామా మొత్తం పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీల్లో రికార్డు కావడం, ఆ క్లిప్పింగ్స్ బయటకు రావడంతో వైరల్ అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి రౌడీ లేడీ లీడర్ మీద కేసు నమోదు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

Illegal affair: ప్రియుడి కోసం కిలాడీ తల్లి బిడ్డలను ఏం చేసిందంటే ?, భర్తకు ఫోన్ చేసి డ్రామాలు, చరణ్!Illegal affair: ప్రియుడి కోసం కిలాడీ తల్లి బిడ్డలను ఏం చేసిందంటే ?, భర్తకు ఫోన్ చేసి డ్రామాలు, చరణ్!

అన్నాడీఎంకే పార్టీ లీడర్

అన్నాడీఎంకే పార్టీ లీడర్

తమిళనాడులోని కాంచీపురంలో అన్నాడీఎంకే పార్టీకి చెందిన లేడీ లీడర్ తిలకవతి నివాసం ఉంటున్నది. గత సంవత్సరం వరకు తమిళనాడులో అధికారంలో ఉన్న సొంత పార్టీ అన్నాడీఎంకే నాయకుల అండతో లేడీలీడర్ తిలకవతి కాంచీపురంలో రెచ్చిపోయింది. కాంచీపురంలో తిలకవతి ఆమెకంటూ ఓ వర్గం ఏర్పాటు చేసుకున్నారని తెలిసింది.

వేలంలో గుడి షాపు రూమ్ లు?

వేలంలో గుడి షాపు రూమ్ లు?

తిలకవతికి మద్దతుగా ఉన్న వారికి కాంచీపురం (కంచి)లోని కామాక్షి అమ్మాన్ ఆలయం షాపుల వేలం పాటలో ప్రభుత్వ షాపులు తీసివ్వడం, వ్యతిరేకంగా ఉన్న వారి వ్యాపారాలు దెబ్బ తియ్యడం చేసిందని ఆరోపణలు ఉన్నాయి. తన మద్దతుదారులకు తిలకవతి ప్రభుత్వ కాంట్రాక్టులు ఇప్పించింది. మద్దతుదారుల విషయంలో ముందు నిలబడి సొంత పార్టీ నాయకులకు నచ్చచెప్పి తిలకవతి ఆమె మద్దతు దారులకు అన్ని పనులు చేసిపెట్టిందని సమాచారం.

అధికారం దూరం అయినా లేడీ లీడర్ దర్బార్

అధికారం దూరం అయినా లేడీ లీడర్ దర్బార్

గత ఏడాదిలో తమిళనాడులో అన్నాడీఎంకే ప్రభుత్వం కుప్పకూలిపోయి డీఎంకే పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అధికారం దూరం అయ్యి గతంలో ప్రతిపక్షంలో ఉన్న డీఎంకే పార్టీ ఇప్పుడు అధికారంలో ఉన్నా కాంచీపురంలో లేడీ లీడర్ తిలకవతి దర్బారుకు ఏమాత్రం కొదవలేదని మరోసారి రుజువు అయ్యింది.

లేడీ షాపులో హంగామా.... రూ. 50 వేలు డిమాండ్

లేడీ షాపులో హంగామా.... రూ. 50 వేలు డిమాండ్

కంచిలోని కామాక్షి అమ్మాన్ గుడికి చెందిన షాపు రూమ్ ల్లో బ్యాంగిల్స్ వ్యాపారం చేస్తున్న చిత్రా అనే మహిళను తనకు నెలకు ఇంత, సంవత్సరానికి రూ. 50,000 వేలు డబ్బులు ఇవ్వాలని లేడీ లీడర్ తిలకవతి డిమాండ్ చేసిందని ఆరోపణలు ఉన్నాయి. నేను నెలనెల మామూళ్లు ఇవ్వనని షాపు యజమాని చిత్రా అన్నాడీఎంకే నాయకురాలు తిలకవతికి ఎదురుతిరగడంతో ఆ లేడీ లీడర్ కు మండిపోయింది.

గాజుల షాపును గుజరీ షాపు చేసింది

గాజుల షాపును గుజరీ షాపు చేసింది

షాపు యజమాని చిత్రా కూడా మహిళ కావడంతో ఆమె మీద లేడీ లీడర్ తిలకవతి ఆమె ప్రతాపం చూపింది. లేడీ లీడర్ తిలకవతి దాడి చెయ్యడంతో షాపు యజమానురాలు చిత్రా కుయ్యోమర్రో అంటూ ఆమె కాళ్లు పట్టుకుంది. అయినా శాంతించని లేడీ లీడర్ తిలకవతి నీ అంతు చూస్తా అంటూ చిత్రా షాపులో నానా హంగామా చేసి గాజుల షాపును గుజరి షాపులా తాయారు చేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది.

సీసీటీవీ కెమెరాల్లో మేడమ్ హంగామా

సీసీటీవీ కెమెరాల్లో మేడమ్ హంగామా

లేడీ లీడర్ తిలకవతి హంగామా మొత్తం పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీల్లో రికార్డు కావడం, ఆ క్లిప్పింగ్స్ బయటకు రావడంతో వైరల్ అయ్యాయి. విషయం తెలుసుకున్న కాంచీపురం పోలీసులు రంగంలోకి దిగి రౌడీ లేడీ లీడర్ తిలకవతి మీద కేసు నమోదు చేసి ఆమెను అరెస్టు చేసి మహిళా సెంట్రల్ జైలుకు తరలించడం హాట్ టాపిక్ అయ్యింది.

English summary
Lady leader: Police have arrested an AIADMK woman executive who allegedly demanded Rs 50,000 from a woman who was running a bangle shop business in Kanchipuram.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X