Lady police: భార్య చేతిలో లాఠీ, మొగుడి చేతిలో విజిల్, డౌట్, లేడీ పోలీసు గొంతు కోసి చంపిన భర్త !
చెన్నై: పోలీసు శాఖలో యువతి కానిస్టేబుల్ గా పని చేస్తున్నది. ఆర్ టీసీలో యువకుడు కండెక్టర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. మంచి ఉద్యోగాలు చేస్తున్న యువతి, యువకుడికి పెళ్లి చేస్తే జీవితాంతం సంతోషంగా ఉంటారని, వారికి పుట్టబోయే పిల్లలను బాగా చదివించుకున్నారని ఇద్దరి కుటుంబ సభ్యులు అనుకున్నారు. లేడీ పోలీసుతో కండెక్టర్ వివాహం జరిగింది. భార్య చేతిలో పోలీసు లాఠీ, భర్త చేతిలో రైట్ రైట్ చెప్పడానికి విజిల్ ఉంది. దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. పిల్లలతో కలిసి సంతోషంగా జీవనం సాగిస్తున్న దంపతుల మద్య సమస్యలు మొదలైనాయి. ప్రతిరోజు ఇంటికి వెలుతున్న దంపతులు వారి పిల్లల ముందే గొడవ పడుతున్నారు. రోజు ఏంది ఈ పంచాయితీ, ఇంటిని, ఈ ఊరిని మార్చేస్తే ధరిద్రం పోతుందని భర్త అనుకున్నాడు. ఊరి వదిలి వేరే ఊరికి వెళ్లిపోదామని భర్త లేడీ పోలీసుకు చెప్పాడు. ఇక అప్పటి నుంచి గొడవలు ఇంకా ఎక్కువ అయ్యాయి. చచ్చినా ఈ ఊరు, ఈ ఇల్లు వదిలి నేను రానని భార్య మొండికి వేసింది. అయితే నిజంగా చచ్చిపో అంటూ లేడీ పోలీసు గొంతు కోసేసిన ఆమె భర్త దారుణంగా హత్య చెయ్యడం కలకలం రేపింది.

ఆరు సంవత్సరాల క్రితం
తమిళనాడు పోలీసు శాఖలో ఉద్యోగం చేస్తున్న భానుప్రియా (30) అనే యువతి కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్నది. మదురైకి చెందిన విఘ్నేష్ అనే యువకుడు ఆర్ టీసీలో (టీఎన్ఎస్ టీసీ) కండెక్టర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. మంచి ఉద్యోగాలు చేస్తున్న భానుప్రియా, విఘ్నేష్ పెళ్లి చేస్తే జీవితాంతం సంతోషంగా ఉంటారని, వారికి పుట్టబోయే పిల్లలను బాగా చదివించుకున్నారని ఇద్దరి కుటుంబ సభ్యులు అనుకున్నారు. లేడీ పోలీసు భానుప్రియాతో కండెక్టర్ విఘ్నేష్ వివాహం ఆరు సంవత్సరాల క్రితం జరిగింది.

కుమార్తె, కుమారుడు
మంచి ఉద్యోగాలు చేస్తున్న భానుప్రియా, విఘ్నేష్ చక్కగా కాపురం చేసుకుంటున్నారు. విఘ్నేష్, భానుప్రియా దంపతులకు నాలుగు సంవత్సరాల వయసు ఉన్న కుమార్తె, రెండు సంవత్సరాల వయసు ఉన్న ఓ కుమారుడు ఉన్నాడు. ఇద్దరు పిల్లలతో కలిసి భానుప్రియా, విఘ్నేష్ దంపతులు సంతోషంగా ఉంటూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు.

భర్తకు ఏదో అనుమానం
భానుప్రియా విరూద్ నగర్ పశ్చిమ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నది. విఘ్నేష్, భానుప్రియా దంపతులు విరూద్ నగర్ లోని కులకురై ప్రాంతంలో అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నారు. పిల్లలతో కలిసి సంతోషంగా జీవనం సాగిస్తున్న భానుప్రియా, విఘ్నేష్ దంపతుల మద్య కొంతకాలం క్రితం సమస్యలు మొదలైనాయి. భార్య భానుప్రియా తీరుతో ఆమె భర్త విఘ్నేష్ కు అనుమానం మొదలైయ్యిందని సమాచారం.

మదురైకి వెళ్లిపోవాలని మొగుడు..... కుదరదని చెప్పిన భార్య
ప్రతిరోజు ఇంటికి వెలుతున్న భానుప్రియా, విఘ్నేష్ దంపతులు వారి పిల్లల ముందే గొడవ పడుతున్నారు. రోజు ఏంది ఈ పంచాయితీ, విరూద్ నగర్ లోని ఇంటిని, ఈ ఊరిని మార్చేస్తే ధరిద్రం పోతుందని భర్త విఘ్నేష్ అనుకున్నాడు. విరూద్ నగర్ ఊరిని వదిలి మదురైకి వెళ్లిపోదామని భర్త లేడీ పోలీసు భానుప్రియాకు చెప్పాడు. ఇక్క అప్పటి నుంచి గొడవలు ఇంకా ఎక్కువ అయ్యాయి. అయితే విరూద్ నగర్ ను మాత్రం వదిలి నేను ఎక్కడికి రానని భానుప్రియా ఆమె భర్త విఘ్నేష్ కు తేల్చి చెప్పింది.

చచ్చినా రాను అని చెప్పిన భార్య...... నిజంగానే చంపేసిన భర్త
చచ్చినా నేను విరూద్ నగర్ ఊరును, ఈ ఇల్లు వదిలి నేను రానని భార్య భానుప్రియా మొండికి వేసింది. రాత్రి ఇదే విషయంలో పెద్దగా గొడవ జరిగింది. సహనం కోల్పోయిన విఘ్నేష్ సహనం కోల్పోయాడు. అయితే నువ్వు నిజంగానే చచ్చిపో అంటూ లేడీ పోలీసు భానుప్రియా గొంతుకోసేసిన విఘ్నేష్ అతని భార్యను దారుణంగా హత్య చెయ్యడం కలకలం రేపింది. ఊరును, ఇంటిని మార్చే విషయంలో జరిగిన గొడవలో లేడీ పోలీసు భార్య భానుప్రియా దారుణ హత్యకు గురి కావడం విరూద్ నగర్ తో పాటు తమిళనాడులో కలకలం రేపింది.












Click it and Unblock the Notifications