చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హీరో విజయ్‌కి మద్రాస్ హైకోర్టు షాక్... రూ.1లక్ష జరిమానా... రీల్ హీరోలా ఉండొద్దంటూ...

|
Google Oneindia TeluguNews

తమిళ టాప్ హీరో ఇళయ దళపతి విజయ్‌కి మద్రాస్ హైకోర్టు షాకిచ్చింది. ఆయనకు రూ.1లక్ష జరిమానా విధించింది. 2012లో ఇంగ్లాండ్ నుంచి దిగుమతి చేసుకున్న రోల్స్ రాయ్స్ ఘోస్ట్ లగ్జరీ కారుకు విజయ్ పన్ను కట్టకపోవడంతో ఈ జరిమానా విధించింది. ట్యాక్స్ నుంచి మినహాయింపునివ్వాలని కోరుతూ విజయ్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టిపారేసింది. జరిమానా సొమ్మును కోవిడ్‌పై పోరు కోసం తమిళనాడు సీఎం పబ్లిక్ రిలీఫ్ ఫండ్‌లో జమ చేయనున్నట్లు న్యాయమూర్తి వెల్లడించారు.

కోర్టు ఏం చెప్పిందంటే...

కోర్టు ఏం చెప్పిందంటే...

విజయ్ 2012లోనే మద్రాస్ హైకోర్టులో పన్ను మినహాయింపు కోసం పిటిషన్ దాఖలు చేశాడు. ఎంట్రీ ట్యాక్స్ నుంచి మినహాయింపునివ్వాలని కోరాడు. తాజాగా దీనిపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి సుబ్రహ్మణ్యం ఆ పిటిషన్‌ను కొట్టిపారేయడంతో పాటు రూ.1లక్షల జరిమానా విధించారు. ఇలాంటి పిటిషన్లను ప్రోత్సహించేది లేదని స్పష్టం చేశారు. అంతేకాదు,దేశ ఆర్థిక వ్యవస్థకు పన్నులే వెన్నెముక అని... పన్ను చెల్లించడమనేది స్వచ్చంద విరాళం లాంటిది కాదని వ్యాఖ్యానించారు.

రీల్ హీరోలా ఉండొద్దు...

రీల్ హీరోలా ఉండొద్దు...


న్యాయమూర్తి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. 'ఆ హీరోకు భారీ ఎత్తున అభిమాన సంఘాలు ఉన్నాయి. ఆ అభిమానులంతా తమ హీరోను నిజమైన హీరో అని భావిస్తారు. తమిళనాడు లాంటి రాష్ట్రంలో అటువంటి నటులు రాష్ట్రాన్ని కూడా పాలించారు.కాబట్టి హీరోలు అనేవారు ఇలా కేవలం రీల్ హీరోలా వ్యవహరించకూడదు. ట్యాక్స్ ఎగవేత అనేది రాజ్యాంగ విరుద్దం. అది దేశ వ్యతిరేక చర్య.' అని అభిప్రాయపడ్డారు. అంతేకాదు,ఇలాంటి నటులు తమను తాము సామాజిక న్యాయం కోసం పోరాడుతున్న ఛాంపియన్లుగా చూపించుకుంటారని పేర్కొన్నారు. తమ సినిమాల్లో సమాజంలోని అవినీతిపై పోరాటం చేసే వీరు... నిజం జీవితంలో మాత్రం పన్ను ఎగవేతకు పాల్పడుతున్నారని అన్నారు.

ఆ విషయం దృష్టిలో పెట్టుకోవాలి...

ఆ విషయం దృష్టిలో పెట్టుకోవాలి...


ఓవైపు సామాన్యులను చట్టబద్దంగా పన్నులు చెల్లించాలని ప్రోత్సహిస్తుంటే... మరోవైపు ఇలా సంపన్నులు,ఉన్నత హోదాల్లో ఉన్న వ్యక్తులు పన్ను చెల్లించడంలో విఫలమవుతున్నారని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాజ్యాంగ లక్ష్యాలను చేరుకోవడానికి చాలా సమయం పడుతుందన్నారు. అభిమానులు డబ్బు పెట్టి టికెట్లు కొని సినిమాలు చూడటం వల్లే ఇంత లగ్జరీ కారును ఆ హీరో కొనుగోలు చేయగలిగారని...ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. నిజానికి పిటిషన్‌లో పిటిషనర్ తన వృత్తిని కూడా పేర్కొనలేదని... ఏదేమైనా ఒక పేరున్న నటుడు చట్టబద్దంగా,సకాలంలో పన్నులు చెల్లించాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు.

English summary
The Madras High Court has dismissed a petition filed by Tamil Actor Vijay in 2012, seeking forbearance against the Tamil Nadu Government from demandin entry tax on his imported Rolls Royce Ghost Motor car. Justice SM Subramaniam also imposed costs of Rs. 1,00,000 on the actor,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X