జగన్ ఫార్ములా.. తమిళ రాజకీయాల్లో కుదుపు: ఎన్నికల్లో ప్రధాన ప్రచారాస్త్రంగా: రెండో రాజధానిగా
మధురై: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలు తమిళనాడులో అనూహ్య పరిణామాలకు దారి తీస్తోంది. వైఎస్ జగన్ అనుసరిస్తోన్న మూడు రాజధానుల ఫార్ములా తమిళనాడు రాజకీయాలను కుదిపేస్తోంది. అక్కడా రెండో రాజధాని డిమాండ్ క్రమంగా ఊపందుకుంటోంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించాల్సిన ప్రస్తుత పరిస్థితుల్లో రెండో రాజధాని డిమాండ్ వినిపించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సంచలనానికి తెర తీసినట్టయింది.
ఏపీ
బీజేపీలో
మరో
వికెట్:
మచిలీపట్నం
లోక్సభ
అభ్యర్థిపై
సోము
వీర్రాజు
ఫైర్:
సస్పెన్షన్
వేటు

మధురైని రెండో రాజధానిగా..
ఈ పరిణామాలన్నింటినీ ఆసక్తిగా గమనిస్తోన్న తమిళ ప్రజలు తమకూ రెండో రాజధాని కావాలంటూ పట్టుబడుతున్నారు. తమిళనాడు దక్షిణప్రాంతంలో ఉన్న చారిత్రాత్మక మధురై నగరాన్ని రెండో రాజధానిగా ప్రకటించాలంటూ డిమాండ్ చేస్తోన్నారు. సోషల్ మీడియా వేదికగా తమ గళాన్ని బలంగా వినిపిస్తున్నారు. అన్ని ప్రాంతాలూ సమానాభివృద్ధిని సాధించడానికి అభివృద్ధిని వికేంద్రీకరించాల్సి ఉంటుందనే వాదం తమిళనాడు దక్షిణ ప్రాంత ప్రజల్లో కనిపిస్తోంది. మధురైని రెండో రాజధానిగా ప్రకటించాలనే డిమాండ్ క్రమంగా ఊపందుకుంటోంది.

అక్కడ లేవా?
తమిళనాడు దక్షిణ ప్రాంత ప్రజల మనోభావాలకు అనుగుణంగా మధురైని రెండో రాజధానిగా ప్రకటించాలంటూ ఏఐఏడీఎంకే సీనియర్ నాయకుడు, రెవెన్యూశాఖ మంత్రి ఆర్‌బీ ఉదయ్ కుమార్ అన్నారు. మధురై గ్రామీణ పశ్చి జిల్లా పార్టీ నేతలతో ఆయన సమావేశం అయ్యారు. తీర్మానం కూడా చేశారు. ఈ తీర్మానాన్ని ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వానికి పంపిస్తామని అన్నారు. జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్‌లో రెండు రాజధానులు ఉన్నాయని, గుజరాత్‌లో రాజధాని గాంధీనగర్ తరువాత.. అన్ని ప్రధాన కార్యాలయాలన్నీ అహ్మదాబాద్‌లో కొనసాగుతున్నాయని గుర్తు చేశారు.

ఏపీలో త్వరలో మూడు రాజధానులు..
పొరుగునే ఉన్న ఏపీలో త్వరలో మూడు రాజధానులు రాబోతున్నాయని, దీనికి సంబంధించిన బిల్లులను గవర్నర్ సైతం ఆమోదించారని మంత్రి ఉదయ్ కుమార్ పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో తమిళనాడులో రెండో రాజధానిని ఏర్పాటు చేయాలంటూ ప్రజలు కోరుతున్నారని చెప్పారు. రెండో రాజధాని వల్ల పరిపాలన వేగవంతమౌతుందని అన్నారు. రెండో రాజధానిగా ప్రకటించడానికి అవసరమైన అన్ని అర్హతలు మధురైకి ఉన్నాయని తెలిపారు. దక్షిణ ప్రాంతంలో అభివృద్ధి చెందిన నగరంగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉందని చెప్పారు.

10 వేల ఎకరాల్లో..
మధురైలో మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ కొనసాగుతోంది. అంతర్జాతీయ విమానాశ్రయమూ అందుబాటులో ఉంది. మధురై నుంచి 150 కిలోమీటర్ల దూరంలో తూత్తుకుడి పోర్ట్ ఉంది. అఖిల భారత వైద్య విజ్ఙాన సంస్థ (ఎయిమ్స్ ) ఆసుప్రతిని మధురైలోనే ఏర్పాటు చేశారు. వాటన్నింటితో పాటు నగర శివార్లలో 10 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఖాళీగా ఉందని, అక్కడ ప్రభుత్వ భవన సముదాయాలను నిర్మించడానికి అనువుగా ఉంటుందని ఉదయ్ కుమార్ తెలిపారు.

ఎన్నికల్లో ప్రధాన ప్రచారంగా..
తమిళనాడు అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలను నిర్వహించనున్నారు. ఈ పరిస్థితుల్లో అన్నా డీఎంకే రెండు రాజధానుల నినాదాన్ని లేవనెత్తడం తమిళనాడు రాజకీయాలను హీటెక్కించినట్టయింది. ఎన్నికల నాటికి మధురైని రెండో రాజధానిగా ప్రకటించడమా? లేక అదే నినాదంతో ఎన్నికల బరిలో దిగడమా? అనేది ఇంకా తేలాల్సి ఉంది. మధురైని రెండో రాజధానిగా ప్రకటించి, అన్నా డీఎంే ఎన్నికలకు వెళ్తుందనే అభిప్రాయం వినిపిస్తోంది.