Wife: పనిమీద భర్త, పుట్టింటి దగ్గర భార్యకు ?, అత్తారింటి ముందే భార్యను నరికి చంపేసిన భర్త, క్లైమాక్స్!
చెన్నై/తిరుచ్చి: కుటుంబ సభ్యులు సెట్ చేసిన పెళ్లి చేసుకున్న దంపతులు చాలా సంతోషంగా కాపురం చేశారు. కొన్ని సంవత్సరాల తరువాత భర్త పని చెయ్యడానికి వేరే రాష్ట్రానికి వెళ్లాడు. భార్య ఆమె పుట్టింటిలో ఉంది. భార్య పుట్టింటిలోనే సెటిల్ అయిపోవడంతో భర్త ఆమె ఇంటికి వెళ్లి వస్తున్నాడు. మన ఇంటికి వెళ్లిపోదామని భర్త అతని భార్యకు ఫోన్ చేసి చెప్పాడు.
అయితే నేను మీ ఇంటికి రాను అని భార్య తేల్చి చెప్పింది. పుట్టింటి దగ్గర భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని, అందుకే ఆమె మా ఇంటికి రాను అని కచ్చితంగా చెబుతోందని భర్తకు అనుమానం పెరిగిపోయింది. వేరే రాష్ట్రం నుంచి నేరుగా అత్తారింటి దగ్గరకు వెళ్లిన భర్త అతని భార్యను ఆమె కుటుంబ సభ్యుల ముందే దారుణంగా నరికి చంపేయడం కలకలం రేపింది.

ఐదు సంవత్సరాలు హ్యాపీలైఫ్
తమిళనాడులోని తిరుచ్చిలోని తులైయనతం గ్రామంలో గోమతి (28) అనే మహిళ నివాసం ఉంటున్నది. కొన్ని సంవత్సరాల క్రితం రమేష్ (39) అనే వ్యక్తితో గోమతి వివాహం జరిగింది. కుటుంబ సభ్యులు సెట్ చేసిన పెళ్లి చేసుకున్న రమేష్, గోమతి దంపతులు తిరుచ్చిలోనే నివాసం ఉంటూ ఐదు సంవత్సరాలు చాలా సంతోషంగా కాపురం చేశారు.

ముంబాయిలో భర్త
మేస్త్రీ పని చేస్తున్న రమేష్ బిల్డర్ దగ్గర పని చెయ్యడానికి మహారాష్ట్రలోని ముంబాయికి వెళ్లిపోయాడు. రమేష్ ముంబాయి వెళ్లిన తరువాత గోమతి ఆమె పుట్టింటికి వెళ్లింది. కొన్ని సంవత్సరాల నుంచి ముంబాయితో పాటు మహారాష్ట్రలో రమేష్ పని చేస్తున్నాడు. భార్య గోమతి ఆమె పుట్టింటిలో ఉండటంతో రమేష్ అత్తారింటికి వెళ్లి వస్తున్నాడు.

ఫోన్ లోనే గోడవపడిన దంపతులు
భార్య గోమతి పుట్టింటిలోనే సెటిల్ అయిపోవడంతో రమేష్ చాలాకాలం నుంచి ఆమె ఇంటికి వెళ్లి వస్తున్నాడు. మన ఇంటికి వెళ్లిపోదామని రమేష్ అతని భార్య గోమతికి మహారాష్ట్ర నుంచి ఫోన్ చేసి చెప్పాడు. అయితే నేను మీ ఇంటికి రాను అని గోమతి ఆమె భర్త రమేష్ కు తేల్చి చెప్పింది. ఫోన్ లోనే రమేష్, గోమతి దంపతులు గొడవపడ్డారు.

ఇంటి ముందే భార్యను నరికి చంపేసిన భర్త
పుట్టింటి దగ్గర భార్య గోమతి అక్రమ సంబంధం పెట్టుకుందని, అందుకే ఆమె మా ఇంటికి రాను అని కచ్చితంగా చెబుతోందని రమేష్ కు అనుమానం పెరిగిపోయింది. మహారాష్ట్ర నుంచి నేరుగా తిరుచ్చి జిల్లాలోని అత్తారింటి దగ్గరకు వెళ్లిన రమేష్ అతని భార్య గోమతిని ఆమె కుటుంబ సభ్యుల ముందే దారుణంగా నరికి చంపేయడం కలకలం రేపింది. భార్య గోమతిని హత్య చేసిన రమేష్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications