ప్రమాణ స్వీకారానికి ముందే స్టాలిన్ కీలక ప్రకటన: కాబోయే ముఖ్యమంత్రిగా తొలి నిర్ణయం

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష డీఎంకే ఘన విజయాన్ని అందుకుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్‌ను మించిన సీట్లను సొంతం చేసుకుంది. పదేళ్ల తరువాత డీఎంకే-కాంగ్రెస్ కూటమి తమిళనాడులో అధికారాన్ని అందుకోబోతోన్నాయి. ఈ నెల 7వ తేదీన తమిళనాడు ముఖ్యమంత్రిగా డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో నిరాడంబరంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతంది అక్కడి ప్రభుత్వం. పరిమితంగా పాసులను జారీ చేయనుంది.

తమిళనాడులో కరోనా వైరస్ పరిస్థితులపై కాబోయే ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.. అప్పుడే దృష్టి సారించారు. కరోనా నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై ఓ కార్యాచరణ ప్రణాళికలను రూపొందించుకుంటోన్నారు. ఇందులో భాగంగా- జర్నలిస్టులు, మీడియా సంస్థల్లో పనిచేసే ప్రతినిధులు, ఉద్యోగులను ఫ్రంట్‌లైన్ వర్కర్లుగా ప్రకటించారు. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే దీనిపై అధికారక ఉత్తర్వులను జారీ చేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే- తమిళనాడు కాబోయే ముఖ్యమంత్రిగా స్టాలిన్ తీసుకున్న తొలి నిర్ణయం ఇదే అవుతుంది.

MK Stalin says media professionals to be considered as frontline workers in Tamil Nadu

Recommended Video

    Kamal Haasan, Kushboo Had Lost In Tamilnadu Assembly Elections 2021 | Oneindia Telugu

    ఇప్పటికే మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు మీడియా ప్రతినిధులను ఫ్రంట్‌లైన్ వర్కర్లుగా గుర్తించిన విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ఈ దిశగా ప్రకటన చేశారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయడానికి మమతా బెనర్జీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గురువారం ఆమె ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమం కూడా నిరాడంబరంగానే ఉంటుందని ఇప్పటికే ఆమె ప్రకటించారు కూడా. పరిమితంగా ఈ కార్యక్రమానికి అతిథులను ఆహ్వానించనున్నట్లు చెప్పారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+