Tamilnadu News: ఓటీపీ చెప్పలేదని భార్య, పిల్లల ముందే దారుణానికి ఒడిగట్టిన క్యాబ్ డ్రైవర్..
చిన్న చిన్న కారణాలు పెద్ద దారుణాలుక ఒడిగడుతున్నారు కొందరు. తాజాగా ఓటీపీ చెప్పలేదని క్యాబ్ డ్రైవర్, ప్రయాణికుడిని చంపాడు.చెన్నైలోని ఓల్డ్ మహాబలిపురం రోడ్డులో ఆదివారం నాడు ఈ ఘటన జరిగింది. చెన్నై శివారులోని గూడువాంజేరి సమీపంలోని కన్నివాక్కం కుందన్‌నగర్‌లో ఉంటున్న ఉమేందర్(34) కోయంబత్తూరులోని ఓ ప్రముఖ సంస్థలో సాఫ్ట్ వేర్ ఇంజినీరుగా పని చేస్తున్నాడు.అతను ప్రతి శని, ఆదివారం చెన్నైకి వచ్చి కుటుంబంతో గడుపుతాడు. ఆదివారం ఉమేందర్ భార్య భవ్య(30), పిల్లలు అక్రోష్, కరన్‌తో పాటు భవ్య సోదరి దేవిప్రియ, ఆమె పిల్ల లతో కలిసి ఓఎంఆర్ రోడ్డులోని సినీ కాంప్లెక్స్‌లో సినిమాకు వెళ్లారు.
సినిమా చూసిన తర్వాత ఇంటికి వెళ్లడానికి దేవిప్రియ క్యాబ్ బుక్ చేసింది. కారు ఎక్కాక డ్రైవర్ రవి బుకింగ్ ఓటీపీ నంబర్ చెప్పాలని కోరాడు. ఈ విషయమై వారి మధ్య మాటామాటా పెరిగి గొడవకు దారి తీసింది. కారు దిగే సమయంలో ఉమేందర్ డోర్‌ను గట్టిగా నెట్టాడు. దీంతో డ్రైవర్ రవి ఉపేందర్ పై దాడి చేశాడు. దీంతో ఉపేందర్ క కుప్పకూలి పోయాడు. అతన్ని ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఇన్‌స్పెక్టర్ ఎ గోవిందరాజ్ తెలిపిన వివరాల ప్రకారం.. "నవలూరులోని ఓ మాల్ నుంచి సాయంత్రం 3.30 గంటల ప్రాంతంలో సినిమా చూసి కుటుంబం బయటకు వచ్చింది. వారు క్యాబ్ బుక్ చేసకున్నారు. వాహనం రాగానే అందులోకి వెళ్లి కూర్చున్నారు. సేలంకు చెందిన క్యాబ్ డ్రైవర్ ఎన్ రవి (41) తన అనుమతి లేకుండా వాహనం ఎక్కినందుకు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
OTP నిర్ధారించిన తర్వాత వారిని బయటకు వెళ్లి లోపలికి రమ్మని కోరాడు. అందరూ దిగిన తర్వాత, ఉమేందర్ వాహనం డోర్‌ను పగులగొట్టాడు అని గోవిందరాజ్ తెలిపారు. కోపోద్రిక్తుడైన రవి ఉపేందర్ ను కొట్టినట్లు చెప్పారు. ఉపేందర్ భార్య భవ్య ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications