Revenge: ఆసుపత్రి బెడ్ మీద అడ్డంగా నరికేశారు, ఇంట్లో భార్య ?, పగలు తప్పించుకుంటే రాత్రి?

చెన్నై/ సేలం: వివాహం చేసుకున్న వ్యక్తి అతని భార్యతో సంతోషంగా కాపురం చేస్తున్నాడు. దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భర్తకు గతంల గొడవలు ఎక్కువగా చెయ్యడం, కేసుల వరకు వెళ్లడంతో చాలామందితో అతనికి పాతకక్షలు ఉన్నాయి. పనిమీద బైక్ లో వెలుతున్న అతని మీద ప్రత్యర్థులు దాడి చేశారు. బైక్ వదిలేసి పారిపోయిన అతను ప్రాణాలతో బయటపడి ఆసుపత్రిలో చేరాడు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తిని ప్రత్యర్థులు వేటకొడవళ్లు, కత్తులతో దాడి చేసి దారుణంగా బెడ్ మీద చంపేశారు. ఆసుపత్రిలో వేటకొడవళ్లతో దాడి చేసి హత్య చెయ్యడంతో ఆసుపత్రిలోని డాక్టర్లు, నర్సులు, రోగులు ప్రాణభయంతో పరుగు తీశారు.

పెయింటర్

పెయింటర్

తమిళనాడులోని సేలం జిల్లాలోని మెట్టూరులోని తింటిల్ పట్టి ప్రాంతంలో రఘునందన్ అలియాస్ రఘు (28) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. గతంలో గొడవలు, రామాయణాలు ఎక్కువ చేసిన రఘు మీద అనేక కేసులు ఉన్నాయి. పెయింటర్ గా పని చేస్తున్న రఘుకు గతంలో నేర చరిత్ర ఉంది.

 భార్య, ఇద్దరు పిల్లలు

భార్య, ఇద్దరు పిల్లలు

వివాహం చేసుకున్న పెయింటర్ రఘు అతని భార్యతో సంతోషంగా కాపురం చేస్తున్నాడు. రఘు దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రఘు గతంలో గతంలో గొడవలు ఎక్కువగా చెయ్యడం, కేసుల వరకు వెళ్లడంతో చాలామందితో అతనికి పాతకక్షలు ఉన్నాయి. పనిమీద బైక్ లో వెలుతున్న రఘు మీద అతని ప్రత్యర్థులు దాడి చేశారు.

ఆసుపత్రిలో చేరిన రఘు

ఆసుపత్రిలో చేరిన రఘు

బైక్ వదిలేసి పారిపోయిన రఘు ప్రాణాలతో బయటపడి ఆసుపత్రిలో చేరాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రఘును చంపేయాలని అతని ప్రత్యర్థులు డిసైడ్ అయ్యాడు. ఆసుపత్రిలోనే రఘును హత్య చెయ్యాలని డిసైడ్ అయిన తింటిల్ పట్టి నివాసి విలియమ్, థర్మల్ ఫోర్ రోడ్డులో నివాసం ఉ:టున్న మూర్తి, సత్యమంగలో నివాసం ఉంటున్న ప్రకాష్ ఆసుపత్రిలోకి వెళ్లారు.

ఆసుపత్రిలో అడ్డంగా నరికేశారు

ఆసుపత్రిలో అడ్డంగా నరికేశారు

ఆసుపత్రిలో బెడ్ మీద చికిత్స పొందుతున్న రఘు మీద అతని ప్రత్యర్థులు విలియమ్, ప్రకాష్, మూర్తి కలసి వేటకొడవళ్లు, కత్తులతో దాడి చేసి దారుణంగా బెడ్ మీద చంపేశారు. ఆసుపత్రిలో వేటకొడవళ్లతో దాడి చేసి రఘును హత్య చెయ్యడంతో ఆసుపత్రిలోని డాక్టర్లు, నర్సులు, రోగులు ప్రాణభయంతో పరుగు తీశారు. రఘు హత్య కేసులో విలియమ్, మూర్తి, ప్రకాష్ ను అరెస్టు చేశామని సేలం పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+