సిస్టర్ అభయ హత్యోదంతం: 28 ఏళ్ల తరువాత తీర్పు: ఆ ఫాదర్, సిస్టర్‌కు యావజ్జీవం
తిరువనంతపురం: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సిస్టర్ అభయ హత్యోదంతంలో దోషులకు ఎట్టకేలకు శిక్ష ఖరారైంది. 28 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా కొనసాగిన ఈ కేసు విచారణకు పుల్‌స్టాప్ పడింది. ఈ కేసులో ఫాస్టర్, సిస్టర్ ఇద్దరూ దోషులేనని మంగళవారమే నిర్ధారించిన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం.. తాజాగా వారికి శిక్షను ఖరారు చేసింది. వారిద్దరికీ యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే తీర్పు వినిపించింది.

తొలి ముద్దాయిగా ఫాదర్..
ఈ కేసులో ఫాదర్ థామస్ కొట్టూర్‌ను తొలి ముద్దాయిగా సీబీఐ న్యాయస్థానం గుర్తించింది. సిస్టర్ సెఫీని మూడో దోషిగా నిర్ధారించింది. ఇదే కేసులో నిందితుడిగా ఆరోపణలను ఎదుర్కొన్న క్యాథలిక్ ప్రీస్ట్ జోస్ పుథురుక్కయిళ్‌ను నిర్దోషిగా గుర్తించింది. 2018లోనే ఆయనను నిర్దోషిగా తేల్చింది. థామస్ కొట్టూర్, సెఫీలకు యావజ్జీవ కారాగార శిక్షను విధిస్తున్నట్లు న్యాయమూర్తి జస్టిస్ కే సునీల్ కుమార్ తీర్పు వెలువరించారు.

మరణశిక్షను విధించాలంటూ పట్టు..
ఒక యువతిని హత్య చేయడం, అనంతరం దాన్ని ఆత్మహత్య చిత్రీకరించడానికి ప్రయత్నించడం, అదే నిజమని నమ్మించేలా కేసును పక్కదారి పట్టించడం.. వంటి అనేక కారణాలను ఆధారంగా చేసుకుని వారికి యావజ్జీవ కారాగార శిక్షను ఖరారు చేసినట్లు చెప్పారు. వారికి మరణశిక్షను విధించాలంటూ మృతురాలి తరఫు న్యాయవాది చేసిన విజ్ఞప్తిని న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోలేదు. సీబీఐ తరఫున ఎం నివాస్.. తన వాదనలను వినిపించారు.

దొంగ కీలక సాక్షిగా
ఈ కేసులో అడక్క రాజు అనే ఓ దొంగ ఇచ్చిన సాక్ష్యం అత్యంత కీలకంగా మారడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అలాగే- సామాజిక కార్యకర్త కారల్‌కోడై వేణుగోపాల్ ఈ కేసును సీబీఐకి అప్పగించడానికి పెద్ద ఎత్తున ఉద్యమించారు. సిస్టర్ అభయ హత్యోదంతాన్ని ఆత్మహత్యగా నిర్ధారించి, సీఐడీ పోలీసులు కేసును మూసివేసినప్పటికీ.. దానికి వ్యతిరేకంగా ఆయన ఉద్యమించారు. అనంతరం ఈ హత్యోదంతాన్ని అప్పటి ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది.

మూసివేసిన కేసును మళ్లీ తెరిపించి..
కొట్టాయంలోని సెయింట్ పాస్ కాన్వెంట్‌లో చదువుకునే సిస్టర్ అభయ.. 1992 మార్చి 27వ తేదీన అనుమానాస్పద స్థితిలో మృతదేహంగా కనిపించారు. ఆమె మృతదేహాన్ని పోలీసులు ఓ బావి నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును విచారించిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.. ఆత్మహత్య నిర్ధారించారు. కేసును మూసివేశారు కూడా. దీనిపట్ల కారల్‌కోడై వేణుగోపాల్.. ఆయన స్నేహితులు పెద్ద ఎత్తున ఉద్యమించారు.

శిక్ష ఖరారు..
దీనితో అప్పటి ప్రభుత్వం దీన్ని సీబీఐకి అప్పగించింది. హత్యగా కేసు నమోదు చేసిన సీబీఐ పోలీసులు కేసును మళ్లీ మొదటి నుంచి విచారించారు. సంఘటన చోటు చేసుకున్న 15 సంవత్సరాల తరువాత వారు దర్యాప్తు మొదలు పెట్టారు. 49 మందిని విచారించారు. ఈ నెల 10వ తేదీన దర్యాప్తును ముగించారు. తమ దర్యాప్తు నివేదికలను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి అప్పగించారు. దీన్ని పరిశీలించిన అనంతరం ఈ కేసులో ఫాదర్ థామస్ కొట్టూర్, సిస్టర్ సెఫీలను మంగళవారమే దోషులుగా నిర్ధారించింది. తాజాగా శిక్షను ఖరారు చేసింది.
-
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..!












Click it and Unblock the Notifications