చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వణక్కం అమెరికా: కమలా హ్యారిస్ స్వగ్రామంలో పండుగ వాతావరణం: ప్రైడ్ ఆఫ్ అవర్ విలేజ్

|
Google Oneindia TeluguNews

చెన్నై: అమెరికా ఉపాధ్యక్షురాలిగా భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ విజయం సాధించడతో ఆమె స్వగ్రామంలో పండుగ వాతవరణం నెలకొంది. వణక్కం అమెరికా అంటూ ఆ గ్రామస్తులు ముగ్గులు వేశారు. కమలా హ్యారిస్‌ను గెలిపించినందుకు అమెరికన్లకు కృతజ్ఙతలు తెలుపుతున్నారు. అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో డెమొక్రటిక్ పార్టీ నేతలు జో బిడెన్, కమలా హ్యారిస్‌ ఘన విజయాన్ని సాధించిన విషయం తెలిసిన వెంటనే ఆ గ్రామంలో కోలాహలం నెలకొంది.

తమిళనాడు తిరువరూర్ జిల్లాలోని తులసేంద్రపురం కమలా హ్యారిస్ స్వగ్రామం. కమలా హ్యారిస్ తల్లి శ్యామలా గోపాలన్ కుటుంబం ఈ గ్రామానికి చెందినదే. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హ్యారిస్ విజయం సాధించాలంటూ ఆ గ్రామస్తులు తులసేంద్రపురంలోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. ఇప్పుడా పూజలు ఫలించినట్టయ్యాయి. వారు కోరికలు నెరవేరాయి. అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ ఘన విజయాన్ని అందుకున్నారు.

Tamil Nadu women congratulate to Kamala Harris for elect as US Vice president-elect

దీనితో తులసేంద్రపురంలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. పండుగ వాతావరణం నెలకొంది. గ్రామస్తులంతా తెల్లవారగానే గ్రామాన్ని ముగ్గులతో అలంకరించారు. వణక్కం అమెరికా అంటూ కృతజ్ఙతలు తెలిపారు. కమలా హ్యారిస్ వల్ల తమ గ్రామానికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించిందని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన ఓ మహిళ.. తమ గ్రామస్తురాలు కావడం గర్వించదగ్గ విషయమని అంటున్నారు.

Tamil Nadu women congratulate to Kamala Harris for elect as US Vice president-elect

తులసేంద్రపురంలో ఇదివరకే కమలా హ్యారిస్ బ్యానర్లు, ప్లెక్సీలు పెద్ద ఎత్తున వెలిశాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ సందర్భంగా గ్రామస్తులు ఆమె ఫొటోలను ముద్రించిన ఫ్లెక్సీలను కట్టారు. శ్యామలా గోపాలన్ చెల్లెలు, కమలా హ్యారిస్ పిన్ని చెన్నైలో డాక్టర్‌గా పని చేస్తోన్న సరళా గోపాలన్ పోలింగ్ సమయంలో తులసేంద్రపురానికి వచ్చిన విషయం తెలిసిందే. స్థానిక ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు.

English summary
Women in Thulasendrapuram, the village in Tiruvarur of Tamil Nadu make 'rangoli' to US Vice President-elect Kamala Harris for her winning in US Election. This is the native village of Kamala Harris.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X