Target: ఉద్యోగం కోసం వెళ్లిన యువతులు టార్గెట్, భర్తతో సరళ స్కెచ్, ఆ వీడియోలతో బ్లాక్ మెయిల్!

చెన్నై/తిరుపతి: ఉద్యోగం చెయ్యాలని గ్రామీణ ప్రాంతాల నుంచి సిటీకి వెలుతున్న యువతుల మీద దంపతుల కన్నుపడింది. సిటీకి చేరుకుని కంపెనీల్లో సరైన ఉద్యోగాలు చిక్కకపోవడంతో దిగులుగా తిరుగుతున్న యువతులను మహిళ పరిచయం చేసుకుంది. మీకు ఉద్యోగాలు వచ్చే వరకు మా ఇంట్లో ఉండండి, మంచి ఉద్యోగాలు వచ్చిన తరువాత వెళ్లండి అంటూ యువతులకు ఆమె మాయమాటలు చెప్పింది.

భర్త సహాయంతో విటులను సంప్రధించి ఇంటికి పిలిపించుకుని యువతులను బెదిరించి వారితో బలవంతంగా హైటెక్ వేశ్యవాటిక కేంద్రం నిర్వహించారు. యువతులు విటులతో ఏకాంతంగా ఉన్న సమయంలో వీడియోలు తీసిన దంపతులు బ్లాక్ మెయిల్ చేసి వాళ్లు ఉద్యోగాలకు వెళ్లకుండా చేసి వ్యభిచారం చేయిస్తున్నారు.

కిలాడీ దంపతులు

కిలాడీ దంపతులు

చెన్నై సిటీలోని వన్నార్ పేట్ సమీపంలోని తిరువొత్తియూర్ హైవే సమీపంలోి అప్పర్ నగర్ లో సతీష్ కుమార్, సరళ దంపతులు నివాసం ఉంటున్నారు. ప్రతిరోజు టిప్పుటాపుగా రెఢీ అయ్యి, ఖరీదైన దుస్తులు వేసుకుంటున్న సతీష్ కుమార్, సరళ దంపతులు బైక్ లో చెన్నై సిటీలో రౌండ్స్ కు వెలుతున్నారు.

యువతులను టార్గెట్ చేసి?

యువతులను టార్గెట్ చేసి?

ఉద్యోగం చెయ్యాలని తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లోని గ్రామీణ ప్రాంతాల నుంచి చెన్నై సిటీకి వెలుతున్న యువతుల మీద సతీష్ కుమార్, సరళ దంపతుల కన్నుపడింది. చెన్నైకి చేరుకుని కంపెనీలు, ఫ్యాక్టరీలలో ఉద్యోగాలు చిక్కకపోవడంతో దిగులుగా తిరుగుతున్న యువతులను సరళ పరిచయం చేసుకుంటున్నది.

భర్త అమ్మాయిల బ్రోకర్

భర్త అమ్మాయిల బ్రోకర్

మీకు ఉద్యోగాలు వచ్చే వరకు మా ఇంట్లో ఉండండి, మంచి ఉద్యోగాలు వచ్చిన తరువాత వెళ్లండి అంటూ యువతులకు సరళ మాయమాటలు చెప్పి ఆమె ఇంటికి పిలుచుకుని వెలుతోంది. భర్త సతీష్ కుమార్ విటులను సంప్రధించి ఇంటికి పిలిపించుకుని యువతులను బెదిరించి ఉద్యోగాల కోసం చెన్నై వెళ్లిన అమాయకులైన యువతులతో సరళ బలవంతంగా హైటెక్ వేశ్యవాటిక కేంద్రం నిర్వహించింది.

వీడియోలతో బ్లాక్ మెయిల్

వీడియోలతో బ్లాక్ మెయిల్

యువతులు విటులతో ఏకాంతంగా ఉన్న సమయంలో వీడియోలు తీసిన దంపతులు బ్లాక్ మెయిల్ చేసి వాళ్లు ఉద్యోగాలకు వెళ్లకుండా చేసి వ్యభిచారం చేయిస్తున్నారు. వన్నార్ పేట్ డిప్యూటీ పోలీస్ కమీషనర్ పవన్ కుమార్ రెడ్డికి మ్యాటర్ తెలిసింది. డీసీపీ పవన్ కుమార్ రెడ్డి ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు హైటెక్ వ్యభిచార కేంద్రం నిర్వహిస్తున్న సతీష్ కుమార్, సరళ దంపతులను అరెస్టు చేశారు.

యువతుల జీవితాలతో చెలగాటం

యువతుల జీవితాలతో చెలగాటం

సరళ ఇంటిలో ఉన్న ఇద్దరు యువతులను రక్షించి మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు. ఇప్పటికే సతీష్ కుమార్, సరళ దంపతులు ఇప్పటికే చాలా మంది యువతుల జీవితాలతో చెలగాటం ఆడారని, వారిని వేశ్యవాటిక కేంద్రాలకు తరలించారని పోలీసుల విచారణో వెలుగు చూడటంతో స్థానికులు హడలిపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+