కుప్పంలో 25 వేల ఓట్ల తేడాతో చంద్రబాబు ఓటమి: రాసి పెట్టుకోండి

Chandrababu Naidu Kuppam result 2024: ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరుకుంది. మే 13వ తేదీన పోలింగ్ గడువు సమీపిస్తోండటంతో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉధృతంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ప్రతిపక్ష తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ కూటమి ధీటుగా ప్రచారాన్ని నిర్వహిస్తోంది.

ఈ ఎన్నికల ఫలితాల సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఉత్కంఠభరితంగా మారే అసెంబ్లీ నియోజకవర్గం.. కుప్పం. ఇక్కడి రిజల్ట్ ఎలా ఉండొచ్చనే విషయం అత్యంత ఆసక్తికరంగా మారింది. తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గం కావడమే దీనికి కారణం.

Astrologer predicts Chandrababu Naidu to loose in Kuppam

ఎప్పట్లాగే- ఈ ఎన్నికల్లో కూడా ఆయన కుప్పం నుంచే బరిలో దిగారు. ఇక్కడి నుంచి పోటీ చేస్తోండటం ఎనిమిదో సారి. ఏడుసార్లు అప్రతిహతంగా విజయం సాధించారు. 1989 నుంచీ గెలుస్తూనే వస్తోన్నారు. అన్ని సార్లు కూడా కుప్పంలో చంద్రబాబు గెలుపు నల్లేరుమీద నడకే అయింది.

ఈ దఫా మాత్రం పరిస్థితి ఆయనకు అనుకూలంగా లేకపోవచ్చంటూ గతంలోనే వార్తలొచ్చాయి. కుప్పం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ బలపడిందనడానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోవడమే దీనికి నిదర్శనం. 2019 నాటి ఎన్నికల్లో చంద్రబాబు తొలి రెండు రౌండ్లల్లో వెనుకంజలో ఉన్న విషయం తెలిసిందే.

పైగా కుప్పంపై ప్రత్యేక దృష్టిిని సారించింది కూడా. ఇక్కడ పార్టీని గెలిపించాల్సిన బాధ్యతను చిత్తూరు జిల్లాకే చెందిన సీనియర్ నేత, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీసుకున్నారు. చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ స్థానిక నాయకుడు, శాసన మండలి సభ్యుడు కేఆర్‌జే భరత్ పోటీలో నిలిచారు.

ఈ పరిస్థితుల్లో కుప్పం ఫలితం ఎలా ఉండొచ్చనే అంశంపై ఓ జ్యోతిష్యుడు తన అంచనాలను వెల్లడించారు. కుప్పంలో చంద్రబాబు ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. ఎన్ని వేల ఓట్ల మెజారిటీతో ఓడిపోతారనేది కూడా చెప్పారాయన. 25,630 ఓట్ల తేడాతో చంద్రబాబు ఓడిపోతారని అన్నారు.

ఈ మేరకు ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. దీనికి సంబంధించిన షార్ట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతోంది. కావాలంటే రాసిపెట్టుకోవచ్చనీ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+