కుప్పంలో ఈ కామర్స్ గోడౌన్‌లో ప్రమాదం: రూ.10 లక్షల ఆస్తి నష్టం
దీపావళి పండగ ముందు చిత్తూరు జిల్లాలో ప్రమాదం జరిగింది. కుప్పంలో గల ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్‌కు చెందిన గోడౌన్‌లో ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది. ప్రమాదం జరిగిన సమయంలో గోడౌన్‌లో విలువైన పార్శిల్స్ ఉన్నాయట. అవన్ని అగ్నికి ఆహుతి అయినట్టు తెలుస్తోంది.
ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటీన ఘటన స్థలానికి చేరుకుంది. వెంటనే మంటలను అదుపులోకి తీసుకొని వచ్చింది. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ప్రమాదంలో రూ.10 లక్షల ఆస్తి నష్టం జరిగినట్టు గోడౌన్ సిబ్బంది వెల్లడించారు. ప్రాణ నష్టం మాత్రం ఏమీ జరగలేదు.

దివాళి పండగ కోసం కస్టమర్స్ ఆర్నమెంట్స్ బుక్ చేసుకున్నారు. వాటిని కొద్దీరోజుల్లో డెలివరీ చేయాల్సి ఉంది. ఇంతలో ప్రమాదం జరిగింది. దీనికి ఇన్సూరెన్స్ ఉంటే కంపెనీ క్లెయిమ్ చేసుకోనుంది. లేదంటే ఆ మొత్తం కంపెనీ భరించాల్సిందే. కొందరు కస్టమర్స్ ముందే మనీ పే చేయడంతో వారికి ఆలస్యంగానైనా డెలివరీ చేయాల్సి ఉంటుంది. క్యాష్ ఆన్ డెలివరీ పెట్టిన వారితో ప్రాబ్లమ్ లేదు. ఐటెమ్స్ పూర్తిస్థాయిలో లేవని.. ఉంటే భారీ నష్టపోయే వారమని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications