చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

షాకింగ్:ఫోర్జరీతో వైసీపీ గెలుపు -చిత్తూరు కార్పోరేషన్ ఎన్నిక ఆపేయండి -హైకోర్టులో టీడీపీ పిటిషన్, ఉత్కంఠ

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు ముందుకు సాగుతోన్న కొద్దీ అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య కొత్తరకం వివాదాలు తలెత్తుతున్నాయి. పంచాయితీ ఎన్నికల మాదిరిగానే మున్సిపల్ ఎన్నికల్లోనూ చెప్పుకోదగ్గ స్థాయిలో ఏకగ్రీవాలు చోటుచేసుకోగా.. వైసీపీ అక్రమ మార్గంలో ఏకగ్రీవాలను సాధించిందని టీడీపీ ఆరోపిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరుపై స్పెషల్ ఫోకస్ పెట్టిన వైసీపీ.. ఈసారి అక్కడి రెండు కార్పొరేషన్లను ఏకగ్రీవంగా గెలుచుకోగా, వాటిపై అనూహ్య ఆరోపణలు వెల్లువెత్తాయి. వ్యవహారం హైకోర్టు దాకా చేరింది..

భారత్‌లో మళ్లీ కరోనా విజృంభణ -కొత్తగా 18,711కేసులు, 100 మరణాలు -యాక్టివ్ కేసులు పైపైకిభారత్‌లో మళ్లీ కరోనా విజృంభణ -కొత్తగా 18,711కేసులు, 100 మరణాలు -యాక్టివ్ కేసులు పైపైకి

చిత్తూరు ఎన్నిక ఆపండి..

చిత్తూరు ఎన్నిక ఆపండి..

చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో రెండు ప్రధాన మున్సిపల్ కార్పొరేషన్లు (చిత్తూరు, తిరుపతి)ని వైసీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగిసే (మార్చి 3) నాటికి చిత్తూరు, తిరుపతి కార్పొరేషన్లలో మెజార్టీ డివిజన్లలో వైసీపీ అభ్యర్థులు మాత్రమే బరిలో నిలవడంతో ఏకగ్రీవం ఖరారైంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం.. మార్చి 10న మున్సిపల్ ఎన్నికలు పూర్తయిన తర్వాతే వెలువడనుంది. కాగా, అనూహ్య రీతిలో చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను నిలిపేయాలంటూ రాష్ట్ర హైకోర్టులో హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. దీనిని న్యాయస్థానం ఆదివారమే విచారిస్తుండటంతో తీర్పుపై ఉత్కంఠ నెలకొంది..

ఫోర్జరీతో వైసీపీ అక్రమాలు..

ఫోర్జరీతో వైసీపీ అక్రమాలు..

చిత్తూరు కార్పొరేషన్‌ పరిధలోని 50 డివిజన్లకు గాను 37 డివిజన్లు ఏకగ్రీవం కావడంతో ఎన్నికలతో సంబంధం లేకుండా కార్పొరేషన్‌ను వైసీపీ వైసీపీ కైవసం చేసుకున్నట్లయింది. జిల్లాలోని పుంగనూరు, పలమనేరు మున్సిపాలిటీలు కూడా వైసీపీ ఖాతాలోకే వెళ్లాయి. అయితే, చిత్తూరులో అధికార పార్టీ భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడిందని ప్రతిపక్ష టీడీపీ ఆరోపిస్తోంది. 18 డివిజన్లలో టీడీపీ అభ్యర్థుల నామినేషన్లు ఫోర్జరీతో విత్ డ్రా చేశారని, ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపేదాకా ఎన్నికల ప్రక్రియను నిలిపేయాలంటూ టీడీపీ హైకోర్టును ఆశ్రయించింది.

viral video: జగన్ సీటుకు ఎసరు -సాయిరెడ్డి పెద్ద బేకార్ -ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ సంచలనంviral video: జగన్ సీటుకు ఎసరు -సాయిరెడ్డి పెద్ద బేకార్ -ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ సంచలనం

టీడీపీ తరఫున తుమ్మలపాటి వాదనలు..

టీడీపీ తరఫున తుమ్మలపాటి వాదనలు..

చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ ను వైసీపీ అక్రమంగా కైవసం చేసుకుందని, తమ సంతకాలను ఫోర్జరీ చేసి నామినేషన్లను ఉపసహరించారని ఆరోపిస్తూ 18 మంది టీడీపీ అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హౌజ్ మోషన్ పిటిషన్ కావడంతో ఇవాళే దానిని హైకోర్టు విచారిస్తున్నది. టీడీపీ అభ్యర్థుల తరఫున మాజీ అడ్వొకేట్ జనరల్, సీనియర్ న్యాయవాది తమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించనున్నారు.

English summary
Regarding Chittoor Municipal Corporation, andhra pradesh high court on sunday hearing a House Motion Petition. seeking suspension of elections, The petitioner contended that the nominations of TDP candidates in 18 divisions were drawn with forgery. tdp alleges ysrcp forged.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X