చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఖాకీ బట్టలు విప్పేయండి..: ఏపీ డీజీపీ, ఎస్పీలపై నారా లోకేష్ నిప్పులు: సాక్షి జీతగాడంటూ

|
Google Oneindia TeluguNews

చిత్తూరు: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్.. రాష్ట్ర పోలీసు యంత్రాంగంపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పోలీస్ డైరెక్టర్ జనరల్ గౌతమ్ సవాంగ్ మొదలుకుని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ల వరకూ ఉన్నతాధికారులందరినీ ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోలీసు అధికారులందరూ తొత్తులుగా వ్యవహరిస్తున్నారంటూ చాలాకాలం నుంచీ విమర్శలు చేస్తూ వస్తోన్న నారా లోకేష్ తన మాటల దాడిని మరింత తీవ్రతరం చేశారు.

కుప్పం పర్యటనకు..

కుప్పం పర్యటనకు..

తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సొంత అసెంబ్లీ నియోజకవర్గం చిత్తూరు జిల్లా కుప్పంలో ఆయన పర్యటిస్తోన్నారు. కుప్పం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ విలేకరులతో కొద్దిసేపు మాట్లాడారు. పోలీసు యంత్రాంగాన్ని టార్గెట్ చేసుకున్నారు. ఘాటు వ్యాఖ్యలు చేశారు. డీజీపీ నుంచి జిల్లా ఎస్పీ దాకా పోలీసు అధికారులు ఖాకీ దుస్తులు విప్పేసి.. వైఎస్ఆర్సీపీ కండువాను కప్పుకోవచ్చని అన్నారు.

ఎందుకొచ్చిన బాధ ఇదంతా..

జిల్లా పోలీసు సూపరింటెండెంట్లను శాసన సభ్యులను చేస్తానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చినట్టు కనిపిస్తోందని నారా లోకేష్ ఆరోపించారు. డీజీపీకి రాజ్యసభకు పంపిస్తానని భరోసా ఇచ్చి ఉండొచ్చని అన్నారు. ప్రభుత్వ సలహాదారుగా సాక్షి జీతగాడు ఉన్నాడంటూ సజ్జల రామకృష్ణారెడ్డిని ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. వాడు (సజ్జల రామకృష్ణా రెడ్డి) ఆదేశాలు జారీ చేస్తాడు..ఇక్కడ ఈ మహానుభావుడు (వైఎస్ జగన్మోహన్ రెడ్డి) అమలు చేస్తాడు.. అని నారా లోకేష్ ఆరోపించారు.

ఎస్పీ చదువుకున్నాడా..?

ఎస్పీ చదువుకున్నాడా..?


అసలు జిల్లా ఎస్పీ చదువుకున్నాడా? ఆయనకు చట్టం, రాజ్యాంగం తెలుసా? అని నారా లోకేష్ ప్రశ్నించారు. 36 గంటలుగా తమ పార్టీ నాయకులను గృహ నిర్బంధం చేశారని, ఇప్పుడు 151 కింద నోటీసు ఇచ్చారని విమర్శించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా గృహ నిర్బంధంలో ఉంచే హక్కు పోలీసులకు లేదని చెప్పారు. అది కూడా న్యాయస్థానం ఆదేశించిన తరువాత నోటీసులు ఇచ్చారని నారా లోకేష్ గుర్తు చేశారు.

ఇక్కడొక డీఎస్పీ ఏడిచాడు..

ఇక్కడొక డీఎస్పీ ఏడిచాడు..

ఇక్కడొక డీఎస్పీ ఏడిచాడు.. ప్రచారానికి పర్మిషన్ తీసుకోవాలట. చాలా వింతగా ఉంది.. ప్రచారానికి ఎవ్వడి పర్మిషన్ అవసరం లేదని ఎన్నికల కమీషనే చెప్పింది.. స్వేచ్ఛగా ప్రచారం చేసుకోవచ్చంటూ ఎన్నకల కమిషన్ డీఎస్పీకి అక్షింతలు వేసిందని నారా లోకేష్ ఎద్దేవా చేశారు. కోర్టు ఆదేశించినా, ఎన్నికల కమిషన్ చెప్పినా.. కొంతమంది ఖాకీలు మాత్రం సాక్షి జీతగాడి మాటలు విని మోసపోతున్నారని అన్నారు.

చంద్రబాబుది పెద్ద మనసు కావొచ్చు..

చంద్రబాబుది పెద్ద మనసు కావొచ్చు..

తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిది పెద్ద మనసు కావచ్చేమో గానీ.. తాను అలాంటి వాడిని కాదని నారా లోకేష్ హెచ్చరించారు. పోలీసులందరినీ తాను గుర్తు పెట్టుకుంటానని అన్నారు. 2024లో ముఖ్యమంత్రి అయ్యేది చంద్రబాబు నాయుడేనని స్పష్టం చేశారు. ఆయన కుప్పం నుంచే మరోసారి శాసనసభకు ఎన్నికవుతారని తేల్చి చెప్పారు. అప్పుడు వీళ్లందరూ ఎక్కడ ఉంటారో తేల్చుకోవాల్సి ఉంటుందని నారా లోకేష్ వార్నింగ్ ఇచ్చారు.

Recommended Video

AP MLC Elections : అభ్యర్ధుల ఎంపిక పూర్తి .. కొత్తగా 14 మంది ఖరారు..! || Oneindia Telugu
 కుప్పం ఎన్నికల ప్రచారంలో..

కుప్పం ఎన్నికల ప్రచారంలో..

ప్రస్తుతం నారా లోకేష్.. కుప్పం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. రెండు రోజుల కిందట ఆయన అనంతపురం జిల్లాలో పర్యటించారు. ఇప్పుడు కుప్పంలో ఎంట్రీ ఇచ్చారు. బహిరంగ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. కుప్పం మున్సిపాలిటీ టీడీపీదేనంటూ ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడికి కుప్పం ప్రజలు కృతజ్ఞులై ఉంటారని అన్నారు. కుప్పాన్ని చంద్రబాబు ఎంతో అభివృద్ధి చేశారని పేర్కొన్నారు. ఆయన చేసిన అభివృద్ధి పనులే టీడీపీ అభ్యర్థులను గెలిపిస్తారని చెప్పారు.

English summary
Telugu Desam Party leader and former minister Nara Lokesh slams AP DGP Goutam Sawang and other police officers as YSRC supporters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X