కశ్మీర్‌లో టీటీడీ ఆలయం, 500 చోట్ల కూడా.. టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 500 శ్రీవారి ఆలయాలను నిర్మిస్తామని తెలిపింది. పాలకమండలి తీసుకున్న నిర్ణయాలను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. 18 నెలల్లో కశ్మీర్‌లో వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. టీటీడీ ఆధ్వర్యంలో గల ప్రతి గుడిలో ఓ గోమాతను ఉంచుతామని తెలిపారు. ఇప్పటికే 100 ఆలయాల్లో అమలు చేస్తున్నామని తెలిపారు.

టీటీడీ పరిధిలో గల అన్ని విభాగాల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసేందుకు కొత్త విధానాన్ని తీసుకువస్తామని సుబ్బారెడ్డి తెలిపారు. 90 రోజుల్లో దీనికి సంబంధించిన ముసాయిదాను తీసుకొస్తామని టీచెప్పారు. అవకాశం ఉన్న ప్రతి కాంట్రాక్టు ఉద్యోగిని పర్మినెంట్ విధానంలో నియమిస్తామని తెలిపారు. ప్రకృతి వ్యవసాయ ధాన్యంతో గల విత్తనాలతో స్వామివారికి నైవేద్యం సమర్పించాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

ttd build temple at kashmir

తెలుగు రాష్ట్రాల్లో 500 శ్రీవారి ఆలయాల నిర్మాణం చేపడతామని వెల్లడించారు. వారణాసి, ముంబైలోనూ శ్రీవారి ఆలయ నిర్మాణం చేపడతామని పేర్కొన్నారు. గుడికో గోమాత కార్యక్రమాన్ని విస్తరిస్తున్నామని సుబ్బారెడ్డి తెలిపారు. గత రెండేళ్లలో అనేక నిర్ణయాలు తీసుకున్నామని, సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా ఎల్1 దర్శనాలు రద్దు చేశామని తెలిపారు.

తిరుమలలో ప్లాస్టిక్ బ్యాన్ చేశామని, కరోనా సమయంలో ప్రజలు త్వరగా కోలుకోవాలని ప్రత్యేకంగా పూజ కార్యక్రమాలు నిర్వహించామని పేర్కొన్నారు. ధర్మప్రచారంలో భాగంగా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆలయాలు నిర్మిస్తున్నామని చెప్పారు. వరహస్వామి ఆలయానికి బంగారు తాపడం, వాకిలికి వెండి తాపడం పనులు చెస్తున్నామని తెలిపారు. స్వామివారికి గోవు ఆధారిత వ్యవసాయంతో పండించిన బియ్యంతో నైవేధ్యం సమర్పిస్తున్నామని సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+