జంక్షన్ లో వైసీపీ ఎమ్మెల్యే కొడుకు బర్త్ డే ఫంక్షన్ .. గంటలకొద్దీ ట్రాఫిక్ జామ్ తో వాహనదారులు ఫైర్
ఏపీ లో ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లా పి .గన్నవరం వైసిపి ఎమ్మెల్యే చిట్టి బాబు కుమారుడు వికాస్ పుట్టినరోజు వేడుకలు వివాదంగా మారాయి. అంబాజీపేట జంక్షన్ లో నడిరోడ్డు మీద వైసీపీ ఎమ్మెల్యే చిట్టి బాబు కుమారుడు వికాస్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం స్థానిక ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగించింది.గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంత ఎమ్మెల్యే కొడుకు అయితే మాత్రం నడిరోడ్డు మీద పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటారా అని స్థానిక ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

నడిరోడ్ మీద ఎమ్మెల్యే కొడుకు పుట్టిన రోజు ..
వికాస్ తన తండ్రి చిట్టి బాబు అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో తనను అడ్డుకునే వారు లేరని రెచ్చిపోయాడు. తనకు ఎదురు లేదు అనుకున్న వికాస్ ఏకంగా నడి రోడ్డు మీదే బర్త్ డే ఫంక్షన్ పెట్టేసాడు. ఇంట్లో ఘనంగా చేసుకోవాల్సిన పుట్టిన రోజు ప్రజలందరికీ తెలియాలని నడి రోడ్ మీద పెట్టి నానా హంగామా చేశారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఎందుకు ట్రాఫిక్ జామ్ అయ్యిందో తెలియక వాహనచోదకులు మొదట ఇబ్బంది పడ్డారు. ఆ తరువాత నడిరోడ్డు మీద జరుగుతున్న బర్త్ డే పార్టీ చూసి అవాక్కయ్యారు.

రెండు గంటలపాటు ట్రాఫిక్ జామ్
రెండు గంటలపాటు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో వాహనచోదకులు నరకాన్ని చూశారు. ఓ సందర్భంలో పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తున్న కార్యకర్తలతో వాగ్వాదానికి దిగారు. నడిరోడ్డుపై వేడుకలు చేసుకోవడం ఏంటని స్థానికులు నిలదీశారు.సాయంత్రం సమయంలో ఐదు గంటలకు ప్రారంభమైన పుట్టినరోజు వేడుకలు 7 గంటల వరకు కొనసాగాయి. ఇక ఈ సమయంలో పాఠశాలల నుండి నుండి ఇళ్లకు వెళ్లే విద్యార్థులకు, ఆఫీసుల నుండి వెళుతున్న ఉద్యోగులకు తీవ్ర అసౌకర్యం కలిగింది.

రోడ్ మీద హంగామా ..సైలెంట్ గా చూసిన పోలీసులు
ఇంతా జరుగుతున్నా, ట్రాఫిక్ కు తీవ్ర విఘాతం కలుగుతున్నా పోలీసులు చోద్యం చూడటం స్థానికులను ఆగ్రహానికి గురి చేసింది. ఎవరైనా రోడ్ మీద వాహనం అడ్డంగా పెడితేనే ఫైన్ లు వేసే పోలీసులు ఏకంగా రోడ్ మీద పుట్టిన రోజు వేడుకలు జరుగుతుంటే సైలెంట్ గా చూస్తూ ఉండిపోయారు. వాహన చోదకులు మాత్రం ఎమ్మెల్యే కొడుకు చేస్తున్న న్యూసెన్స్ కు అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. పుట్టిన రోజు వేడుకలు ఇళ్ళలో చేసుకోవాలి ఇలా నడి రోడ్ మీద కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

జంక్షన్ లో ఎమ్మెల్యే తనయుడి పుట్టినరోజుపై పార్టీలో చర్చ
ప్రజలకు సేవ చేస్తారని ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులు, కుమారుల వింత చేష్టలతో అభాసు పాలవుతున్న సంఘటనలు రాష్ట్రవ్యాప్తంగా చోటుచేసుకుంటున్నాయి.ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా చోటు చేసుకున్న ఈ సంఘటన ఎమ్మెల్యే చిట్టిబాబుకు పెద్ద తలనొప్పిగా మారింది.అంబాజీపేట నడిరోడ్డు మీద వైసిపి ఎమ్మెల్యే తనయుడి పుట్టినరోజు వేడుకల వివాదం ఇప్పుడు వైసీపీ లోనూ చర్చనీయాంశంగా మారింది. మరి ఈ సంఘటనపై వైసిపి అధినాయకత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications